Virat kohli : జాతీయ జట్టుకు ఆడడం ప్రతీ క్రికెటర్ కల. ఆ తర్వాత స్థానం సుస్థిరం చేసుకోవడమే టార్గెట్. అది కూడా అయిపోయిన తర్వాత వీలైతే కెప్టెన్ షిప్. ఈ ఫార్మాట్ ను ప్రతీ ఆటగాడు ఫాలో అవుతుంటాడు. కానీ.. కొందరికి మాత్రమే చివరిది సాధ్యమవుతుంది. దాన్ని అందుకున్నాడు కోహ్లీ. స్వదేశంలో, విదేశీ పర్యటనల్లో మంచి విజయాలే అందుకున్నాడు. కానీ.. కెప్టెంగా చెప్పుకోవడానికి ఘనమైన ట్రోఫీని ఒక్కటికూడా అందుకోలేకపోయాడు. ఐసీసీ ట్రోఫీ సంగతి అటుంచితే.. చివరకు ఐపీఎల్ కప్పును కూడా ముద్దాడలేకపోవడం గమనార్హం.
ద్వైపాక్షిక సిరీస్ లు నిత్యం జరుగుతూనే ఉంటాయి. కానీ.. ఐసీసీ నిర్వహించే టోర్నీలకు ప్రత్యేకత ఉంటుంది. ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ జట్లను ఓడించి టైటిల్ సాధించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ జట్టు విశ్వ విజేతగా ఘన కీర్తిని చాటుకుంటుంది. కోహ్లీ కెప్టెన్ అయి దాదాపు ఐదేళ్లయ్యింది. కానీ.. ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేదు.
ఐసీసీ నిర్వహించే టోర్నీలో వన్డే ప్రపంచ కప్ అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ కూడా నిర్వహిస్తుంది. దీంతోపాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. మాజీ కెప్టెన్ ధోనీ ఈ మూడు ట్రోఫీలనూ గెలుచుకొని సగర్వంగా సత్తా చాటాడు. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లు నెగ్గాడు ధోనీ. ప్రపంచంలో ఈ మూడు ట్రోఫీలను నెగ్గిన ఏకైక కెప్టెన్ కూడా ధోనీ మాత్రమే.
ఇంతటి సక్సెస్ ఫుల్ కెప్టెన్ నుంచి పగ్గాలు అందుకున్న కోహ్లీ.. ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా అందుకోలేకపోయాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఓ సారి టీ20 ఫైనల్ కు చేరుకొని ఓడిపోయింది భారత జట్టు. ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ వరకు వెళ్లి నిరాశపరిచింది.
అయితే.. ఐసీసీ సంగతి అటుంచితే.. ఐపీఎల్ ను కూడా గెలవలేకపోవడం కోహ్లీకి ఇబ్బందిగా మారింది. తాజా ఓటమితో ఐపీఎల్ టైటిల్ రేసు నుంచి బెంగళూరు టీమ ఔట్ అయ్యింది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ కెప్టెన్ గా ఉండబోనని ముందే ప్రకటించాడు కాబట్టి.. ట్రోఫీ గెలుపు అనేది తీరని కలగానే మిగిలిపోనుంది. మరి, త్వరలో జరగబోయే టీ 20 టోర్నీలో తన కోరిక తీర్చుకుంటాడేమో చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Virat kohli rcb defeats in ipl semi final 2021
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com