Homeబిజినెస్HMD Vibe 2 smartphone features: మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం HMD కొత్త మొబైల్.....

HMD Vibe 2 smartphone features: మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం HMD కొత్త మొబైల్.. ఫీచర్స్ వేరే లెవెల్..

HMD Vibe 2 smartphone features: వినియోగదారుల అవసరాలను బట్టి కొత్త కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా HMD కంపెనీకి చెందిన Vibe 2 5G మొబైల్ త్వరలో భారత్లో లాంచ్ కానుంది. గత ఏడాది లాంచ్ అయిన HMD Vibe 5 అనే ఫోన్ కు ఆదరణ పెరుగుతుండడంతో కొత్తగా Vibe 2 5జి మొబైల్ న్యూ లాంచ్ చేయనుంది. ఇందులో ఉండే స్పెషల్ ఫీచర్లతో వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడతారని కంపెనీ భావిస్తుంది. ఇందులో ఉండే లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

HMD నుంచి కొత్తగా మార్కెట్లోకి రాబోయే Vibe 2 మొబైల్ ప్రత్యేకమైన ఫీచర్ల గురించి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఇప్పటికే ఉన్న ఫోన్ ను బట్టి అంచనాలు వేస్తున్నారు. ఇందులో 6.75 అంగుళాల HD+ LCD స్క్రీన్ ఉండనుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 4GB రామ్ సపోర్ట్ తో 128 జీబీ స్టోరేజ్ ను కలిగి ఉంది. దీంతో రోజువారి వినియోగదారులతో పాటు ప్రొఫెషనల్ కోసం యూస్ చేసే వారికి కూడా ఈ స్టోరేజ్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో కెమెరా గురించి కూడా స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ఈ మొబైల్లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 2 MP ఫ్రంట్ కెమెరా ను ఏర్పాటు చేశారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారితోపాటు.. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ కెమెరా బాగా ఉపయోగపడుతుంది.

HMD Vibe 2 మొబైల్ లో 5000 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 10 W ఫాస్టెస్ట్ చార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. టైటానియం బ్లాక్, టైటానియం లైట్ రంగుల్లో అందుబాటులో ఉండే ఈ మోడల్ డిజైన్ మిగతా వాటికంటే భిన్నంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటివరకు వచ్చిన HMD Vibe 5 మొబైల్ కంటే అదనపు ఫీచర్లు ఇందులో చూడవచ్చు అని అంటున్నారు. అయితే ఇది వచ్చే మే నెలలో మార్కెట్లోకి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన HMD Vibe 5 ధర రూ.11,999 తో విక్రయిస్తున్నారు. కొత్తగా వచ్చే HMD Vibe 2 మొబైల్ కూడా దీనికి అందుబాటులోనే ఉంటుందని చెబుతున్నారు. అయితే మిడిల్ క్లాస్ పీపుల్స్ తో పాటు రోజువారి వినియోగదారులు బడ్జెట్లో మొబైల్ కొనాలని అనుకుంటే దీనిని ఎంచుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఇది మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version