Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli fan craze story: విరాట్ అంటే విపరీతమైన పిచ్చి.. ఆటోగ్రాఫ్ ఇవ్వకపోవడంతో ఈ...

Virat Kohli fan craze story: విరాట్ అంటే విపరీతమైన పిచ్చి.. ఆటోగ్రాఫ్ ఇవ్వకపోవడంతో ఈ బాలుడు ఏం చేశాడంటే..

Virat Kohli fan craze story: మనదేశంలో క్రికెటర్లను ఆరాధ్య దైవాలుగా అభిమానులు కొలుస్తూ ఉంటారు. వారి నుంచి కరచాలనం తీసుకోవాలని.. వారితో ఒక ఫోటో దిగాలని చాలామంది అభిమానులు కలలు కంటారు. అయితే ఇందులో కొందరి కల మాత్రమే సాకారం అవుతూ ఉంటుంది. భద్రతా పరిమితుల దృష్ట్యా క్రికెటర్లు అభిమానులను అతి తక్కువగా కలుస్తూ ఉంటారు. గతంలో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు అభిమానులు సెక్యూరిటీని దాటుకొని లోపలికి వెళ్లేవారు.. అయితే ఈ ఏడాది సెక్యూరిటీని మరింత కఠినం చేశారు. దీంతో అభిమానులు మైదానంలోకి వెళ్లలేకపోతున్నారు.

అభిమాన క్రికెటర్లతో ఫోటోలు దిగాలని.. వారితో ఆటోగ్రాఫ్ తీసుకోవాలని చాలామంది అభిమానులు ఆశ పడుతుంటారు. అయితే క్రికెటర్లు తమకున్న పరిమితుల దృష్ట్యా కొంతమందికి మాత్రమే ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉంటారు. వారితో ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇలాంటి అవకాశం కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. మనదేశంలో క్రికెటర్లకు యుక్త వయసు.. పెద్ద వయసు వారు మాత్రమే కాకుండా.. కౌమార పిల్లలు కూడా అభిమానులుగా ఉంటారు. ముఖ్యంగా భారత క్రికెటర్ల మీద కౌమార పిల్లలకు విపరీతమైన ప్రేమ ఉంటుంది.

అభిమాన క్రికెటర్ల మీద ఉన్న ప్రేమ కొద్డీ చాలామంది కౌమార అభిమానులు సోషల్ మీడియాలో తన ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. అభిమాన క్రికెటర్ల మీద టన్నుల కొద్ది ప్రేమను చూపిస్తూ ఉంటారు. వారిని కలుసుకోవడానికి తాపత్రయ పడుతుంటారు. అలాంటి ఓ కౌమార బాలుడి తాపత్రయం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఐపీఎల్ లో భాగంగా బెంగళూరు జట్టు, ఢిల్లీ జట్టు ఢిల్లీ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు కుప్పకూలిపోయింది. గొప్పగా పరుగులు చేయకుండానే ఆల్ అవుట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి సాధించింది. ఈ విజయం నేపథ్యంలో బెంగళూరు పాయింట్లు పట్టికలో రెండవ స్థానాన్ని మరింత స్థిరం చేసుకుంది. ఇదే సమయంలో మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడు. అతడితో ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఓ కౌమార అభిమాని తాపత్రయపడ్డాడు. కానీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడ్డారు. దీంతో ఆ బాలుడు ఏడుపు మొదలుపెట్టాడు.

ఆటోగ్రాఫ్ తీసుకుందామని తీసుకొచ్చిన బ్యాట్ నేలకేసి కొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది.. దీనిపై సోషల్ మీడియాలో భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విరాట్ ఆటోగ్రాఫ్ ఇచ్చి ఉంటే బాగుండేదని కొంతమంది.. విరాట్ అంత ఈజీగా ఆటోగ్రాఫ్ ఎలా ఇస్తాడని మరి కొంతమంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version