Sanju Samson Cheating : రాజస్థాన్ రాయల్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ అనూహ్య రీతిలో ఔట్ అయ్యాడు. పుట్టిన రోజు అద్భుతమైన ఇన్నింగ్స్ అడతాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఐదు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. సందీప్ శర్మ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. పుట్టిన రోజు నాడు తాను ఔట్ అయిన తీరు రోహిత్ శర్మనే కాదు.. అభిమానులను కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది.
ఐపిఎల్ మరో అరుదైన రికార్డు నమోదైంది. ముంబై – రాజస్థాన్ జట్ల మధ్య ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్ ఐపీఎల్ లో 1000 మ్యాచ్ కావడం గమనార్హం. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంభరిత మ్యాచ్ లో ముంబై జట్టు చివరి ఓవర్ లో అనూహ్యంగా విజయం సాధించింది. చివరి ఓవర్ లో ముంబై జట్టు విజయానికి 17 పరుగులు అవసరం కాగా, టిమ్ డేవిడ్ మొదటి మూడు మూడు సిక్సులు కొట్టి జట్టుకు గొప్ప విజయాన్ని అందించి పెట్టాడు. ఈ విజయంతో రోహిత్ కు జట్టు పుట్టిన రోజు కానుకగా గొప్ప గిఫ్ట్ అందించినట్లు అయింది. ఈ మైదానంలో ఏ జట్టుకు సాధ్యం కాని సరికొత్త రికార్డును నమోదు చేసింది ముంబై జట్టు. అత్యధిక పరుగులు చేజింగ్ చేసిన జట్టుగా నిలిచింది.
అయ్యో పాపం అనిపించిన ఔటైన తీరు..
పుట్టిన రోజు భారీ స్కోర్ చేసి అలరిస్తాడని ఆశించిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలమయ్యాడు. ఐదు బంతులు ఆడి మూడంటే మూడే పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ సీజన్ లో ఆశించిన స్థాయిలో రానించలేకపోతున్నాడు రోహిత్. ఇప్పటి వరకు భారీ స్కోర్ నమోదు చేయలేకపోయాడు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లతో పోలిస్తే.. రాజస్థాన్ మ్యాచ్ లో ఔట్ అయిన తీరు కొంత బాధ కలిగిస్తోంది. ఇది కాంట్రవర్సీగానూ మారిపోయింది. మూడు పరుగులు వద్ద రోహిత్ ఉన్నప్పుడు సందీప్ శర్మ బౌలింగ్ కు వచ్చాడు. రెండో ఓవర్ చివరి బంతికి రోహిత్ బౌల్డ్ అయ్యాడు. చెప్పాలి అంతే రోహిత్ శర్మ ఔట్ కాలేదు. వికెట్ కీపర్ సంజు శాంసన్ వేలు తాకడం, అదే టైమ్ లో బంతి బెయిల్స్ ను దాటి వెళ్లడం ఒకేసారి జరిగింది. దీంతో అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. రోహిత్ వెనక్కి తిరిగి చూసుకోకుండా వెళ్లిపోయాడు. ఈ ఔట్ విషయంలో పెద్ద చర్చే జరుగుతోంది.
వేలు తగలడంతో పడిన బెయిల్..
రోహిత్ శర్మను చీట్ చేసి ఔట్ చేశారు అంటూ పెద్ద ఎత్తున సామజిక మాధ్యమాల్లో దీనికి సంబందించిన వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో రోహిత్ అవుట్ కాలేదని స్పష్టంగా తెలుస్తోంది అని పలువురు పేర్కొంటున్నారు. బంతి బెయిల్ ను తాకలేదని, సంజు చేతి వేలి కారణంగా బెయిల్ లైటింగ్ వచ్చిందని, అతడు చీట్ చేశాడు అంటూ పలువురు పేర్కొంటున్నారు. పుట్టిన రోజు నాడు రోహిత్ శర్మను చీట్ చేసి ఆవుట్ చేశారు అంటూ పలువురు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ కు అన్యాయం జరిగింది అని మాట్లాడుకుంటున్నారు. ఇలా పుట్టిన రోజు నాడే ఇలా ఔట్ కావడం రోహిత్ దురదృష్టమని పలువురు పేర్కొంటున్నారు.
— bot (@SameerKeram2) April 30, 2023