Homeక్రీడలుక్రికెట్‌Harsh Goenka: వచ్చే ఐపీఎల్ నాటికి ఆ రెండు జట్ల అమ్మకం..

Harsh Goenka: వచ్చే ఐపీఎల్ నాటికి ఆ రెండు జట్ల అమ్మకం..

Harsh Goenka: మనదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీకి విపరీతమైన ఆదరణ ఉంటుంది. 2008లో మొదలైన ఈ టోర్నీ అంతకుమించి అనే స్థాయిలో ఎదుగుతోంది. భారీగా కార్పొరేట్ కంపెనీలు జట్లను సొంతం చేసుకోవడంతో కోట్ల ఆట ప్రతి ఏడాది సాగుతోంది.

ఐపీఎల్ ద్వారా ఎంతో మంది క్రికెటర్లు తమ భవిష్యత్తును బలోపేతం చేసుకున్నారు. విస్తృతంగా అవకాశాలు పొంది ఆర్థికంగా కూడా దృఢంగా స్థిరపడ్డారు. అందువల్లే విదేశీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ లో ఆడేందుకు అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అవసరమైతే తమ జాతీయ జట్లలో ఆడకుండా ఉంటారు. ఐపీఎల్ 2008లో మొదలై ఇప్పటివరకు విజయవంతంగా సాగుతోంది అంటే దానికి ప్రధాన కారణం అభిమానుల ఆదరణ.

ఐపీఎల్ లో చాలావరకు జట్లు ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి. కొన్ని జట్లు వివిధ కారణాల వల్ల కాలగర్భంలో కలిసిపోయాయి. వాటి స్థానంలో కొత్త జట్లు ఏర్పడ్డాయి. ఇంకా కొన్ని జట్లు వివిధ ఆరోపణలతో ఇబ్బంది పడ్డాయి. ఐపీఎల్ లో మాత్రం విజయవంతంగా అన్ని జట్లు కొనసాగుతున్నాయి.

ఈ ఏడాది ట్రోఫీ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు ను అమ్మకానికి పెడతారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ కూడా చేరింది. ఈ జట్టు కూడా చేతులు మారుతుందని సమాచారం.. దీనికి సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయాంక కీలక ట్విట్ చేశారు. అదికాస్తా సంచలనగా మారింది. “ఇప్పటిదాకా ఒకటే అనుకున్నాం. ఆ జాబితాలో మరొకటి చేరే అవకాశం కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా చేతులు మారే విధంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో బెంగళూరు గురించి ఈ చర్చ జరిగేది. ఇప్పుడు ఈ జాబితాలో రాజస్థాన్ కూడా చేరింది. చాలామంది కొనుగోలుదారులు రంగంలో ఉన్నారు.. పూణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, అమెరికా నుంచి కొత్త యజమానులు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జట్లను ఎవరు సొంతం చేసుకుంటారో” అని
హర్ష్ గోయాంక గోయంక తన పోస్టులో కీలక విషయాలను వెల్లడించారు.

రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ చేతిలో ఉంది. ఈ కంపెనీకి 65% వాటా ఉంది. ఇక ఇటీవల బెంగళూరు జట్టు యాజమాన్యం డియా జియో కంపెనీ తన వాటాను విక్రయించే పని చేపట్టింది. ఇప్పటికే ఈ విషయాన్ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి సమాచారం కూడా ఇచ్చింది. తమ కంపెనీలో పెట్టుబడి పెట్టే వారికోసం డియా జియో కంపెనీ ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలుస్తోంది.. బెంగళూరు జట్టు విక్రయానికి సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆధర్ పూనావాలా ఈ ఏడాది అక్టోబర్లో ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు.. అయితే ఆయన, మరో కొంతమంది పారిశ్రామికవేత్తలు బెంగళూరు జట్టును కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version