Virender Sehwag: భారత క్రికెట్ గతిని మార్చే నిర్ణయం తీసుకోబోతున్న బీసీసీఐ

టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని గతంలో బీసీసీఐ వీరేంద్ర సెహ్వాగ్ ను కోరింది. ఇప్పుడు సెహ్వాగ్ ఆసక్తి చూపించకపోవడంతో ఆ పదవిని అనిల్ కుంబ్లేకు ఈ పదవి దక్కింది. అయితే తాజాగా చీఫ్ సెలెక్టర్ పదవిని సెహ్వాగ్ కు అందించాలని బిసిసిఐ భావిస్తోంది.

Written By: BS, Updated On : June 23, 2023 10:39 am

Virender Sehwag

Follow us on

Virender Sehwag: టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బీసీసీఐలో కీలక పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం భారత గట్టును ఎంపిక చేసే కమిటీకి చీఫ్ ఎవరూ లేరు. ఈ పోస్టులో కొనసాగిన చేతన్ శర్మ ఒక ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోవడంతో ఆ పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం శివ సుందర దాస్ తాత్కాలికంగా చీఫ్ కలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ పదవిని తీసుకోవాలంటూ టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను బీసీసీఐ ఉన్నతాధికారులు అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి లెక్క తేలిక పోవడంతో ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రానట్లు చెబుతున్నారు. ఒకవేళ కలెక్టర్ గా సెహ్వాగ్ అంగీకరిస్తే మాత్రం భారత క్రికెట్ గతిని మార్చే నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకున్నట్లుగా చెప్పవచ్చని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుతం భారత గట్టును ఎంపిక చేసే కమిటీకి చీఫ్ సెలెక్టర్ ఎవరూ లేరు. ఈ బాధ్యతలను టీమిండియా మాజీ క్రికెటర్లకు అందించాలని బీసీసీఐ భావిస్తోంది. మొదట్లో పలువురు పేర్లు ప్రతిపాదన లోకి వచ్చినప్పటికీ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను తీసుకునే ఆలోచనను బీసీసీఐ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, చీఫ్ సెలెక్టర్ కు బిసిసిఐ ఏడాదికి కోటి రూపాయలు వేతనం అందిస్తుంది. అయితే ఈ మొత్తం తక్కువ కావడంతో సీనియర్ క్రికెటర్లు ఈ పోస్టు పట్ల ఆసక్తి చూపించడం లేదు. వీరేంద్ర సెహ్వాగ్ కూడా జీతం తక్కువగా ఉందన్న ఉద్దేశంతోనే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

గతంలోనూ కోరిన బీసీసీఐ..

టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని గతంలో బీసీసీఐ వీరేంద్ర సెహ్వాగ్ ను కోరింది. ఇప్పుడు సెహ్వాగ్ ఆసక్తి చూపించకపోవడంతో ఆ పదవిని అనిల్ కుంబ్లేకు ఈ పదవి దక్కింది. అయితే తాజాగా చీఫ్ సెలెక్టర్ పదవిని సెహ్వాగ్ కు అందించాలని బిసిసిఐ భావిస్తోంది. అయితే దీనికి కూడా సెహ్వాగ్ దరఖాస్తు చేస్తాడని బీసీసీఐ అనుకోవడం లేదు. దీనికి ప్రధాన కారణం అందించే వేతనంగానే చెబుతున్నారు. అయితే ఈ ఏడాది చివరలో వరల్డ్ కప్ ఉండడం, వరల్డ్ కప్ ఆడే జట్టును ఎంపిక చేసే అవకాశం సెలక్షన్ కమిటీ చీఫ్ గా సెహ్వాగ్ కు అవకాశం దక్కుతుంది. ఈ ఒక్క అంశంతో నైనా సెహ్వాగ్ ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇబ్బందులు ఉంటాయన్న ఉద్దేశంతోనే బీసీసీఐ వెనక్కి..

సెలక్షన్ కమిటీ చైర్మన్ కు ఏడాదికి నాలుగు నుంచి ఐదు కోట్లు వేతనం ఇవ్వడం బీసీసీఐకి పెద్ద సమస్య కాదు. ఇలా చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయని బీసీసీఐ భావిస్తుండడం వల్లే వేతనం పెంపు విషయంలో వెనక్కి తగ్గుతోంది. వేతనం తక్కువగా ఇస్తుండడం వల్లే ప్రముఖ క్రికెటర్లు కూడా ఆసక్తి చూపించడం లేదు. అలాగే ఒక స్థాయి లేని క్రికెటర్లకు ఈ పదవిని ఇవ్వడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవి శాస్త్రి, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ వంటి వాళ్లతో సమావేశంలో కూర్చున్నప్పుడు ఇబ్బందులు పడతారు అన్న అభిప్రాయము వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ క్రికెటర్లకు ఈ బాధ్యతలను అప్పగించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. మరి చీఫ్ సెలెక్టర్ పదవిని సెహ్వాగ్ తీసుకునేందుకు ముందుకు వస్తాడా..? రాడా..? అన్నది వేచి చూడాల్సి ఉంది.