Rohit Sharma: టీమిండియా పరిస్థితి అధ్వానంగా మారుతోంది. ఏడాది కాలంలో ఏడుగురు కెప్టెన్లు మారడంతో జట్టు పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో కెప్టెన్ గా ఉండేవారు కొన్ని ఏళ్లు నిరాటంకంగా ఉండటంతో ఎలాంటి సమస్యలు వచ్చేవి కావు. కానీ ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వస్తోంది. ఎవరు కూడా నాయకుడిగా సమర్థవంతంగా సేవలు అందించలేకపోతున్నారు. గాయాల భారంతో మ్యాచులకు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా కెప్టెన్లను మార్చాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో ఏ సిరీస్ కు ఎవరు కెప్టెన్ అనే సందేహాలు అభిమానుల్లో వస్తున్నాయి. ఎప్పుడు ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారో కూడా అర్థం కావడం లేదు.
2021 జూన్ లో విరాట్ కోహ్లి సారధ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో శ్రీలంకలో పొట్టి క్రికెట్ కు శిఖర్ ధవన్ సారధ్యం వహించాడు. దీంతో అదే ఏడాది టీ20 ప్రపంచ కప్ ముగిశాక సారధ్య బాధ్యతల నుంచి కోహ్లి తప్పుకున్నాడు. స్వదేశంలో టీ20 మ్యాచులకు రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు వహించాడు. న్యూజీలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో విరాట్ కోహ్లి నిష్క్రమించడంతో రెహానే కెప్టెన్ గా ఉన్నాడు. దీంతో టీమిండియా కెప్టెన్లను మార్చుకుంటూ వస్తోంది.
Also Read: BJP Politics: రాజకీయ ప్రత్యుర్థులే అవినీతి పరులా..? సొంత పార్టీలోని వారు నీతిమంతులా..?
కెప్టెన్సీ విషయంలో విమర్శలు రావడంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకోగా దక్షిణాఫ్రికా టూర్ లో కేఎల్ రాహుల్ ను సారధిగా నియమించారు. దీంతో కోహ్లి పూర్తిగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి దూరం కావడం జరిగింది. దీంతో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించారు. ఇక అప్పటి నుంచి రోహిత్ శర్మ పూర్తిస్థాయి కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. కానీ గాయాల కారణంగా అతడు పలు మ్యాచులకు దూరం కావడంతో వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ కు బాధ్యతలు అప్పగించేవారు. ఈ నేపథ్యంలో అతడు కూడా గాయాల పాలు కావడంతో ఎవరో ఒకరిని కెప్టెన్ గా నియమించే అవసరం బీసీసీఐకి ఏర్పడింది.
అందరు గాయాల పాలు కావడంతో ఇక మూడో స్థానంలో ఉన్న రిషబ్ పంత్ కు బాధ్యతలు అప్పగించారు. అదే సందర్భంలో దక్షిణాఫ్రికా టూర్ కు రిషబ్ పంత్ ఎంపిక కావడంతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే జట్టుకు హార్థిక్ పాండ్యాకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. దీంతో కెప్టెన్లను మార్చిన ఘనత బీసీసీఐకే దక్కుతుంది. ఒక ఏడాదిలో సుమారు ఏడుగురు ఆటగాళ్లను మారుస్తూ బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుని టీమిండియాలో సారధి ఎవరనే అనుమానం ప్రస్తతం అందరికి వస్తోంది.
రోహిత్ శర్మకు గాయాలు కావడంతోనే ఆయన ఫిట్ గా లేకపోవడంతోనే అతడిని బీసీసీఐ ఎంపిక చేయడం లేదు. దీంతో అతడు అన్ని మ్యాచులకు దూరంగా ఉండాల్సి వస్తోంది. దీనికి తోడు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం అదే బాటలో నడుస్తున్నాడు. దీంతో టీమిండియాకు అనుభవజ్జుల కొరత ఏర్పడటంతో ఓటములే మూటకట్టుకుంటోంది. మొత్తానికి రోహిత్ శర్మ గాయాల నుంచి ఎప్పుడు కోలుకుంటాడో టీమిండియా ఎప్పుడు గాడిన పడుతుందో తెలియడం లేదు.
Also Read:Telangana Congress Leaders: తెలంగాణ కాంగ్రెస్: చేసుకున్నోళ్లకు చేసుకున్నంత!