Virat Kohli Latest Photo: ఈ ప్రపంచంలో ఆధునిక ఆటగాళ్ల లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వారిలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. క్రికెట్ ను చూసేవారు కచ్చితంగా విరాట్ కోహ్లీ ఆటను ఇష్టపడుతుంటారు. ప్రాంతంతో సంబంధం లేకుండా అతడిని అభిమానిస్తుంటారు. ఆరాధిస్తుంటారు. మైదానంలో అతడు ఆడుతుంటే ఆస్వాదిస్తుంటారు. అందువల్లే విరాట్ కోహ్లీ సమకాలీన క్రికెట్ చరిత్రలో అద్భుతమైన శక్తిగా ఎదిగాడు. అతడిని కోట్లాదిమంది అభిమానులు అనుసరిస్తుంటారు, దేవుడిగా ఆరాధిస్తుంటారు.
విపరీతమైన స్టార్ డం వల్ల విరాట్ కోహ్లీ ఇండియాలో కాకుండా, లండన్ లో కుటుంబంతో నివసిస్తున్నాడు. సతీమణి అనుష్క శర్మ, పిల్లలు అక్కడే ఉంటున్నారు. స్వేచ్ఛాయుత జీవనాన్ని విరాట్ కోహ్లీ ఆస్వాదిస్తున్నాడు. కుటుంబంతో కలిసి వీధులలో విహరిస్తున్నాడు. షాపింగ్ చేస్తున్నాడు. హోటల్లో నచ్చిన ఫుడ్డు తింటున్నాడు. కానీ ఇక్కడ విరాట్ కోహ్లీకి ఆ స్వేచ్చలేదు. అతడు బయటికి వెళ్తే చాలు వందలాదిమంది అభిమానులు చుట్టుముడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. అందువల్లే విరాట్ లండన్ లో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే కొంతకాలంగా అతడు లండన్లో ఉంటున్నాడు.
త్వరలో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా తో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తోంది. టెస్ట్, టి20 ఫార్మాట్లకు విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికాడు. అతడు కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అందువల్లే అతడిని టీమిండియా మేనేజ్మెంట్ ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఎంపిక చేసింది. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో అతని ఆట తీరు పట్ల అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అతడు గొప్పగా ఆడతాడని భావిస్తున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా సిరీస్లో ఆడేందుకు లండన్ నుంచి ఇండియాకు వచ్చాడు.
ఇండియాకు వచ్చిన తర్వాత విమానాశ్రయంలో విరాట్ కోహ్లీ కనిపించాడు. దీంతో అభిమానులు అతడి రాకపోకలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు విమానాశ్రయంలో విరాట్ కోహ్లీని చూసేందుకు పోటీలు పడ్డారు. అద్భుతమైన శారీరక సామర్థ్యంతో.. అధునాతనమైన వస్త్రాలు ధరించి విరాట్ కోహ్లీ సూపర్ హీరోలాగా కనిపించాడు. నాలుగు నెలలుగా అతడు లండన్ లో ఉంటున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఇండియాలో అడుగు పెట్టడంతో అభిమానులు కేరింతలు కొడుతున్నారు. విరాట్ కోహ్లీ నడిచి వచ్చే వీడియోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. దీంతో అభిమానులు విరాట్ కోహ్లీని అభినందిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా సిరీస్లో అదరగొట్టాలని సూచిస్తున్నారు. విరాట్ కోహ్లీ నుంచి గొప్ప ఇన్నింగ్స్ ఆశిస్తున్నట్టు వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. అంతకుమించిన అభిమానుల బలం ఉన్న ఆధునిక క్రికెటర్.
Everything aside, Kohli’s airport outfit is a masterclass in minimalism.
pic.twitter.com/38HFMmBVkd— Mahendra Zala (@Emperor____18) October 14, 2025