Virat Kohli: ఎవరికైనా సరే ఒక వయసు వచ్చేసరికి శరీరం అంతగా సహకరించదు. మునుపటి మాదిరి ఉత్సాహం కనిపించదు.. శరీరంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవాలని శరీరం సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. అయితే ఇది విరాట్ కోహ్లీకి వర్తించదు. ఎందుకంటే అతడు సాధారణమైన మనిషి కాదు. సాధారణమైన ఆటగాడు కూడా కాదు. పేరుపొందిన క్రికెటర్ మాత్రమే కాదు.. అంతకుమించిన శారీరక సామర్థ్యం ఉన్న ఆటగాడు అతడు. అందువల్లే వయసు పెరుగుతున్న సరే అతడు ఏమాత్రం తగ్గడం లేదు.
ప్రస్తుత ఐపిఎల్ లో సెకండ్ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇటీవల జరిగిన మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీ తో తన జట్టును గెలిపించాడు. అంతేకాదు ఈ ఐపిఎల్ లో ఇప్పటికే సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు. తనకు వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని.. తన ఉత్సాహానికి వయసు ఏనాడు కూడా అడ్డంకి కాదని విరాట్ కోహ్లీ నిరూపిస్తున్నాడు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బెంగళూరు జట్టు సాధిస్తున్న వరుస విజయాలలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. యంగ్ ప్లేయర్లు సైతం వెనుకడుగు వేస్తున్న క్రమంలో.. ఓపెనర్ గా వస్తున్న అతడు అదరగొడుతున్నాడు. ఎలాంటి బౌలర్ అయినా సరే భయపడకుండా పరుగులు తీస్తున్నాడు. వికెట్ల మధ్యలో అతడు పరుగులు తీస్తున్న విధానం చిరుత పులిని గుర్తుకు తెస్తుంది.
సోమవారం ఢిల్లీ జట్టుతో బెంగళూరు తలపడబోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మైదానంలో విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన 11 ఇన్నింగ్స్లలో విరాట్ కోహ్లీ ఢిల్లీ మైదానం మీద 534 పరుగులు చేశాడు. ఇందులో ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 66.8.. స్ట్రైక్ రేట్ 141 కొన సాగుతోంది. ఢిల్లీ మాత్రమే కాదు.. మనదేశంలో ఉన్న ప్రతి మైదానంలో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. సాధారణంగా ఏ ఆటగాడు అయినా సరే రికార్డుల వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. కానీ విరాట్ కోహ్లీ వెంట రికార్డు
