Virat Advice Suyash Sharma: కేవలం బ్యాటింగ్, ఫీల్డింగ్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు మాస్టర్ మైండ్ రోల్ కూడా విరాట్ కోహ్లీ పోషిస్తుంటాడు. కాకపోతే అతడు రచించిన వ్యూహాలు ఎప్పుడూ ఫెయిల్ కావు. అందువల్లే విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో టీమిండియా టెస్టులలో అద్భుతమైన విజయాలు సాధించింది. ధోని సారధిగా ఉన్నప్పుడు టెస్టులలో టీమిండియా స్థానం అత్యంత అద్వానంగా ఉండేది. ఇప్పుడైతే విరాట్ కోహ్లీ టెస్ట్ సారధిగా బాధ్యతలు స్వీకరించాడో.. అప్పుడే టీమిండియా పరిస్థితి మారిపోయింది. ఏకంగా మొదటి స్థానంలోకి వచ్చేసింది. విరాట్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా అద్భుతమైన విజయాలు సాధించింది. దిగ్గజ కెప్టెన్ లకు సైతం సాధ్యం కాని రికార్డులను విరాట్ కోహ్లీ టీం ఇండియా పాదాక్రాంతం చేశాడు. గొప్ప గొప్ప సిరీస్ విజయాలను భారత జట్టు సొంతం చేశాడు. అందువల్లే టెస్ట్లలో అత్యంత విజయవంతమైన సారధిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు ఒకవేళ విరాట్ కోహ్లీ గనుక ఇప్పటివరకు నాయకుడిగా కొనసాగి ఉంటే టీమ్ ఇండియా పరిస్థితి మరో విధంగా ఉండేది. ముఖ్యంగా టెస్ట్ లలో కచ్చితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీని దక్కించుకునేది. అయితే ఇప్పుడు సారధిగా విరాట్ కోహ్లీ బాధ్యతలు స్వీకరించాలని ఉత్సాహంగా ఉన్నప్పటికీ.. మేనేజ్మెంట్ దానికి సుముఖంగా లేదు.
ఇక విరాట్ కోహ్లీ వీరోచితమైన బ్యాటర్ మాత్రమే కాదు.. అంతకుమించి మాస్టర్ మైండ్ కూడా. కాకపోతే ప్రత్యర్థి జట్టుకు సంబంధించిన ఆటగాళ్ల బ్యాటింగ్.. ఇతర వ్యవహారాలను అతడు అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాడు. వారిలో ఉన్న లోపాలను పసిగడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ విషయాలను ఆ బ్యాటర్ కు బౌలింగ్ వేసే వారికి చెబుతుంటాడు. అప్పుడు తన మాస్టర్ మైండ్ ద్వారా వారిని డ్రెస్సింగ్ రూమ్ పంపిస్తాడు. శుక్రవారం నాడు హైదరాబాద్ తో తలపడినప్పుడు విరాట్ కోహ్లీ తన మాస్టర్ మైండ్ ను మరోసారి బయటపెట్టాడు. బెంగళూరు స్పిన్ బౌలర్ శర్మ ద్వారా వికెట్ సాధించేలా చేశాడు. అప్పటికే శర్మ విపరీతంగా పరుగులు ఇచ్చాడు. వికెట్లు తీయడంలో మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా అతడి వేసిన తొమ్మిదవ ఓవర్లో విపరీతంగా బౌండరీలు వచ్చాయి. దీంతో శర్మ తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కోహ్లీ శర్మ వద్దకు వచ్చాడు. తాను ఐడెంటిఫై చేసిన విషయాలను వెల్లడించాడు. ఇక ఆ మరుసటి బంతికే శర్మ క్లాసెన్ ను వెనక్కి పంపించాడు. తద్వారా హైదరాబాద్ జట్టును మరింత భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు.
విరాట్ గనుక తను ఐడెంటిఫై చేసిన విషయాలను శర్మతో గనుక చెప్పి ఉండకపోతే హైదరాబాద్ జట్టు ఇంకా భారీ స్కోర్ చేసేది. అది అంతిమంగా బెంగళూరు జట్టుకు మరింత ఇబ్బందికరంగా మారేది. క్లాసెన్ ను అవుట్ చేసినప్పటికీ బెంగళూరుకు పెద్దగా ఉపయోగాలు లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటికే హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. బెంగళూరు జట్టును ఆ టార్గెట్ రీచ్ కాకుండా అడ్డుకుంది. తద్వారా వరుసగా రెండవ విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.