IPL 2024 Auction: దుబాయ్ వేదికగా నిన్న ఐపీఎల్ మినీ ఆక్షన్ నిర్వహించారు. ఇక అందులో భాగంగానే అన్ని ఫ్రాంచైజ్ లు కొంతమంది ప్లేయర్లను కొనుగోలు చేశారు.ఇక కొన్ని టీమ్ లు క్వాలిటీ ఉన్న ప్లేయర్లను కొనుగోలు చేస్తే మరికొన్ని టీమ్ లు నార్మల్ ప్లేయర్ లను కొనుగోలు చేశారు. ఇక అందులో భాగంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం క్వాలిటీ ఉన్న ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసిందంటూ హైదరాబాద్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక అలాగే కలకత్త టీం ఇప్పటివరకు ఐపిఎల్ లో అత్యధికంగా డబ్బులను వెచ్చించి ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ ని 24.75 కోట్లు పెట్టి అతన్ని టీం లోకి తీసుకుంది…ఇక ఇదిలా ఉంటే బెంగళూరు టీమ్ మాత్రం పాట్ కమ్మిన్స్ ని, శివ మావి ని కొనడానికి చాలా వరకు ట్రై చేసినప్పటికీ ఆ ప్లేయర్లను దక్కించుకోలేకపోయింది. ఇక దాంతో పాటుగా బెంగళూరు టీం ఎవరిని కొనుగోలు చేస్తుంది అనే దాని మీద సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ విషయం లో బెంగళూరు టీమ్ అందరి ఆశలపైన నీళ్లు చల్లుతూ వెస్టిండీస్ కి చెందిన అల్జరి జోసఫ్ ని 11 కోట్ల 50 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది.
ఆల్జరి జోసఫ్ పెద్ద ప్లేయర్ ఏం కాదు అయినప్పటికీ అతని కోసం అన్ని కోట్లు వెచ్చించడం అనేది కరెక్ట్ కాదు అంటూ బెంగళూరు అభిమానులు సైతం బెంగళూరు టీం పైన విమర్శలను కురిపిస్తున్నారు. నిజానికి ఫస్ట్ క్లాస్ ప్లేయర్ ని తీసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఏదో ఒక ప్లేయర్ ని తీసుకుంటే సరిపోతుంది అని అలాంటి ఒక ప్లేయర్ని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ బెంగళూరు అభిమానులు బెంగుళూర్ టీమ్ చేసిన పనికి తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇప్పటికే బెంగళూరు టీమ్ ఐపిఎల్ సీజన్ స్టార్ట్ అయిన మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు ఒక్క కప్పు కూడా గెలవలేకపోయింది. ఇక ఈసారి అయిన కప్పు గెలుస్తుందేమో అని అభిమానులు ఆశిస్తున్నారు.
కానీ ప్లేయర్ల ఎంపికలోనే వీళ్ళకు క్లారిటీ లేనట్టుగా తెలుస్తుంది.ఇక ఇలాంటి వారు కప్పు ఏమి గెలుస్తారు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…ఇక ఇది ఇలా ఉంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన జోస్ హజీల్ వుడ్ పేరు రాగానే బెంగళూరు టీం ప్రాంచైజ్ అతనికి దండం పెట్టినట్టుగా సింబాలిక్ గా చూపించాడు. హాజీల్ వుడ్ లాంటి ఒక ప్లేయర్ ని అలా అవమానించడం కరెక్ట్ కాదు అంటూ బెంగుళూర్ ప్రాంచైజ్ పైన కూడా సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరైతే హజిల్ వుడ్ కంటే మీరు తీసుకున్న అల్జరీ జోసఫ్ పెద్ద ప్లేయర్ అయితే కాదు అతని కంటే హాజిల్ వుడ్ చాలా బెటర్ అంటూ బెంగుళూర్ టీమ్ పైన సెటైర్లు వేస్తున్నారు…