Virat Kohli: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా వరుసగా ఎనిమిది మ్యాచ్ ల్లో గెలిచి అద్భుతమైన ఫామ్ లో కొనసాగడమే కాకుండా సెమీ ఫైనల్ కి చేరిన మొదటి జట్టుగా కూడా చాలా మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఇక ఇలాంటి క్రమంలో ఇండియన్ టీం ఆడిన ప్రతి మ్యాచ్ గెలుస్తూ రావడం అనేది ఇండియన్స్ గా మనందరం గర్వపడాల్సిన విషయం. ఇంకా ఇలాంటి క్రమంలో సౌతాఫ్రికా మీద ఆడిన మ్యాచ్ ల్లో ఇండియా ఘన విజయం సాధించింది. మొదట 326 పరుగులు చేసిన ఇండియన్ టీం సౌతాఫ్రికా వాళ్లను 83 పరుగులకే ఆలౌట్ చేసి అద్భుతమైన విజయాన్ని కూడా నమోదు చేసుకుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ టీమ్ వరుస విజయాలను అందుకోవడంలో ప్లేయర్లు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నారు.
ముఖ్యంగా కోహ్లీ అయితే ప్రతి మ్యాచ్ లో తన స్థాయి మేరకు ఆడుతూ ఇండియన్ టీంకి ప్రతి మ్యాచ్ లో భారీ స్కోర్ అందించే విధంగా ముందుకు సాగుతున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన సౌతాఫ్రికా మీద జరిగిన మ్యాచ్ లో ఆయన 49 వ సెంచరీని పూర్తి చేసుకొని సచిన్ సెంచరీలతో సహా సమానమైన సెంచరీలు చేసిన ప్లేయర్ గా ఒక ఘనతను సాధించాడు.ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఇండియన్ టీమ్ భారీ స్కోరు సాధించడం లో ఒక కీలక పాత్ర పోషించారు…
ఈ పిచ్ అంత బాగాలేకపోయిన కూడా కోహ్లీ తొందర పడకుండా నిదానం గా ఆడుతూ టీమ్ స్కోర్ ని చక్కదిద్దాడు… ఇక ఇలాంటి క్రమంలో కోహ్లీ చేజింగ్ లో ఉన్నప్పుడు గ్రౌండ్ లో డాన్స్ లు చేస్తూ కోహ్లీ ప్రేక్షకులను అలరించాడు. ఇక ఆ రోజు తన బర్త్ డే కూడా కావడం తో కోహ్లీ ఆనందానికి అవధులు లేవు అనే చెప్పాలి…మరి ముఖ్యంగా కోహ్లీ డాన్స్ చేసిన వీడియో కి తన వైఫ్ అయిన అనుష్క శర్మ అయినవీ.. అయినవీ.. అనే పాటకు కోహ్లీ డాన్స్ చేసినట్టు గా ఆ వీడియో ని సింక్ చేసి నెట్ లో వదిలారు దాంతో దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీనితోపాటుగా షారుక్ ఖాన్ హీరో గా వచ్చిన పఠాన్ సినిమాలోని చలెయా.. చలెయా..అనే సాంగ్‌కు కూడా డ్యాన్సులు వేస్తూన్నట్టు గా చిత్రీకరించారు…
ఇక ఇది ఇలా ఉంటే ఇండియన్ టీమ్ సెమీస్ కి క్వాలిఫై అయిన నేపధ్యం లో తన చివరి మ్యాచ్ ని నెదర్లాండ్స్ తో ముగించుకొని సెమీస్ మ్యాచ్ ఆడటానికి చూస్తుంది. ఇక ఇలాంటి క్రమంలో నెదర్లాండ్స్ పైన విజయం సాధిస్తే ఇండియన్ టీమ్ వరుసగా తొమ్మిదో విజయాన్ని దక్కించుకొని ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో ఎవరికి సాధ్యం కానీ ఒక రికార్డ్ ని కూడా అందుకుంటుంది…
Wait for the birthday boy to dance on ‘Mera naam hai Lakhan’ 😍❤️🇮🇳#CWC23 #INDvSA #ViratKohli pic.twitter.com/HDTDAWEvmh
— Circle of Cricket (@circleofcricket) November 5, 2023