Boxing Day Test: ఇక ఈ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ నాలుగో టెస్ట్ ఆడనున్నాయి. డిసెంబర్ 26 నుంచి ఈ టెస్ట్ మొదలు కానుంది. మెల్ బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే దీనిని బాక్సింగ్ డే టెస్ట్ అని పిలుస్తారు. వాస్తవానికి టెస్ట్ క్రికెట్ లో ఏ మ్యాచ్ కైనా ప్రత్యేకంగా పేరు ఉండదు. కానీ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ కు బాక్సింగ్ అని పేరు పెడతారు. స్థూలంగా బాక్సింగ్ డే టెస్ట్ అని వ్యవహరిస్తుంటారు.. బాక్సింగ్ డే ను బ్రిటన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.. అయితే దీని వెనుక అనేక కథలు ఉన్నాయి. డిసెంబర్ నెలను పాశ్చాత్య దేశాల ప్రజలు క్రిస్మస్ మాసం గా పేర్కొంటారు. క్రిస్మస్ సందర్భంగా కొంతమంది వ్యక్తులు సెలవులు తీసుకోకుండా పనిచేస్తుంటారు. అలా పనిచేస్తున్న వ్యక్తులకు మరుసటి రోజు సెలవు ఇస్తారు. అంతేకాదు ఒక పెట్టను గిఫ్ట్ గా ఇస్తారు. అందువల్లే పాశ్చాత్య దేశాలలో డిసెంబర్ 26 ను బాక్సింగ్ డే అని అంటారు.. డిసెంబర్ 25 క్రిస్మస్ కాబట్టి.. ఆ మరుసటి రోజు నిర్వహించే టెస్ట్ కాబట్టి దానికి బాక్సింగ్ డే టెస్ట్ అని పిలుస్తుంటారు.
అంతర్జాతీయ క్రికెట్లో..
అంతర్జాతీయ క్రికెట్లో బాక్సింగ్ డే కు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.. క్రిస్మస్ మరుసటి రోజు నుంచి ఈ టెస్ట్ మొదలవుతుంది కాబట్టి దీనిని బాక్సింగ్ టెస్ట్ అని పిలుస్తుంటారు.. 1950లో యాషెస్ సిరీస్ జరిగిన సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ మొదటి మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత నుంచి ఆస్ట్రేలియా ప్రతి ఏడాది బాక్సింగ్ డే టెస్ట్ నిర్వహిస్తోంది. 1984, 1988, 1994 లో వివిధ కారణాలవల్ల బాక్సింగ్ డే టెస్ట్ జరగలేదు. క్రిస్మస్ కు ముందు ఆస్ట్రేలియా మ్యాచ్ జరిపింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా ప్రతి ఏడాది బాక్సింగ్ డే టెస్టులలో తలపడతాయి.
మెల్బోర్న్ లోనే ఎందుకు?
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో 1950లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు మొదటి బాక్సింగ్ డే నిర్వహించారు. ఇక ఈ మైదానంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి బాక్సింగ్ డే టెస్ట్ జరిగింది. ఆస్ట్రేలియా దేశ వాళి టోర్నీ ( షె ఫీల్డ్ షీల్డ్ ) 1892లో మొదటిసారిగా జరిపారు. 1980 తర్వాత ప్రతి ఏడాది బాక్సింగ్ డే టెస్ట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు.. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్ట్ మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో జరగనుంది. అడిలైడ్ మాదిరిగానే మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ ను చూసేందుకు వేలాదిమంది ప్రేక్షకులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. క్రిస్మస్ మరసటి రోజు కాబట్టి.. ఈ మ్యాచ్ కు ప్రేక్షకులు భారీగా హాజరయ్యే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మీడియా చెబుతోంది.