https://oktelugu.com/

Rohit vs Kohli: రోహిత్.. కోహ్లి.. ఎవరిది బెస్ట్  కెప్టెన్సీ..? భారత కెప్టెన్ గా ఎవరు బెటర్..? సోషల్ మీడియాలో రచ్చ

Rohit vs Kohli: టీ20 వరల్డ్ కప్ తరువాత టీమిండియా న్యూజిలాండ్ సిరీస్ ను క్లీన్ స్వీప్ గా గెలుచుకుంది. వరల్డ్ కప్ లో దారుణంగా ఓటమి పాలైన టీమిండియాపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ విజయంతో జట్టుపై మళ్లీ ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఇదే న్యూజిలాండ్ తో వరల్డ్ కప్ మ్యాచులో పోటీపడి ఓడిపోయింది. కానీ ఇప్పుడు ఆడిన మూడు మ్యాచుల్లో ఒక్కటి కూడా అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా గెలిచేసింది. దీంతో క్రీడాభిమానులు సంబరాల్లో మునిగి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2021 11:02 am
    Follow us on

    Rohit vs Kohli: టీ20 వరల్డ్ కప్ తరువాత టీమిండియా న్యూజిలాండ్ సిరీస్ ను క్లీన్ స్వీప్ గా గెలుచుకుంది. వరల్డ్ కప్ లో దారుణంగా ఓటమి పాలైన టీమిండియాపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ విజయంతో జట్టుపై మళ్లీ ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఇదే న్యూజిలాండ్ తో వరల్డ్ కప్ మ్యాచులో పోటీపడి ఓడిపోయింది. కానీ ఇప్పుడు ఆడిన మూడు మ్యాచుల్లో ఒక్కటి కూడా అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా గెలిచేసింది. దీంతో క్రీడాభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అయితే ఇదంతా కెప్టెన్ రోహిత్ శర్మతోనే సాధ్యమైందని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టకు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి ఆ తరువాత ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అలాగే తాను తప్పుకోవడంతో ఆయన స్థానంలో రోహిత్ శర్మను నియమించారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ సిరీస్ గెలవడంతో కోహ్లి, రోహిత్ శర్మను పోలుస్తూ చర్చలు జరుపుతున్నారు.

    virat kohli rohit sharma

    virat kohli rohit sharma

    రోహిత్ శర్మ భారత కెప్టెన్ గా విరాట్ కోహ్లి ప్లేసులో రావడమే కాకుండా ఆయన రికార్డును కూడా బద్దలు కొట్టారు. టీ 20 ఫార్మట్ లో విరాట్ కోహ్లి ఇప్పటి వరకు 29 సార్లు 50 పరుగులు చేశారు. కానీ రోహిత్ శర్మ న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో 30వ హాఫ్ సెంచరీ చేసి కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో మూడోస్థానంలో పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అజం 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో రోహిత్ 150వ సిక్సర్ కొట్ట రికార్డు సృష్టించారు. అంతకుముందు న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ 165 సిక్సర్లతో ముందున్నాడు.

    ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘ఐపీఎల్ లో గత సీజన్ వరకు విరాట్ కోహ్లి కెప్టెన్ గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ‘రోహిత్ శర్మ… పుల్ షాట్స్’ అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. అయితే కొందరు రోహిత్ ఫాల్ షాట్స్ అని కామెంట్ చేశారు. మరొక వ్యక్తి ఈ పోస్టుకు అడ్మిన్ మారిపోయాడా అని కామెంట్ చేశాడు. అమరనాథ్ ఆచార్య అనే వ్యక్తి ‘కోహ్లి నేతృత్వంలో టీమిండియా మల్టీనేషన్ సిరీస్ గెలిచిందా..? తాను ఒక్క సిరీస్ కూడా గెలిపించలేకపోయాడు. అందుకే రోహిత్ బెటర్ ధ్యాన్ కోహ్లి’ అని ట్యాగ్ చేస్తూ పెట్టాడు.

    ఇక న్యూజిలాండ్ సిరీస్ గెలుపు నేపథ్యంలో కోచ్ ద్రావిడ్ పై కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా నియమితులైన ద్రావిడ్ సరైన నిర్ణయాలతోనే విజయం దక్కిందని అంటున్నారు. ‘రోహిత్ శర్మ, ద్రావిడ్ కోచ్ నేతృత్వంతో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. భారత జట్టుకు శుభాకాంక్షలు’ అని బీసీసీఐ సెక్రెటరీ జైషా ట్వీట్ చేశారు. ‘ఇది వారిద్దరికి చక్కటి ఆరంభం. ముందు ముందు మరిన్ని సిరీసులు గెలవాలని అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశారు.

    Also Read: పంత్ పై రోహిత్ కు ఎందుకు కోపమొచ్చింది?

    కోహ్లి ఇప్పటి వరకు టీ20 మ్యాచుల్లో 50 పైగా మ్యాచ్ లకు కెప్టెన్సీ  చేశాడు. వాటిలో టీమిండిమా 30 గెలిచింది. 16 ఓడిపోయింది. రెండు టై, మరో రెండిట్లో ఫలితం తేలలేదు. అయితే రోహిత్ కెప్టెన్సీ లో ఎలా ఉంటుందోనని చర్చించుకుంటున్నారు. ఇక త్వరలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కొనసాగనుంది. దీంతో రోహిత్ ఆల్ టైం కెప్టెన్సీగా ఉండాలని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ముంద ముందు ఏం జరుగుతుందో చూడాలి.

    Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీలో జరిగిన అతి పెద్ద తప్పు ఇదే