India Vs Australia World Cup Final: వరల్డ్ కప్ 2023 లో భాగంగా ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీం ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు ఎవరిపైన విజయం సాధిస్తారు అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. ఇంతకుముందు ఆస్ట్రేలియా నాకౌట్ మ్యాచ్ ల్లో ఆడిన అనుభవం ఎక్కువగా ఉండటం వల్ల వాళ్లకు అదే ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఇండియన్ టీం ప్రస్తుతం ఉన్న ఫామ్ లో వరుస విజయాలను అందుకున్నారు కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా ఈజీగా గెలిచేస్తారనే దృఢ సంకల్పంతో ఇండియా ఉంది.ఇక ఇది ఇలా ఉంటే రెండు టీములు కూడా ఎవరికి వాళ్లు బలంగా ఉన్నారు. అయినప్పటికీ ఏ టీమ్ మే కొద్ది వరకు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది ఎందుకు అంటే ప్రస్తుతం ఇండియా ఆడిన 10 మ్యాచ్ ల్లో వరుస విజయాలను అందుకుంది. ఇక దాంతో పాటుగా ప్లేయర్లు ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ గా ఉన్నారు ఎవరికివారు అవకాశం దొరికిన ప్రతిసారి దూసుకుపోతున్నారు.ఇక ఇలాంటి సమయంలో ఒక్కసారి మన ప్లేయర్లని వాళ్ల ప్లేయర్స్ ని కనక ఒకసారి పోల్చుకున్నట్లైతే వన్ టూ వన్ చూస్తే ఎవరి బలం ఎంత అనేది తెలిసిపోతుంది. ఒక్కసారి ప్లేయర్ల బలాబలాలను చూసుకుందాం…
ముందుగా మన ఓపెనర్ ప్లేయర్ అయిన శుభ్ మన్ గిల్ అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ యువర్ ప్లేయర్ అయిన హెడ్ ని పోల్చినట్టయితే ఇద్దరూ కూడా ఓపెనర్లుగా చాలా కన్సిస్టెన్సీ పర్ఫామెన్స్ ని ఇస్తు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడుతూ వస్తున్నారు కాబట్టి ఇద్దరు సమానంగా ఉన్నారు…
ఇక ఇంకో ఓపెనర్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా మరో ఒపెనర్ ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్…వీళ్ళిద్దరూ కూడా బ్యాటింగ్ పరంగా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అంటే ఇద్దరు భారీ పరుగులు చేస్తూ సమానమైన ఫామ్ లో ఉండటం వల్ల ఇండియన్ ఓపెనర్లు ఆస్ట్రేలియా ఓపెనర్లు సమానమైన పొజిషన్ లో ఉన్నారని తెలుస్తుంది.
ఇండియన్ టీమ్ వన్ డౌన్ ప్లేయర్ గా కింగ్ విరాట్ కోహ్లీ ఉండగా,ఆస్ట్రేలియన్ వన్ డౌన్ ప్లేయర్ గా మిచెల్ మార్ష్ ఉన్నాడు. వీళ్ళిద్దరిలో మూడు సెంచరీలు, నాలుగు ఆప్షన్లు చేసి ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ తో పోల్చుకుంటే మిచెల్ మార్ష్ ఆయనతో పోటీకి పనికిరాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కోహ్లీ ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ విజయాన్ని అందించడంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నాడు. కానీ మార్ష్ అలా కాదు వస్తున్నాడు ఆడుతున్నాడు తర్వాత ఔట్ అయి వెళ్లిపోతున్నాడు. ఒక కన్సిస్టెన్సీ తో ఇన్నింగ్స్ చివరిదాకా ఆడడంలో మార్ష్ ఫెయిల్ అయిపోతున్నాడు…
ఇక నెక్స్ట్ నెంబర్ ఫోర్ లో శ్రేయస్ అయ్యర్ ఉండగా ఆస్ట్రేలియన్ టీం లో నెంబర్ బ్యాట్స్ మెన్ గా స్టీవ్ స్మిత్ ఉన్నాడు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ అంత మంచి ఫామ్ లో లేడు.శ్రేయాస్ అయ్యర్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో వరుసగా రెండు సెంచరీలు చేసి, తన ఫామ్ ని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ ప్లేస్ లో కూడా ఇండియన్ టీమ్ దే ఆధిపత్యం…
ఇక నెంబర్ ఫైవ్ లో కే ఎల్ రాహుల్ ఉన్నాడు…రాహుల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉండగా ఆస్ట్రేలియన్ టీంలో ఇంగ్లీస్ అంత మంచి ఫామ్ లో అయితే లేడు రాహుల్ తో పోల్చుకుంటే పోటీపడే రేంజ్ అయితే ఇంగ్లీస్ ఈ టోర్నీలో అంత మంచి పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేకపోతున్నాడు. రాహుల్ ఇప్పటికే ఒక సెంచరీ, అలాగే వరుస ఆఫ్ సెంచరీలు చేస్తూ ఇండియన్ టీం కి అద్భుతమైన విజయాలను అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నాడు…
ఇక నెంబర్ 6 లో సూర్య కుమార్ యాదవ్ ఉండగా ఆస్ట్రేలియా టీమ్ లో లబుషణ్ ఉన్నాడు.లబుషణ్ ఇంతకుముందు తో పోల్చుకుంటే ఇప్పుడు పేలవమైన పర్ఫామెన్స్ ఇస్తున్నాడు.ఇక మన సూర్య కుమార్ యాదవ్ కూడా
తనకు అవకాశం వచ్చినప్పుడు ఎంతో కొంత రన్స్ చేస్తున్నాడు కాబట్టి ప్రస్తుతం వీళ్ళిద్దరూ సమానమైన సిచువేషన్ లో ఉన్నారనే చెప్పాలి…
ఇక ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా ఇండియన్ టీం కి ప్రాతినిధ్యం వహించగా, గ్లెన్ మాక్స్ వెల్ ఆస్ట్రేలియా టీం కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక వీళ్లిద్దరూ కూడా సమానమైన సిచ్ వేశన్ లోనే ఉన్నారు ఎందుకంటే ఇద్దరు బాల్ తో బ్యాట్ తో రెండింటితో అదరగొడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ సరైన హోదా దక్కుతుందనే చెప్పాలి…
ఇండియన్ టీం తరుఫున పేస్ బౌలర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జస్ఫ్రీత్ బుమ్ర వికెట్లు తీయగా, ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన స్టార్క్ , బుమ్రా కి పోటీ ఇచ్చే స్థాయిలో అయితే వికెట్లు తీయడం లేదు. కాబట్టి వీళ్ళిద్దరిలో బుమ్రా కొంతవరకు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు…
ఇంకో పేసరైన మహమ్మద్ సిరాజ్ కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ జ్యూస్ హాజిల్ వుడ్ తో పోల్చుకుంటే సిరాజ్ కంటే హజిల్ వుడ్ మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో ఆస్ట్రేలియా ప్లేయర్ పై చేయి సాధించాడు.
ఇక స్పిన్నర్ లో ఇండియన్ టీం మీన్స్ పిన్ బౌలర్ అయినా తనదైన పర్ఫామెన్స్ ఇస్తూ ఇండియన్ టీం కి మంచి విజయాలను అందిస్తున్నాను అలాగే ఆస్ట్రేలియా టీంలో ఉన్న ఆడమ్ జంపా కూడా తనదైన గేమ్ ఆడుతూ ప్రత్యర్థి వికెట్లు తీస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు…..
ఇక ఇండియన్ టీమ్ మరో పేస్ బౌలర్ అయిన మహమ్మద్ షమీ ఆరు మ్యాచ్ ల్లో 23 వికెట్లు తీసి ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా మంచి గుర్తింపు పొందగా పాట్ కమ్మిన్స్ షమీతో పోటీపడి గెలవలేకపోయాడు. ఎందుకంటే డబుల్, త్రిబుల్ బెటర్ పర్ఫామెన్స్ ఇస్తూ షమీ ముందుకు దూసుకెళ్తున్నాడు….
ఇక ఇందులో 6 పొజిషన్ లలో ఇండియా పై చేయి సాధించగా, 4 ప్లేసుల్లో రెండు టీమ్ లు సమానమైన పొజిషన్ లో ఉన్నాయి. ఇక ఒక్క ప్లేయర్ విషయం లో ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది…