Virat Gambhir : క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ .. ఎందుకంటే క్రికెట్ ఆడే ఆటగాళ్లు హుందాగా వ్యవహరించాలని.. ఓడినా , గెలిచినా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని మాజీ ఆటగాళ్లు చెబుతుంటారు. కానీ అన్నిసార్లు క్రికెట్ లో జెంటిల్మెన్ గేమ్ సాధ్యం కాదు.. కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు కట్టు తప్పుతుంటారు. దీనివల్ల వివాదాలు చెలరేగుతాయి. ఆ తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయి..అలాంటి పరిణామమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చోటుచేసుకుంది.. అదేదో విదేశీ, మన దేశ ఆటగాళ్ల మధ్య కాదు.. ఇద్దరు భారతదేశానికి చెందిన క్రికెటర్ల మధ్య.. చినికి చినికి గాలి వాన లాగా మారిన ఆ వివాదం 11 సంవత్సరాల పాటు రగులుతూనే ఉంది.. ఇంతకీ ఆరోజు ఏం జరిగిందంటే..
End of controversy between #GautamGambhir and Virat Kohli#ViratKohli #IPL #IPL2024 https://t.co/CpRRg0qBCJ
— News9 (@News9Tweets) March 29, 2024
2013లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గా గౌతమ్ గంభీర్ కొనసాగుతున్నారు.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ బ్యాటింగ్ పరంగా దిగ్గజ ఆటగాళ్లు. కెప్టెన్సీ పరంగానూ అద్భుతాలు చేశారు. అయితే 2013 సీజన్లో బెంగళూరు వేదికగా బెంగళూరు జట్టుతో కోల్ కతా తలపడింది.. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ, ఫీలింగ్ లో ఉన్న గౌతమ్ గంభీర్ మధ్య వివాదం నెలకొంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఒకరిపై ఒకరు మీదకు వచ్చారు. పరస్పరం తిట్టుకున్నారు. దీంతో ఎడ మొహం పెడ మొహంగా వెళ్లిపోయారు. ఈ గొడవ అనంతరం మ్యాచ్ రిఫరీ విచారణ నిర్వహించింది. ఇద్దరి ఆటగాళ్ళను మందలించింది. మ్యాచ్ ఫీజులో కోత విధించింది. నాటి నుంచి నేటి వరకు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య మాటల్లేవ్.. మాట్లాడు కోవడాల్లేవ్.
RCB vs KKR today
We are seated pic.twitter.com/WpUwZ3IkEr— Ashwin rohit❤️ (@ashwin_ro) March 29, 2024
అయితే ఇన్నాళ్లకు 11 ఏళ్ల గొడవ తమ మధ్య అంతరాన్ని పెంచుతుందని గుర్తించారో.. లేక ఇలాంటి గొడవల వల్ల ఫ్యాన్స్ కు ఎలాంటి సందేశం ఇస్తున్నామని అంతర్మథనమో తెలియదు గాని.. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. పరస్పరం కలిసి పోయారు. ఒకరి భుజంపై మరొకరు చేయి వేసుకొని సంతోషంగా మాట్లాడుకున్నారు.. శుక్రవారం బెంగళూరు రివేదికగా కోల్ కతా జట్టు తో బెంగళూరు తలపడినప్పుడు ఈ సన్నివేశం చోటుచేసుకుంది..కోల్ కతా జట్టుకు మెంటార్ గా గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తున్నారు. ఇటీవలే తన సౌత్ ఢిల్లీ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. భారతీయ జనతా పార్టీకి కూడా రాజీనామా లేఖ అందించారు. అయితే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..”హమ్మయ్య మొత్తానికి కలిసిపోయారు.. 11 సంవత్సరాల గొడవకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆటగాళ్ల మధ్య ఉండాల్సింది క్రీడా స్ఫూర్తి. అంతేగాని ఇష్టానుసారంగా గొడవలు పెట్టుకుంటే ఫ్యాన్స్ ఇబ్బంది పడతారంటూ” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.