Ruturaj Gaikwad: ఇండియా సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడో మ్యాచ్ లో రెండో టి20 మ్యాచ్ లో ఏ ప్లేయర్లతో అయితే బరిలోకి దిగిందో మూడోవ మ్యాచ్ లో కూడా అదే ప్లేయర్లతో బరిలోకి దిగింది. రెండో టి20 మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్న ఇండియన్ టీం ఏమాత్రం భయపడకుండా మళ్ళీ అదే టీమ్ తో బరిలోకి దిగింది.ఇక రాహుల్ ద్రావిడ్ తను వేసే ప్లాన్లు ఎలా ఉంటాయి అనడానికి మూడవ టి20 ని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఆయన ఎవరు విమర్శించిన గాని వాటిని పట్టించుకోడు తనకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రాలజీ లోనే ముందుకు కదులుతూ ఉంటాడు.
అందులో భాగంగానే మూడో టి20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేశారు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ద్రావిడ్ చేసిన మిస్టేక్స్ ఏంటంటే రెండో మ్యాచ్ లో ఫెయిల్ అయిన తిలక్ వర్మని అలాగే శుభ్ మన్ గిల్ ని తీసేసి రుతురాజ్ గైక్వాడ్ ని, శ్రేయస్ అయ్యర్ ని టీం లోకి తీసుకుంటే బాగుండేదని పలువురు సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. అయినప్పటికీ రాహుల్ ద్రావిడ్ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా మళ్ళీ అదే టీం తో బరిలోకి దిగడం అనేది కొంతవరకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక తిలక్ వర్మ శుభ్ మన్ గిల్ మరోసారి మూడో టి20 లో ఫెయిల్ అయ్యారు… ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ రుతు రాజ్ గైక్వాడ్ ని టీమ్ లోకి తీసుకోవడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంతకుముందు అండర్ 19 ప్రపంచకప్ లో కూడా ద్రావిడ్ కోచ్ గా ఉన్నప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ని టీం లోకి తీసుకోవడానికి ద్రావిడ్ ఇష్టపడలేదు.
ఆయన విశ్రాంతి సమయం లో ఉన్నప్పుడు కానీ, వెళ్లిపోయిన తర్వాత కానీ గైక్వాడ్ కి మంచి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మరొకసారి అలానే అవుతుంది అంటూ పలువురు సీనియర్లు అలాగే కొంతమంది అభిమానులు కూడా ద్రావిడ్ పైన విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా మీద జరిగిన మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ తనదైన రీతిలో ఒక అద్భుతమైన సెంచరీ చేసి ఇండియన్ టీం ను విజయ తీరాలకి చేర్చాడు.
అలాంటి ఒక మంచి లో ఫామ్ లో ఉన్న ప్లేయర్ ని ఇలాంటి కీలకమైన సమయం లో పక్కన పెట్టడం అనేది కరెక్ట్ విషయం కాదు. కానీ ద్రావిడ అవి ఏమి పట్టించుకోకుండా అతన్ని పక్కన పెట్టి తన ఇష్టారాజ్యంగా ప్లేయర్లను తీసుకుంటూ మ్యాచ్ లు ఆడిస్తున్నాడు అనేది మాత్రం వాస్తవం. నిజానికి మూడో మ్యాచ్ గెలిచింది కాబట్టి పర్లేదు కానీ ఒకవేళ ఓడిపోయి ఉంటే మాత్రం ద్రావిడ్ మీద విపరీతమైన విమర్శలు వచ్చేవి…