Virat Kohli: సౌతాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ ను కోల్పోయిన టీమిండియాపై విమర్శల జడివాన కురుస్తోంది. ఈ క్రమంలోనే టీ20 కెప్టెన్సీ వదలుకున్న విరాట్ కోహ్లీని బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తొలగించింది. తాజాగా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోవడంతో తన కెప్టెన్సీపై విమర్శలు చెలరేగుతున్న వేళ విరాట్ కోహ్లీ అస్త్ర సన్యాసం చేశారు. తనదగ్గర ఉన్న టెస్ట్ కెప్టెన్సీని సైతం వదులుకొని సంచలనం సృష్టించారు.
ఇప్పటికే టీ20కి విరాట్ గుడ్ బై చెప్పాడు. ప్రపంచకప్ టీ20కి ముందే ఈ ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక వన్డేల నుంచి బీసీసీఐ పక్కనపెట్టింది. రోహిత్ శర్మకు పగ్గాలు అప్పజెప్పింది. తాజాగా విరాట్ తనదగ్గరున్న టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు.దీంతో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగినట్లు అయ్యింది.
టెస్ట్ కెప్టెన్సీకి వీడ్కోలు చెబుతూ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశాడు.‘ దాదాపు ఏడేళ్లుగా కెప్టెన్ గా జట్టును సరైన మార్గంలో నడిపించాను. బాధ్యతలను నిబద్దతతో నిర్వర్తించా.. ప్రతిదానికి ముగింపు ఉంటుంది. అది నాటెస్ట్ కెప్టెన్సీకి కూడా.. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాక కృషి, నమ్మకం లేకుండా ఏ రోజూ ఆడలేదు. ఈ సందర్భంగా బీసీసీఐకి, రవిశాస్త్రి, ఎంఎస్ ధోనికి ధన్యవాదాలు.. మరీ ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో నా మీద నమ్మకం ఉంచిన ఎంఎస్ ధోనికి కృతజ్ఞతలు’ అని విరాట్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి బలమైన జట్లపై గెలిచి సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోవడంతో విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక జట్టులో వన్డే , టీ20 కెప్టెన్ అయిన రోహిత్ శర్మతో విరాట్ కు విభేదాలున్నాయన్న గుసగుసలున్నాయి. అందుకే విరాట్ కెప్టెన్సీలో రోహిత్ ఆడకుండా రాలేదని టాక్ ఉంది. ఇక ఇటీవలే బీసీసీఐ, గంగూలీకి కోహ్లీతో విభేదాలు పొడచూపి మాటల యుద్ధానికి దారితీసింది. కామెంట్లు చేసుకున్నారు. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించడంపై కోహ్లీ విమర్శించడం.. గంగూలీ, బీసీసీఐ డిఫెన్స్ లో పడడం తెలిసిందే.
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తను టెస్ట్ కెప్టెన్సీని కూడా వదలుకొని ఇక వీటన్నింటికి చెక్ చెప్పాడని తెలుస్తోంది. జట్టులో ఒక ఆటగాడిగానే కోహ్లీ కొనసాగుతాడు. ఆటగాడిగా కొనసాగుతాడా? లేదా రిటైర్ మెంట్ ప్రకటిస్తాడా? అన్నది వేచిచూడాలి.
ఇక విరాట్ కోహ్లీ టీమిండియా తరుఫున సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నిలిచారు. కోహ్లీ కెప్టెన్సీలో 68 టెస్టులు ఆడిన భారత జట్టు ఏకంగా 40 మ్యాచుల్లో విజయం సాధించడం విశేషం. భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా కోహ్లీ ఉన్నారు.కానీ అతడి సారథ్యంలో ఒక్క ప్రపంచకప్ కూడా గెలవకపోవడమే పెద్ద లోటు అని చెప్పొచ్చు.
https://twitter.com/imVkohli/status/1482340422987169794?s=20