Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా టీం వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇలాంటి క్రమంలో ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి జట్లను చిత్తు చేసిన ఇండియా నెక్స్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ని చిత్త చేయడానికి రెడీ అవుతుంది, ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్న ఇండియా దూకుడుని ఇక మీదట ఆడే టీములు ఏ మాత్రం ఆపలేవు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఇండియన్ టీం ప్లేయర్లదరూ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు వాళ్లని ఆపడం ఏ జట్లకి సాధ్యమయ్యే విధంగా కనిపించడం లేదు. ఇండియా టీం బ్యాటింగ్ లైనప్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇండియాలో ఓపెనర్ ప్లేయర్లు అయిన శుభ్ మన్ గిల్ , రోహిత్ శర్మ ఇద్దరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు.గిల్ డెంగ్యూ కారణం గా మొదటి రెండు మ్యాచ్ లకి దూరమైన కూడా పాకిస్తాన్ మీద ఆడడం జరిగింది.
ఈ మ్యాచ్ లో ఆయన కొంతవరకు విఫలమైనా కూడా ఆయన ఆడిన బ్యాటింగ్ స్టైల్ మాత్రం అందరినీ ఆకర్షించింది. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే ఆస్ట్రేలియా తో ఆడిన మొదటి మ్యాచ్ లో డక్ అవుట్ అయినప్పటికీ తర్వాత ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఆఫ్ఘనిస్తాన్ మీద సెంచరీ నమోదు చేశాడు.అలాగే పాకిస్తాన్ మీద ఆఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇలాంటి క్రమంలో రోహిత్ శర్మ దూకుడుని పవర్ ప్లే లో ఆపే దమ్మున్న బౌలర్ ఏ టీంలో కనిపించడం లేదు.ఎందుకంటే రోహిత్ శర్మ పవర్ ప్లే లో ప్రతి బౌలర్ ని దూకుడుగా ఎదురుకుంటు భారీ పరుగులు చేస్తున్నాడు.ఇక అలాగే విరాట్ కోహ్లీ విషయానికి వస్తే కోహ్లీ ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీ లు నమోదు చేసుకున్నాడు. ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియా మీద రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చాలా దారుణమైన సిచువేషన్ లో పడినప్పుడు ఇండియన్ టీం మిడిల్ ఆర్డర్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి ఇండియన్ టీం కి ఒక అరుదైన విజయాన్ని అందించింది.
ఆ ఒక్క మ్యాచ్ చాలు మన మిడిల్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పడానికి… ఇక కే ఎల్ రాహుల్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా మీద ఆడిన మొదటి మ్యాచ్ లో 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇండియన్ టీం లో ఓపెనర్లు ఫెయిల్ అయినప్పటికీ మా మిడిల్ ఆర్డర్ పవర్ ఏంటో నేను చూపిస్తా అనుకొని చివరి వరకు ఉంటూ మ్యాచ్ మొత్తాన్ని తన భుజాల పైన వేసుకుని చివరి వరకు ఉండి మ్యాచ్ ని గెలిపించాడు…. అలా ఇండియన్ టీంలో ఉన్న ప్రతి బ్యాట్స్ మెన్ కూడా తనదైన రీతిలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడానికి ఎప్పుడు రెడీగా ఉంటున్నారు. అలాగే శ్రేయాస్ అయ్యర్ కూడా ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడటానికి ఎప్పుడు రెఢీ ఉంటాడు…ఇండియన్ ప్లేయర్లు అవకాశం వచ్చిన ప్రతిసారి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు…
ఇక ఇండియన్ బౌలర్ల విషయానికి వస్తే మహమ్మద్ సిరాజ్ గానీ, జస్ప్రిత్ బుమ్రా గానీ, పేస్ బౌలింగ్ లో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ పై ఎటాక్ చేస్తూ వాళ్లపైన ప్రెజర్ పడేలా బాల్స్ వేస్తూ పరుగులు రాకుండా కట్టడి చేసి వాళ్ల ని స్కోర్ చేయకుండా ఇబ్బంది పెడుతూ వికెట్లను తీస్తున్నారు. ఇక జరిగిన మూడు మ్యాచ్ లను కనుక చూసుకుంటే మన బౌలర్లు మూడు టీమ్ లను కూడా 200 పరుగుల లోపే కట్టడి చేయడం విశేషమనే చెప్పాలి. ఇక మూడు మ్యాచ్ ల్లో మొత్తం 28 వికెట్లు తీశారు.
పాకిస్తాన్ మీద జరిగిన మ్యాచ్ లో బుమ్రా స్లో కట్టర్ వేసి ఆఫ్ స్టంప్ ని ఎగరగొట్టడం అనేది చాలా అద్బుతం అనే చెప్పాలి.ముఖ్యంగా క్రీజ్ లో పాతుకుపోయిన మహమ్మద్ రిజ్వాన్ ను అలా అవుట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి బుమ్రా చూపించాడు. రవీంద్ర జడేజా గానీ, కుల్దీప్ యాదవ్ గానీ ప్రతి ఒక్క బౌలర్ కూడా ప్రతి మ్యాచ్ లో డు ఆర్ డై మ్యాచ్ ఆడినంత గొప్పగా ప్రతి మ్యాచ్ ఆడుతున్నారు. కాబట్టి ఇండియన్ టీం ని ఈ సిచువేషన్ లో ఓడించే టీమ్ ఒక్క టీమ్ కూడా కనిపించడం లేదు. ఇక ఇండియా తర్వాత మ్యాచ్ లు ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక లాంటి జట్ల పై ఆడనుంది.ఇక ఇప్పటికే శ్రీలంక ని ఏషియా కప్ ఫైనల్లో ఇండియా దారుణంగా ఓడించింది. 50 పరుగులకు ఆలౌట్ చేసి వాళ్ల పరువు మొత్తం తీసేసింది.ఇక శ్రీలంక టీమ్ ఇప్పుడు మన మీద గెలుస్తుంది అనే నమ్మకం అయితే ఎవరికీ లేదు. ఇక అదే విధంగా ఇంగ్లాండ్ టీం కూడా ప్రస్తుతం అంత మంచి ఫామ్ లో అయితే కనిపించడం లేదు. వరుసగా న్యూజిలాండ్ , ఆఫ్ఘనిస్తాన్ టీముల మీద ఓడిపోయి వాళ్లు చాలా ఢీలా పడిపోయారు.అలాగే న్యూజిలాండ్ టీమ్ విషయానికి వస్తే ఈ టీమ్ లో మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ ఉన్నప్పటికీ మనకు కొంత వరకు పోటీ అయితే ఇస్తుంది .కానీ మన మీద పై చేయి సాధించేంత గొప్పగా అయితే న్యూజిలాండ్ టీమ్ ఆడలేదు.
ఇక సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే వాళ్ళ టీం చాలా వరకు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ ఇండియన్ టీమ్ మీద వాళ్ళు ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తారనే విషయం తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఏడాదిలో సౌత్ ఆఫ్రికా తో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు దానివల్ల వాళ్ళు ఇండియన్ టీం ని ఎలా ఎదుర్కొంటారు వాళ్ల బౌలింగ్ డిపార్ట్మెంట్ మన ప్లేయర్లు ఎలా ఎదుర్కొంటారు అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది.సౌతాఫ్రికా టీమ్ ని మినహాయిస్తే మిగిలిన జట్లు ఏవి కూడా ఇండియాకి అంత పెద్ద పోటీ అయితే కాదని తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా ఈసారి వరల్డ్ కప్ కొట్టడానికి ఇండియా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుగా అర్థమవుతుంది. ఏ టీంకి అయిన కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇండియా దూకుడుని ఆపడం మాత్రం అసాధ్యమనే చెప్పాలి… ఎందుకంటే ప్రస్తుతం ఇండియా అన్ని విభాగాల్లో ప్రపంచంలోనే ది బెస్ట్ టీమ్ గా అవతరించింది….