African Kids: టాలెంట్ అనేది ఎప్పుడో ఒక రూపంలో బయటపడుతూనే ఉంటుంది. అప్పుడు వారిలో దాగివున్న ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది. అలాంటి ప్రతిభావంతులు ఎందరో తమ కళను ప్రపంచానికి చూపించక ముందే కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడంటే సోషల్ మీడియా రోజులు కాబట్టి చాలామంది తమ ప్రతిభను వివిధ వేదికల ద్వారా ప్రదర్శిస్తున్నారు. ఎవరి ప్రోత్సాహం లేకుండానే తాము ప్రతిభావంతులమని నిరూపించుకుంటున్నారు. అంతేకాదు విస్తృతమైన ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. మరి ప్రతిభ ఉన్న తమ కళను బయటి ప్రపంచానికి చూపించలేని వారి పరిస్థితి ఏమిటి?
కాదేది అనర్హం
అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ కాదేదీ కవితకు అనర్హమని శ్రీ శ్రీ రాశాడు. అలాగే చిరిగిన చొక్కా, తెగిన చెప్పు, బక్క చిక్కిన దేహం.. కావేవీ డ్యాన్స్ కు అనర్హమని ఈ పిల్లలు నిరూపిస్తున్నారు. ఆఫ్రికా ఖండానికి చెందిన వీరు సోషల్ మీడియా పుణ్యమాని బయటి ప్రపంచానికి తెలిసే అదృష్టానికి నోచుకున్నారు. వీరు డాన్స్ చేస్తే మైకేల్ జాక్సన్ గుర్తుకు వస్తాడు. మీరు స్టెప్పులు వేస్తే ప్రభుదేవా కనిపిస్తాడు. అలాగని వీరేమీ ఖరీదైన దుస్తులు ధరించరు. విలువైన వస్తువులు వాడరు. జస్ట్ తమకు వచ్చిన స్టెప్పులను ఆలవోకగా వేసుకుంటూ వెళ్తారు. వల్లును విల్లులాగా పంచుతారు. తమ సంప్రదాయ గీతాలకు అనుగుణంగా స్టెప్పులు వేస్తారు.
ఇలా బయట పడ్డారు
ఈ పిల్లలు చీకటి ఖండం ఆఫ్రికాకు చెందినవారు. పూర్తి దారిద్రరేఖకు దిగువనున్న కుటుంబాలు వీళ్ళవి. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తూ వీరిని సాకుతున్నారు. స్థానికంగా ఉండే పాఠశాలలో వీరు చదువుతున్నారు. మూడు పూటలా తిండి తినడమే వీరి జీవితంలో ఒక పర్వదినం. అలాంటిది ఈ పిల్లలు తమ ఇష్టాన్ని చంపుకోలేక డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. అలా వీరు చేస్తున్న డ్యాన్స్ ను ఎవరో ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అది చాలా వైరల్ గా మారింది. కొంతతమంది విదేశీ కంపోజర్లు వీరిని వెతుక్కుంటూ వచ్చారు. వారికి వెస్ట్రన్ స్టెప్పుల్లో తర్ఫీదు ఇచ్చారు.. వారి కాస్ట్యూమ్స్ కూడా మార్చారు. తర్వాత వారు కంపోజ్ చేసిన పాటల్లో ఈ పిల్లలకు అవకాశం ఇచ్చారు. దీంతో ఆ పిల్లల సుడి తిరిగింది. యూట్యూబ్లో మిలియన్స్ కొద్ది వ్యూస్ రావడంతో వారి ఆర్థిక పరిస్థితి మారిపోయింది. ఆఫ్రికన్ కిడ్స్ పేరుతో వీరి యూట్యూబ్ ఛానల్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఒల్లును విల్లులా పంచుతారు
ఆఫ్రికన్ కిడ్స్ ఎలాంటి స్టెప్పులైనా అలవోకగా వేస్తారు. తమ దేశ జానపదాలను అద్భుతంగా పడతారు. వీరు కంపోజ్ చేసే స్టెప్పులను వారి ఇంటి పరిసరాల్లోనే చేస్తారు. పైగా వారి నృత్య రీతుల్లో వారి కుటుంబ సభ్యులను కూడా భాగస్వామ్యం చేస్తారు. ఇది రియల్ స్టిక్ గా అనిపిస్తూ ఉంటుంది. పైగా వీరు అంతటి పేదరికం అనుభవిస్తూ కూడా సంతోషంగా డ్యాన్స్ చేయడం చాలా మందికి నచ్చుతున్నది. అందుకే సోషల్ మీడియాలో వీరికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వీరు టీనేజ్ దశలోనే ఉన్నారు. రేపటి నాడు మంచి అవకాశాలు వస్తే ప్రపంచాన్ని దున్నేయగలరు. మొదట్లోనే చెప్పాను కదా టాలెంట్ ఎవడబ్బ సొత్తూ కాదని.. ఏమో వీరిలో ఏ ప్రభుదేవా, మైకేల్ జాక్సన్ ఉన్నాడో ఎవరికి ఎరుక?!
View this post on Instagram