Virat Kohli : బెంగళూరు సాధించిన విజయంలో విరాట్ కోహ్లీ పునాది వేస్తే.. జితేష్ దానిని మరింత పటిష్టం చేశాడు. అందువల్ల బెంగళూరు బలమైన లక్ష్యాన్ని సైతం ఛేదించగలిగింది. ప్రత్యర్థి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొని విజయ బావుట ఎగరవేసింది. తద్వారా టాప్ -2 లోకి విజయవంతంగా వెళ్లిపోయింది. ఇటీవల కమిన్స్ సేనతో ఎదురైన ఓటమితో బెంగళూరు కుంగు బాటుకు గురయింది. ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా సత్తా చాటింది. లక్నోపై తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా చాలా కాలం తర్వాత టాప్ -2 లోకి వెళ్లిపోయింది. దీంతో కన్నడ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈసారి ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీ అందుకుంటామని… సుదీర్ఘకాలంగా వెలితిగా ఉన్న ట్రోఫీ కలను నెరవేర్చుకుంటామని బెంగళూరు అభిమానులు పేర్కొంటున్నారు. ” ఈసారి జట్టు గొప్ప ఇన్నింగ్స్ ఆడింది. గొప్ప గొప్ప జట్లపై విజయాలు సాధించింది. ఈ విజయాలు ఇలానే కొనసాగాలి. మిగతా మ్యాచ్లలో కూడా బెంగళూరు ఆటగాళ్లు ఇలాంటి ఆట తీరు ప్రదర్శించాలి. అప్పుడే ట్రోఫీ కల సాధ్యమవుతుంది. 17 సంవత్సరాలుగా వెంటాడుతున్న కల నెరవేరుతుంది. మా జట్టు ఎంతో బలంగా ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో ట్రోఫీకి దూరంగా ఉండిపోయింది. కానీ ఈసారి అలా జరగకూడదు. అలా జరగదని దేవుడిని బలంగా కోరుకుంటున్నాం. కచ్చితంగా మా జట్టు విజయం సాధించి మా కలను నెరవేర్చాలని” సోషల్ మీడియాలో బెంగళూరు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Also Read : 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూల”విరాట్”.. ఒకే ఒక్కడిగా రికార్డ్
బెంగళూరు సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించిన తర్వాత విరాట్ ఎగిరి గంతులు వేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎప్పుడైతే జితేష్ భారీ షాట్ కొట్టి.. బెంగళూరును గెలిపించాడో ఆ క్షణమే విరాట్ కోహ్లీ గట్టిగా అరిచాడు. పక్కనే ఉన్న కృణాల్ పాండ్యాను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. సాధించాం అన్నట్టుగా కేకలు వేశాడు.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ మైదానంలో సందడి చేశాడు. జితేష్ ను అభినందించాడు. భుజం తట్టి అభినందించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. బెంగళూరు విజయం సాధించిన తర్వాత మైదానంలో ప్రవేశించిన విరాట్.. తన సతీమణి అనుష్క శర్మను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దానికి అనుష్క శర్మ కూడా ఆదే స్థాయిలో అతడికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది..” అనుష్క శర్మ ను చూసి విరాట్ ఆనందపడ్డాడు. ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దానికి అనుష్క శర్మ కూడా ముసి ముసి నవ్వులు నవ్వింది. అతడికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ఆ సందర్భం ఎంతగానో ఆకట్టుకుంటున్నదని” బెంగళూరు అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.