ఆ పుకార్లపై వార్నర్‌‌ క్లారిటీ.. సన్ రైజర్స్ కు గుడ్ న్యూస్

కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ 2020 సీజన్‌ ఆరు నెలల తర్వాత యూఏఈలో జరిగింది. కనీసం ప్లే ఆఫ్‌కు కూడా చేరుకుంటుందా లేదా అని అందరిలోనూ అనుమానాలు ఉండే. కానీ.. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ సేమీ ఫైనల్‌ వరకూ చేరింది వార్నర్‌‌ సారథ్యంలోని సన్‌ రైజర్‌‌ హైదరాబాద్‌ జట్టు. సెకండ్‌ సెమీ ఫైనల్‌లో ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది. అయితే.. సన్‌రైజర్స్‌ జట్టులోని కీలక ప్లేయర్‌‌ కేన్‌ విలయమ్సన్‌ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో హైదరాబాద్‌ […]

Written By: NARESH, Updated On : November 15, 2020 12:12 pm
Follow us on

కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ 2020 సీజన్‌ ఆరు నెలల తర్వాత యూఏఈలో జరిగింది. కనీసం ప్లే ఆఫ్‌కు కూడా చేరుకుంటుందా లేదా అని అందరిలోనూ అనుమానాలు ఉండే. కానీ.. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ సేమీ ఫైనల్‌ వరకూ చేరింది వార్నర్‌‌ సారథ్యంలోని సన్‌ రైజర్‌‌ హైదరాబాద్‌ జట్టు. సెకండ్‌ సెమీ ఫైనల్‌లో ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది. అయితే.. సన్‌రైజర్స్‌ జట్టులోని కీలక ప్లేయర్‌‌ కేన్‌ విలయమ్సన్‌ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో హైదరాబాద్‌ తరఫున ఆడడనే పుకార్లు వచ్చాయి.

Also Read: టీమిండియా జెర్సీ మారిందోచ్.. ఏ రంగునో తెలుసా?

ముంబయి ఎప్పటిలాగే సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి ఐదోసారి విజేతగా నిలిచింది. కాగా.. టోర్నీ అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ మాట్లాడుతూ.. మరో ఆరు నెలల్లో 14వ సీజన్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మరో కొత్త ఫ్రాంచైజీని తీసుకురావాలని చూస్తున్నారు. అహ్మదాబాద్‌ కేంద్రంగా ఆ కొత్త ఫ్రాంచైజీ రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ తర్వతే 2021 సీజన్‌కు సంబంధించి వేలం నిర్వహిస్తారని.. అందులో అన్ని జట్ల ఆటగాళ్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులోభాగంగా హైదరాబాద్‌ టీమ్‌ నుంచి విలియమ్సన్‌ను తీసేస్తారనే పుకార్లు వచ్చాయి. అయితే.. దీనిపై నెటిజన్లు వార్నర్‌‌ను ప్రశ్నించారు. అతడిని తొలగించవద్దని.. మీ తర్వాత ఆశలన్నీ విలియమ్సన్‌ పైనే అని పేర్కొన్నారు.

Also Read: రోహిత్ కం బ్యాక్.. విమర్శలతో ఇండియన్ టీంలోకి తీసుకున్న బీసీసీఐ

దీనికి స్పందించిన వార్నర్‌‌.. విలయమ్సన్‌ను తీసేయరని, తాను కూడా విలయమ్సన్‌ జట్టులో ఉండాలనే కోరుకుంటానని బదులిచ్చాడు. కచ్చితంగా కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను వదులుకోబోమని స్పష్టం చేశాడు. ఈ సీజన్‌లో వార్నర్‌‌ టీమ్‌ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.