IPL 2024 Auction: దుబాయ్ వేదికగా నిర్వహించిన ఐపీఎల్– 2024 సీజన్ కోసం మినీ వేలం ముగిసింది. మొత్తం 333 మంది ఆటగాళ్లు బరిలో నిలవగా.. ఆయా ఫ్రాంఛైజీలు 77 మందిని వేలంలో దక్కించుకున్నాయి. మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయి ధర పలికాడు. అతడిని కోల్కతా నైటైడర్స్ రూ.24.75 కోట్లకు దక్కించుకుంది. మరో ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్ని రూ.20.50 కోట్లు వెచ్చించి సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. అయితే ఈ వేలంలో భారీ ధర పలుకుతారనుకున్న కొంతమంది టాప్ ప్లేయర్లకు నిరాశే ఎదురైంది. బేసిక్ ప్రైజ్‌కు కూడా వారిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు.
77 స్లాట్‌లు.. 333 మంది ప్లేయర్లు..
ఐపీఎల్ 2024 వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ముందగానే విడుదల చేసింది. 77 స్లాట్‌ల కోసం (47 స్లాట్‌లు భారత్ ఆటగాళ్ల కోసం, 30 స్లాట్‌లు విదేశీ ఆటగాళ్ల కోసం) జరిగే ఈ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఇందులో 214 మంది భారత ఆటగాళ్లు కాగా.. 119 మంది విదేశీ ఆటగాళ్లు (ఇద్దరు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు కలుపుకుని) ఉన్నారు. మొత్తం జాబితాలో 116 మంది క్యాప్డ్ ప్లేయర్స్ కాగా.. 215 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్స్, ఇద్దరు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలో 23 మంది ఆటగాళ్లు రూ. 2 కోట్ల బేస్ ధర విభాగంలో పేర్లు నమోదు చేసుకోగా.. 13 మంది రూ.1.5 కోట్ల బేస్ ధరలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
సెట్‌ల వారీగా వేలం..
సెట్ నంబర్ 1..
హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, కరుణ్ నాయర్, మనీష్ పాండే, రోవ్‌మన్ పావెల్, రిలీ రొస్సో, స్టీవ్ స్మిత్.
సెట్ నంబర్ 2
గెరాల్డ్ కోయెట్జీ, పాట్ కమిన్స్, నిందు హసరంగా, డారిల్ మిచెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్షల్ పటేల్, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, క్రిస్ వోక్స్
సెట్ నంబర్ 3:
కేఎస్.భరత్, జోస్ ఇంగ్లిస్, కుశాల్ మెండిస్, ఫిలిప్ సాల్ట్, ట్రిస్టన్ స్టబ్స్
సెట్ నంబర్ 4:
లోకీ ఫెర్గూసన్, జోష్ హాజిల్‌వుడ్, అల్జరీ జోసఫ్, మధుషంక, శివమ్ మావి, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, జయదేవ్ ఉనద్కత్, ఉమేష్ యాదవ్
అమ్ముడుపోని టాప్ ఆటగాళ్లు వీళ్లే..
స్టీవ్ స్మిత్ (కనీస ధర రూ.2 కోట్లు)
జోష్ ఇంగ్లిస్ (కనీస ధర రూ.2 కోట్లు)
జోష్ హేజిల్ వుడ్ (కనీస ధర రూ.2 కోట్లు)
ఆదిల్ రషీద్ (కనీస ధర రూ.2 కోట్లు)
వాండర్ డసెన్ (కనీస ధర రూ.2 కోట్లు)
జేమ్స్ విన్స్ (కనీస ధర రూ.2 కోట్లు)
సీన్ అబాట్ (కనీస ధర రూ.2 కోట్లు)
జేమీ ఓవర్టన్ (కనీస ధర రూ.2 కోట్లు)
బెన్ డకెట్ (కనీస ధర రూ.2 కోట్లు)
ఫిలిప్ సాల్ట్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
కొలీన్ మున్రో (కనీస ధర రూ.1.50 కోట్లు)
జేసన్ హోల్డర్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
జేమ్స్ నీషమ్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
డానియల్ సామ్స్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
క్రిస్ జోర్డాన్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
టైమల్ మిల్స్ (కనీస ధర రూ.1.50 కోట్లు)