spot_img
Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli Rohit Sharma 2027 World Cup: గంభీర్ కక్ష సాధింపు కానే కాదు.....

Virat Kohli Rohit Sharma 2027 World Cup: గంభీర్ కక్ష సాధింపు కానే కాదు.. 2027 వరల్డ్ కప్ లో విరాట్, రోహిత్ ఆడేది అనుమానమే..

Virat Kohli Rohit Sharma 2027 World Cup: టీమిండియాలో అభినవ ద్వయంగా పేరు పొందారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీరు అన్ని ఫార్మాట్లలో కొనసాగినప్పుడు టీమిండియా కు తిరుగులేదు. వీరిద్దరూ జట్టులో ఉన్నప్పుడు టీ మీడియా టి20 వరల్డ్ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు రెండుసార్లు వెళ్ళింది. టీమిండియా కు సమకాలీన క్రికెట్లో తిరుగులేని స్థాయిని అందించిన ఘనత విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకు దక్కుతుంది.

జట్టులో అంతర్గత రాజకీయాలు.. ప్రధాన శిక్షకుడు గౌతమ్ గంభీర్ వ్యవహార శైలి.. ఇతర కారణాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్ మీద తీవ్రమైన ప్రభావం చూపించాయి. దీంతో టి20 నుంచి, టెస్ట్ ఫార్మాట్ నుంచి వీరిద్దరూ తప్పుకున్నారు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు. ఐపీఎల్ లో అటు రోహిత్ ముంబై జట్టుకు.. ఇటు విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుకు ఆడుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని.. తమ శరీరంలో యంగ్ క్రికెట్ అలానే ఉందని చూపిస్తున్నారు. రోహిత్ సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతుండగా.. విరాట్ పరుగుల వరద సాగిస్తున్నాడు.

విరాట్ ఎప్పటిలాగే ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. రోహిత్ తన బరువును పూర్తిగా కోల్పోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నాడు. ఇన్ని సానుకూలతలు ఉన్న క్రమంలో అభిమానులకు ఓ చెడు వార్త ఆవేదన కలిగిస్తోంది. ఇటీవల బెంగళూరుకు జరిగిన మ్యాచ్లో రోహిత్ సరిగా ఆడలేదు. పైగా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. శరీరం సహకరించకపోవడంతో మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిపోయాడు. మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు అతడు రాలేదు. ఇక విరాట్ కోహ్లీ కూడా అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. ఇటీవల రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో.. అతడు బ్యాటింగ్ చేసిన తర్వాత ఫీల్డ్ లోకి రాలేదు.. దీంతో రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. అనేక రకాల చర్చలు సాగుతున్నాయి.

వయసు పెరగడం వల్ల రోహిత్ ఒకప్పటి మాదిరిగా ఆడలేక పోతున్నాడని విశ్లేషకులు అంటున్నారు. అతడు బ్యాటింగ్ పరంగా తిరుగులేని స్థాయిలో ఉన్నప్పటికీ.. ఫీల్డింగ్ పరంగా అనుకున్న ప్రమాణాలను రీచ్ కాలేకపోతున్నాడని విశ్లేషకులు అంటున్నారు. విరాట్ కూడా తన సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో కసరత్తులు చేస్తున్నప్పటికీ.. అవి ఐపీఎల్ స్థాయికి సరిపోవడం లేదు. పైగా అతనిలో ఒకప్పటి మాదిరిగా ఉద్రేకం కనిపించడం లేదు. ఫీల్డింగ్ లో కూడా విరాట్ లోపాలు చేస్తున్నాడు. అందువల్లే 2027 వన్డే వరల్డ్ కప్ లో వీరిద్దరికి చోటు లభించేది అనుమానమేనని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికే 2027 వరల్డ్ కప్ గురించి అనేక సందర్భాల్లో గౌతమ్ మాట్లాడాడు. ఆ ట్రోఫీకి ఇంకా సమయం ఉందని.. ఇప్పుడే ఆటగాళ్లు ఎవరు ఆడుతారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేమని గౌతమ్ వ్యాఖ్యానించాడు. గౌతమ్ వ్యాఖ్యలు అలా ఉంటే.. రోహిత్, విరాట్ ఆడుతున్న తీరు గౌతం మాటలకు బలం చేకూర్చే విధంగా ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version