Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: వైభవ్ కు నో ఎంట్రీ.. తన అనుచరుడు హర్షిత్ కు ఛాన్స్.. గంభీర్...

Vaibhav Suryavanshi: వైభవ్ కు నో ఎంట్రీ.. తన అనుచరుడు హర్షిత్ కు ఛాన్స్.. గంభీర్ ఇక మారడా..

Vaibhav Suryavanshi: ఐర్లాండ్ టూర్ ను భారత జట్టు మొదలుపెట్టింది. తొలి మ్యాచ్ ఆడుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ టీం ఇండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్ ఎదురైంది. ఐర్లాండ్ స్థిరపడిన భారత అభిమానుల్లో ఆవేదన నెలకొంది. దీనంతటికీ ప్రధాన కారణం టీమిండియా గౌతమ్ గంభీర్.

ఐర్లాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్లో మేనేజ్మెంట్ జట్టులో వైభవ్ సూర్య వంశీకి చోటు కల్పించింది. అతడు కూడా మైదానంలో తీవ్రంగా సాధన చేశాడు. బంతులను కసికొద్ది ఆడాడు. అయితే అతడికి చోటు కల్పించే విషయంలో మేనేజ్మెంట్ దోబూచులాట ఆడింది. చివరికి మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం అవుతుంది అనుకుంటుండగా సోషల్ మీడియాలో బీసీసీఐ ఒక వీడియో విడుదల చేసింది. అందులో వైభవ్ సూర్య వంశీ కనిపించాడు. దీంతో అతడు ఆడతాడని.. తన ఆటతీరుతో ఐర్లాండ్లో స్థిరపడిన భారత అభిమానులను సమ్మోహ పరుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ వారందరి ఆశల మీద టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ నీళ్లు చల్లాడు.

గౌతమ్ గంభీర్ సూర్య వంశీని పక్కనపెట్టి.. తనకు అత్యంత ఇష్టమైన హర్షిత్ కు చోటు కల్పించాడు. వాస్తవానికి హర్షిత్ తనను తాను నిరూపించుకోవడానికి కొత్తగా ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే అతనికి చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాలను అతడు కొంతమేర వినియోగించుకున్నాడు. ఇటీవల కాలంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం చికిత్స పొంది ఫిట్ గా ఉన్నాడు. వాస్తవానికి అతడిని ఇంగ్లాండ్ సీరీస్ లో ఆడిస్తే బాగుండేది. అలాకాకుండా గౌతమ్ గంభీర్ ఏరి కోరి ఐర్లాండ్ సిరీస్ లో కూడా ఎంట్రీ ఇచ్చేలా చేశాడు.

హర్షిత్ కు చోటు లభించడంతో సూర్య వంశీ రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావలసి వచ్చింది. అతని ఆట తీరు చూసే అవకాశం అభిమానులకు లేకుండా పోయింది. ఫలితంగా మైదానంలో ఒక రకమైన నిరాశ జనకమైన వాతావరణం కనిపిస్తోంది. వాస్తవానికి హర్షిత్ ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి.. 24 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు పడగొట్టాడు. వాస్తవానికి హర్షిత్ కు ఐర్లాండ్ సిరీస్ లో అవకాశం కల్పించి.. ప్లేయింగ్ 11 లో స్థానం ఎందుకు ఇచ్చాడో గౌతమ్ గంభీర్ కే తెలియాలి. వైభవ్ ఆట చూడాలని ఐర్లాండ్లో స్థిరపడిన భారత అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. టికెట్లు కూడా కొనుగోలు చేశారు. కానీ వారందరి ఉత్సాహం మీద లీటర్ల కొద్దీ నీళ్లు కుమ్మరించాడు గౌతమ్ గంభీర్. వచ్చే మ్యాచ్ లో నైనా సూర్య వంశీకి చోటు కల్పిస్తాడా.. గౌతమ్ గంభీర్ అప్పుడు కూడా హ్యాండ్ ఇస్తాడా.. చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version