Usman Tariq pause bowling: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ ఏమంటాడంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఐపీఎల్ మొత్తాన్ని మించిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ గా అవతరిస్తుంది. పాకిస్తాన్ నిర్వహించే సూపర్ లీగ్ ను చూసి అన్ని జట్లు నేర్చుకోవాలని గొప్పగా అంటుంటాడు. కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతున్నప్పుడు అతడు మాత్రం సొంత దేశంలో ఉండడు. ఎక్కడో ఉంటాడు.. తన పెట్ డాగ్ లతో.. మా సార్ మస్తు బిజీగా ఉన్నాడు.. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని తగ్గించాడు. సీజ్ ఫైర్ కు తన కారణమని ట్వీట్లు చేయిస్తుంటాడు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నక్వి చెప్పినట్టుగా పాకిస్తాన్ సూపర్ లీగ్ ఉండదు. అసలు ప్రస్తుతం అక్కడ రెండు మైదానాలలో మాత్రమే మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆ దేశంలో లాక్ డౌన్ విధించారు. ఒక రకంగా చెప్పాలంటే కరోనా నాటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అటువంటి పాకిస్తాన్ లో.. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో క్వెట్టా గ్లాడియేటర్స్.. రావల్పిండిస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గల్లి క్రికెట్ ను తలపించింది.. క్వెట్టా గ్లాడియేటర్స్ బౌలర్ ఉస్మాన్ తారీక్ పాజ్ బౌలింగ్ యాక్షన్ తో బౌలింగ్ చేశాడు. దీనిపై స్ట్రైకర్ స్థానంలో ఉన్న మిచెల్ షాక్ ఇచ్చాడు. రెండుసార్లు బంతి వేసే సమయానికి అతడు క్రీజ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో తారీక్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో అంపైర్ మిచెల్ వద్దకు వెళ్లి మాట్లాడాడు. తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది.
తారీక్ బౌలింగ్ పై చాలామంది బ్యాటర్లు అసహనం వ్యక్తం చేశారు. అతడు బంతిని పట్టుకొని వచ్చి కొద్దిసేపు ఆగి.. ఆ తర్వాత వేస్తున్నాడు. దీనివల్ల బ్యాటర్ బంతి గమనాన్ని అంచనా వేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇలా అనేక పర్యాయాలు జరిగాయి. అయినప్పటికీ తారిక్ తన వ్యవహార శైలి మార్చుకోవడం లేదు.. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కూడా ఈ ఉదంతం జరిగింది.. తారీక్, మిచెల్ మధ్య జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.
ఈ వీడియోను ఆసరాగా చేసుకుని అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. గల్లి క్రికెట్లో బౌలింగ్ వేసే వ్యక్తిని తీసుకొచ్చి పాకిస్తాన్ సూపర్ లీగ్ లో బౌలర్ గా మారిస్తే ఇలా ఉంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఒక బౌలర్ బౌలింగ్ వేస్తున్నప్పుడు.. ఈ స్థాయిలో పాజ్ యాక్షన్ కు పాల్పడటం క్రికెట్లో మంచిది కాదని.. అది క్రికెట్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
Daryl Mitchell refuses to face Usman Tariq #QTGVRWP pic.twitter.com/2CO6z4NvR9
— Nibraz Ramzan (@nibraz88cricket) April 10, 2026