IND vs PAK Virat Kohli: 5.3 ఓవర్లకే.. 31-4 వికెట్లు.. 10 ఓవర్లకు పట్టుమని 50 పరుగులు కూడా చేయలేదు.. లక్ష్యం 160 పరుగులు.. పాకిస్తాన్ పై ఇండియా గెలుస్తుందని స్టేడియంలోని వ్యక్తులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు.. భారతీయులు కూడా నమ్మలేదు.. కానీ ఒక్కడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను గెలిపించాడు. కడవరకూ ఉండి మరీ భారత్ కు విజయాన్ని అందించాడు. అతడే విరాట్ కోహ్లీ..

కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి.. కరెక్ట్ టైంలో గేర్ మార్చి భారత్ కు అద్భుత, అపురూప విజయాన్ని అందించాడు. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో అస్సలు భారత్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ రెండు సిక్సులు కొట్టి లక్ష్యాన్ని 6 బంతుల్లో 16 కు తగ్గించాడు విరాట్ కోహ్లీ. కోహ్లీకి హార్ధిక్ పాండ్యా సహకరించాడు. వీరిద్దరూ కలిసి ఓడిపోతుందనుకుంటున్న భారత్ ను గెలిపించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
విరాట్ కోహ్లీ భారత్ ను గెలిపించిన తర్వాత విజయం సాధించామంటూ నేలపై పంచులు ఇచ్చాడు. ఆ తర్వాత ఎమోషనలై కన్నీరు పెట్టుకున్నాడు. దీనిపై క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే స్పందించాడు. ఎన్నో ఏళ్లుగా కోహ్లీని చూస్తున్నానని.. ఇంతవరకూ కోహ్లీ కంట్లో కన్నీటి చుక్క చూడలేదని.. తొలిసారి పాక్ మీద విజయం తర్వాత ఇవాళ చూశా.. ఇది ఎప్పటికీ మరువలేని సంఘటన.. ఇదే తొలిసారి’ అని ట్వీట్ చేశాడు.
పాకిస్తాన్ మీద అపూర్వవిజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ కళ్లు చెమర్చాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీలో చాలా కీలక ఇన్నింగ్స్ లు ఆడిన విరాట్ ఫామ్ పై ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ఇలా బాధ బయటకు వచ్చినట్టు కనిపిస్తోంది. కింగ్ కోహ్లీ ఛేదనలో మొనగాడు అని.. అతడు ఒక గొప్ప క్రికెటర్ అని పాక్ పై ఇన్నింగ్స్ తో అందరికీ మరోసారి అర్థమైంది. మనమూ చెబుతూ కోహ్లీకి సలాం..
https://www.youtube.com/watch?v=aTJIQOQ3NTY