Vaibhav Surya Vamsi : ఇటీవల ipl మెగా వేలం జరిగినప్పుడు వైభవ్ సూర్య వంశీని రాజస్థాన్ రాయల్స్ జట్టు 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. లైన్ లో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. వారందరినీ కాదనుకొని రాజస్థాన్ జట్టు వైభవ్ వైపు చూసింది. పోటాపోటీ మధ్య అతడిని 1.10 కోట్లకు దక్కించుకుంది. దీంతో వైభవ్ పేరు ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు అతని పేరే వినిపించింది. అంతేకాదు గూగుల్లో అతని గురించి అభిమానులు విస్తృతంగా వెతికారు. అతడు ఎవరు? నేపథ్యం ఏమిటి? ఎన్ని మ్యాచ్ లు ఆడాడు? ఎన్ని పరుగులు చేశాడు? ట్రాక్ రికార్డు ఎలా ఉంది? సరాసరి ఎంత కొనసాగిస్తున్నాడు? స్ట్రైక్ రేట్ ఎంత మెయింటైన్ చేస్తున్నాడు? అనే విషయాలపై తెగ ఆరా తీశారు. అయితే అతనికి అంత రేటు ఎందుకు? నిండా అతడికి 18 సంవత్సరాలకు కూడా లేవు కదా? అలాంటి ఆటగాడు ఐపీఎల్ లో రాణించగలుగుతాడా? అసలు అతడికి అంత సీను ఉందా? అని విమర్శించిన వాళ్ళు కూడా లేకపోలేదు.
అదరగొట్టాడు
విమర్శకుల దెప్పిపొడుపులకు తగ్గట్టుగానే సూర్యవంశీ ఆట తీరు కూడా కొనసాగింది. అండర్ 19 ఆసియా కప్ లో అతడు ఇటీవల దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఇతడినా రాజస్థాన్ జట్టు అంత పెట్టి కొనుగోలు చేసింది? ఇతని ఆట ఎలా ఉందో చూశారు కదా? ఇకపై ఎలా ఆడతాడో అంతా దైవా దీనం? అన్నట్టుగా సోషల్ మీడియాలో విమర్శకులు దెప్పిపోవడం మొదలుపెట్టారు. సరిగ్గా ఇక్కడే సూర్యవంశీ తనను తాను ఆవిష్కరించుకొనే ప్రయత్నం మొదలుపెట్టాడు. బౌన్స్ బ్యాక్ అనే సిద్ధాంతాన్ని అమలుపెట్టాడు. మొత్తంగా చూస్తే అండర్ 19 ఆసియా కప్ లో అదరగొట్టాడు. యూఏఈ జట్టుపై జరిగిన మ్యాచ్లో 46 బాల్స్ లో 76 రన్స్ చేసి సంచలనం సృష్టించాడు. అతని బ్యాటింగ్ దూకుడు వల్ల భారత జట్టు యూఏఈ విధించిన 138 రన్స్ టార్గెట్ ను జస్ట్ 16.1 ఓవర్ లోనే ఫినిష్ చేసింది. అయితే 76 పరుగులు చేసిన సూర్యవంశీ అజేయంగా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ.. దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లు దంచి కొట్టాడు. మొత్తంగా తన బ్యాటింగ్ స్టైల్ తో మైదానాన్ని హోరెత్తించాడు. సూర్యవంశీ 76 పరుగులు చేయడంతో సోషల్ మీడియాలో అతడి పేరు మారుమోగిపోతుంది. రాజస్థాన్ జట్టు సరైన ఆటగాడిని కొనుగోలు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైభవ్ సూర్యవంశీ ఇలాగే తన ఆట తీరు కొనసాగిస్తే టీమిండియా కు శక్తివంతమైన బ్యాటర్ లభించినట్టేనని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఐపీఎల్ వేలంలో 1.10 కోట్లకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించాడు 13 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ. ఇప్పుడు అతడు U-19 ఆసియా కప్ లో యూఏఈ జట్టుపై 46 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు.#VaibhavSuryaVamshi#U19AsiaCup#RajasthanRoyals pic.twitter.com/Z11jePB0LC
— Anabothula Bhaskar (@AnabothulaB) December 4, 2024