Vinesh Phogat : పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో స్వర్ణం ఖాయం అనుకుంటున్న దశలో భారత్ కు అనుకోని షాక్ తగిలింది. సెమీ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ప్రతిభ చూపిన వినేశ్ ఫొగాట్ పై ఫైనల్ మ్యాచ్లో అనర్హత వేటు వేయడంతో అభిమానుల గుండె పగిలింది. కచ్చితంగా మెడల్ దక్కుతుంది అనుకుంటున్న సమయంలో ఈ ఎదురు దెబ్బ తగలడంతో దేశం యావత్తు షాక్ కు గురైంది. వినేశ్ ఫొగాట్ విషయంలో ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల దేశం యావత్తు ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి.”ఇవేం పనికిమాలిన నిబంధనలు.. తీరా మెడల్ దక్కించుకునే సమయంలో ఇలాంటి నిబంధనలను తెరపైకి తీసుకొస్తున్నారు. భారత్ ఆశలను అడియాసలు చేస్తున్నారంటూ” నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా భారత ఒలింపిక్ కమిటీ నిరసన వ్యక్తం చేసినా, వినేశ్ ఫొగాట్ తీవ్రంగా ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో రెజ్లింగ్ నిబంధనలు ఎలా ఉన్నాయనే చర్చ మొదలైంది..
నిబంధనలు ఎలా ఉన్నాయంటే..
ఒలింపిక్స్ లో ప్రీ స్టయిల్ రీజనింగ్ పురుషుల విభాగంలో 57 నుంచి 125 కిలోల బరువు మధ్య 6 కేటగిరీలు ఉన్నాయి. మహిళల విషయంలో 50, 53, 57, 62, 68, 76 కిలోల విభాగాలు ఉన్నాయి. మన దేశానికి చెందిన వినేశ్ ఫొగాట్ 50 కిలోల విభాగంలో పోటీ పడింది. ఒలింపిక్ నిబంధనల ప్రకారం ఆయా విభాగాలలో పోటీపడే క్రీడాకారులను నిర్ధారించేందుకు.. పోటీ జరిగే ఉదయం బరువును కొలుస్తారు. ఇలా బరువు విభాగంలో రెండు రోజులపాటు టోర్నీ జరుగుతుంది. వినేశ్ ఫొగాట్ పోటీలో ఉన్న 50 కిలోల బరువు విభాగంలో టోర్నమెంట్ మంగళ, బుధవారం జరిగాయి. బుధవారం ఫైనల్స్ ఉన్న నేపథ్యంలో పోటీలో ఉన్న క్రీడాకారిణులు కచ్చితంగా తమ విభాగంలో బరువు ఉండేలాగా చూసుకోవాలి.
బరువు తూచే సమయంలో..
పోటీలో ఉన్న క్రీడాకారుల బరువును తూచే సమయంలో నిర్వాహకులు వారికి 30 నిమిషాల పాటు ఎవరు ఇస్తారు. ఈ వ్యవధిలో ఎన్నిసార్లు అయినా సరే వారు తమ బరువును కొలుచుకోవచ్చు. ఈ క్రమంలో వారు ధరించే జెర్సీలతో బరువును కొలుస్తారు. ఇతర ఆరోగ్య పరీక్షలు చేసి, ఎటువంటి అంటువ్యాధులు లేవని నిర్ధారిస్తారు. ఆటగాళ్లు గోళ్లు కత్తిరించుకున్నారో, లేదో కూడా పరిశీలిస్తారు. అయితే బుధవారం రెండో రోజు కూడా పోటీపడే క్రీడాకారిణుల బరువు కొలతలకు 15 నిమిషాలు కేటాయించారు..
వినేశ్ ఫొగాట్ విషయంలో ఎందుకు అలా అంటే నిర్ణయం తీసుకున్నారు..
వినేశ్ ఫొగాట్ మంగళవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ప్రతిభ చూపియండి. ఆ సమయంలో తాను పోటీపడే 50 కిలోల బరువు విభాగంలో తన వెయిట్ ను కంట్రోల్లో ఉంచుకుంది.. ఆయా కేటగిరి పరిధిలో పోటీపడే క్రీడాకారిణులు రెండు రోజులపాటు తన బరువును అదుపులో ఉంచుకుంది. అయితే మంగళవారం రాత్రికి వినేశ్ ఫొగాట్ వేగంగా రెండు కిలోల అదనపు బరువు ఉంది. ఆ రాత్రికి ఆమె జాగింగ్ చేసింది. సైక్లింగ్ లో పాల్గొంది. విరామం లేకుండా స్కిప్పింగ్ చేసింది. దీంతో బరువును చాలా వరకు కంట్రోల్ లో ఉంచుకుంది. అయితే చివరికి 100 గ్రాముల బరువు మాత్రం తగ్గించుకోలేకపోయింది. ఆ బరువును ఆమె తగ్గించుకునేందుకు కాస్త సమయం ఇవ్వాలని భారత ఒలింపిక్ కమిటీ రిక్వెస్ట్ చేసినప్పటికీ.. ఒలింపిక్ అధికారులు ఒప్పుకోలేదు.
ఇప్పుడు మాత్రమే కాదు..
వినేశ్ ఫొగాట్ ఇప్పుడు మాత్రమే కాదు గతంలో జరిగిన టోర్నీలలో 53 కేజీల విభాగంలో పోటీ పడింది. రెజ్లింగ్ లో ఇది సర్వసాధారణం. బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో ఆటగాళ్లు ఇలా ఆడుతూనే ఉంటారు. వినేశ్ ఫొగాట్ బరువు తగ్గడం.. తక్కువ కేటగిరిలో రెజ్లింగ్ కు దిగడం ఇదే తొలిసారి కాదు.. ఒలింపిక్స్ కు అర్హత సాధించేందుకు పోటీపడిన క్వాలిఫైయర్ రౌండ్స్ లోనూ తక్కువ తేడాతో ఆమె బరువును తగ్గించుకుంది. అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పింది. ఇదే సమయంలో బరువును తగ్గించుకునేందుకు వినేశ్ ఫొగాట్ జుట్టు కూడా కత్తిరించుకుంది. తన శరీరం నుంచి రక్తాన్ని కూడా తొలగించింది.. సెమీ ఫైనల్లో బౌట్ గెలిచిన అనంతరం ఆమె నేరుగా సాధన మొదలుపెట్టింది. చివరికి ఆహారం కూడా తీసుకోలేదు. అయినప్పటికీ 100 గ్రాముల బరువు తగ్గించుకోలేకపోవడంతో మెడల్ కు దూరమైంది.