Shikhar Dhawan (2)
Shikhar Dhawan : Shikhar Dhawan : మరో బ్యూటీఫుల్ లేడీతో శిఖర్ ధావన్.. ఇంతకీ ఎవరామే.. ఇద్దరూ డేటింగులో ఉన్నారా ఏంటి ?
Shikhar Dhawan : దుబాయ్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ మ్యాచ్ జరిగింది. చాలా మంది మాజీ భారత క్రికెటర్లు స్టేడియంలో కూర్చుని మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఈ మ్యాచ్ చూడటానికి శిఖర్ ధావన్ కూడా దుబాయ్ స్టేడియానికి చేరుకున్నాడు. ఈ సమయంలో భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఓ మిస్టరీ గర్ల్ తో కనిపించారు. మరోసారి ధావన్ అదే అమ్మాయితో కలిసి ఈ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. శిఖర్ ధావన్, మిస్టరీ గర్ల్ ఒకరికొకరు చాలా దగ్గరగా కూర్చున్న వీడియోను ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్ ఇద్దరూ స్టేడియంలో కూర్చుని భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వీడియో ప్రారంభంలో స్టేడియాన్ని చూపించారు. ఆ తర్వాత ఇర్ఫాన్ కెమెరాను తన వైపుకు తిప్పుకుంటాడు. తర్వాత అతను దగ్గర్లో కూర్చున్న శిఖర్ వైపు కెమెరాను తిప్పాడు. ధావన్ పక్కన ఒక ‘మిస్టరీ గర్ల్’ కూడా కూర్చుని ఉంది. ఈ అమ్మాయి ఐర్లాండ్ నుండి వచ్చింది. ఆమె పేరు సోఫీ షైన్.
ధావన్ సోఫీతో డేటింగ్ చేస్తున్నాడా?
సోఫీ, ధావన్ మరోసారి కలిసి కనిపించడంతో శిఖర్ ధావన్ కొత్త భాగస్వామిని సెలక్ట్ చేసుకున్నారని సోషల్ మీడియాలో చర్చలు ముమ్మరం అయ్యాయి. ధావన్ కూడా సోషల్ మీడియాలో సోఫీని ఫాలో అవుతున్నాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. ఈ విషయంపై వారిద్దరి నుండి ఎటువంటి ప్రకటన రాకపోయినప్పటికీ వారిద్దరూ పదే పదే కలిసి కనిపించడం వల్ల వారిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు వ్యాపిస్తున్నాయి. 39 ఏళ్ల శిఖర్ ధావన్ 2012 సంవత్సరంలో ఆయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు. కానీ తొమ్మిది సంవత్సరాల వివాహం తర్వాత, వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2021 సంవత్సరంలో విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్నారు. విడాకుల తర్వాత ధావన్ ఇప్పుడు ఒక ఐరిష్ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వస్తున్నారు.