Vijay Mallya Viral Tweets : పై ఉపోద్ఘాతం చదివితే ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది.. మేము ఎవరి గురించి చెబుతున్నామో.. ఎస్ మీ ఊహ కరెక్టే.. అంచనా వేసింది కూడా కరెక్టే.. బెంగళూరు ట్రోఫీ సాధించిన తర్వాత.. ఒకప్పటి బెంగళూరు జట్టు యజమాని విజయ్ మాల్యా స్పందించారు. ” బెంగళూరు కప్ సాధించడం నా కల. పెట్టకే లకు కన్నడ సీమకు ఐపీఎల్ ట్రోఫీ వస్తోంది దానికి నా ధన్యవాదాలు. నా సుదీర్ఘమైన కలను నెరవేర్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ ట్రోఫీ బెంగళూరు అభిమానులకు ఎంత ప్రత్యేకమైనది. కప్ సాధించడానికి వారు అర్హులు.. ఈ సాలా కప్ బెంగళూరు బరుతే” అంటూ ట్వీట్ చేశారు. అక్కడితోనే మాల్యాగిపోలేదు. తన ట్విట్టర్ ఎకౌంట్ నుంచి వరుసగా ట్వీట్లు చేశారు.. తన ఆనందాన్ని పంచుకున్నారు. బెంగళూరు సాధించిన విజయాన్ని గొప్పగా అభివర్ణించారు. మొత్తంగా తన జట్టు సాధించిన ఈ ఘనతను.. తన ఘనతగా ఆయన అభివర్ణించుకున్నారు… మాల్యా వరుస ట్విట్లు చేసిన నేపథ్యంలో నెటిజన్లు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు..” మీరు భారీగా అప్పులు తీసుకున్నారు. అప్పులు ఎగవేసి విదేశాలలో తల దాచుకుంటున్నారు.. మీ కల నెరవేరింది సరే.. ఎస్బిఐ కల కూడా నెరవేర్చండి” అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Also Read : బెంగళూరు కు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది? ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లు ఎవరికి దక్కాయంటే!
ఇక బెంగళూరు కప్పు సాధించిన తర్వాత.. ఆ జట్టు మాజీ ఓనర్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. టీవీలో మ్యాచ్ వీక్షిస్తూ ఆయన చిన్నపిల్లాడి మాదిరిగా ఏడ్చేశారు. బెంగళూరు ట్రోఫీ సాధించగానే.. గట్టిగా ఆరిచారు.. ట్రోఫీ సాధించిన సందర్భాన్ని చూపించుకుంటూ..” ఇన్ని రోజుల నిరీక్షణ తర్వాత.. ఇన్ని రోజుల ఎదురుచూపు తర్వాత ఆఖరికి ట్రోఫీని సాధించాం”అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇక విజయ్ మాల్యా కూడా వరుసగా చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో విపరీతంగా దర్శనమిస్తున్నాయి.. 2016 వరకు బెంగళూరు జట్టు విజయ్ మాల్యా ఆధీనంలోనే ఉండేది. ఆ తర్వాత అది చేతులు మారింది. ఆర్థిక అవకతవకలు.. బ్యాంకులకు ఎగవేసిన అప్పులు.. ఇవన్నీ కూడా విజయ్ మాల్యాను ఆర్థిక నిందితుడిని చేశాయి. చివరికి ఆయనకు విదేశాలలో తలదాచుకునే పరిస్థితి కల్పించాయి.. మాల్యా ఆధీనంలో జట్టు ఉన్నప్పుడు గొప్ప గొప్ప ప్లేయర్లను కొనుగోలు చేశారు. జట్టు విజయాల్లో పాలుపంచుకుంటారని భావించారు. గొప్ప గొప్ప ప్లేయర్ లో ఉన్నప్పటికీ కన్నడ జట్టు విన్నర్ కాలేక పోయింది. మాల్యా విదేశాలకు పారిపోయే నాటికి కన్నడ జట్టు అప్పటి చివరి అంచె మ్యాచ్లో కావ్య జట్టు చేతిలో ఓటమిపాలై.. ట్రోఫీ చేజార్చుకుంది.
When I founded RCB it was my dream that the IPL trophy should come to Bengaluru. I had the privilege of picking the legendary King Kohli as a youngster and it is remarkable that he has stayed with RCB for 18 years. I also had the honour of picking Chris Gayle the Universe Boss…
— Vijay Mallya (@TheVijayMallya) June 3, 2025