Viral Video : ఇరానిక్ 2024లో రెస్టాఫ్ ఇండియాకు దేవదత్ పదిక్కల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు అదిరిపోయే క్యాచ్ పట్టి ఆవరించాడు. దేవదత్ పడిక్కల్ పట్టిన క్యాచ్ కు ముంబై జట్టు ఓపెనర్ పృథ్వీ షా(4) పెవిలియన్ చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ ఇండియా టాస్ గెలిచి, ఫీల్డింగ్ నిర్ణయించుకుంది. ముంబై జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ముఖేష్ కుమార్ వేసిన మూడో ఓవర్ లో పృథ్వీ షా క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరుకున్నాడు. లిస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు చెందిన పేస్ బౌలర్ ముఖేష్ కుమార్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని పృథ్వీ షా వార్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. దీంతో ఆ బంతి మూడో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న దేవ దత్ పడిక్కల్ కు దూరంగా వెళ్ళింది. అయినప్పటికీ అతడు అమాంతం కుడివైపు ఎగిరి బంతిని అందుకున్నాడు. ఒంట్లో ఎముకలు ఉన్నాయా? లేవా? చేప పిల్లలాగా గాల్లోకి ఎగరాడు. గాలిలోనే బంతిని ఒక చేత్తో పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.
ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. ” పృథ్వీ షా గొప్పగా బ్యాటింగ్ చేయాలని భావించి మైదానంలోకి వచ్చాడు. కానీ అతడి ఆశలను అడియాసలు చేశావు. అద్భుతమైన ఫీల్డింగ్ తో క్యాచ్ అందుకున్నావ్. ఇది చాలా సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది.. నువ్వు పట్టిన క్యాచ్ వల్ల పృథ్వీ షా కు సాయిబాబా కనిపించి ఉంటాడని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ తోమర్ (0) గోల్డెన్ డక్ గా ఔటయ్యాడు. ముఖేష్ కుమార్ వేసిన ఆ దేవవరం లోని 4 బంతికి హార్దిక్ తోమర్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరుకున్నాడు. అర్థం కా ముంబై జట్టు కేవలం 3 బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లను కోల్పోయింది.. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అజింక్య రహనే, ఆయుష్ మాత్రే నిదానంగా ఆడారు. కాగా, ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా టీం ఇండియాలోకి దేవదత్ పడిక్కల్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. అయితే అదే ఫామ్ కొనసాగించడంలో అతడు విఫలం కావడంతో అతడికి ఇటీవలి బంగ్లాదేశ్ టోర్నీలో ఆడే అవకాశం లభించలేదు. మళ్లీ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడానికి దేవదత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
FLYING DEVDUTT PADIKKAL.
– An absolute stunner in slips to dismiss Prithvi Shaw. pic.twitter.com/Qa8j8ESMc6
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Video of prithvi shah upset by devdutt padikkals catch has gone viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com