Virat Kohli latest Look: ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ క్రికెట్ ఆటగాల్లో ఒకరు విరాట్ కోహ్లీ(Virat Kohli). రన్ మెషిన్ గా పేరొంది, ఎన్నో సంచనాలనాత్మక రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోయిన విరాట్ కోహ్లీ, టీ 20 మరియు టెస్ట్ క్రికెట్ మ్యాచులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ కి ఇంకా అద్భుతంగా ఆడగలిగే సత్తా ఉంది, అయినప్పటికీ ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం ఆయన అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసింది. టెస్ట్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఎన్నో వరల్డ్ రికార్డ్స్ ని నెలకొల్పాడు. రీసెంట్ గా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ లేడే అనే బాధ అభిమానుల్లో బాగా ఉంది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఆయన్నే అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయం లో విరాట్ కోహ్లీ లేటెస్ట్ లుక్స్ అభిమానులకు గుండెలు ఆగినంత పని చేసింది.
Read Also: ఒక్క ప్రాంతం నుండి గంటకు 50 వేల టిక్కెట్లు..’కూలీ’ సునామీ మొదలైంది!
తెల్లని గడ్డం తో కనిపించిన విరాట్ కోహ్లీ ని చూసి, ఇలా అయిపోయాడేంటి?, RCB టీం కి కప్పు గెలిపించిన తర్వాత ఇక చాలులే క్రికెట్ అని అనుకున్నాడా?, త్వరలోనే ఒన్డే ఫార్మాట్ కి కూడా ఆయన గుడ్ బై చెప్పనున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన తన కుటుంబం తో కలిసి లండన్ లో నివసిస్తున్నాడు. లండన్ లో ఆయన తిరుగుతున్న సమయం లో ఒక అభిమాని సెల్ఫీ అడగ్గా, ఆ అభిమాని కోసం సెల్ఫీ ఇచ్చిన స్టిల్ ఇది. ఏది ఏమైనా అసలే మా అభిమాన క్రికెటర్ రెండు ముఖ్యమైన ఫార్మట్స్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు అనే బాధలో ఉన్న అభిమానులకు, విరాట్ లేటెస్ట్ లుక్ పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే ఈ కాలం లో పాతికేళ్ళు దాటిన ప్రతీ ఒక్కరికి జుట్టు , గడ్డం నరిసిపోవడం మనమంతా చూస్తూనే ఉన్నాం. విరాట్ కోహ్లీ కూడా మనలాంటి మనిషే కదా, ఆయనకు కూడా సహజసిద్ధంగానే వచ్చింది అంటూ సోషల్ మీడియా లో మరికొంతమంది అభిమానులు అంటున్నారు.