https://oktelugu.com/

ట్రోలింగ్: కోహ్లీ వద్దు.. రోహిత్ ముద్దు

డబ్ల్యూ.టీసీ ఫైనల్ లో టీమిండియా ఘోర పరాజయంతో భారత అభిమానులు కోపంతో రగిలిపోతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతోంది. తాజాగా కెప్టెన్ కోహ్లీని దించాలని.. రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. కెప్టెన్ కోహ్లీని మార్చాలంటూ హడావుడి చేస్తున్నారు. #MakeRohitindiancaptain, #Wewantnewcaptain అనే రెండు హ్యాష్ ట్యాగ్ లను ఇప్పుడు ట్రెండింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిని ట్యాగ్ చేస్తూ సోషల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 24, 2021 / 10:38 PM IST
    Follow us on

    డబ్ల్యూ.టీసీ ఫైనల్ లో టీమిండియా ఘోర పరాజయంతో భారత అభిమానులు కోపంతో రగిలిపోతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతోంది.

    తాజాగా కెప్టెన్ కోహ్లీని దించాలని.. రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. కెప్టెన్ కోహ్లీని మార్చాలంటూ హడావుడి చేస్తున్నారు. #MakeRohitindiancaptain, #Wewantnewcaptain అనే రెండు హ్యాష్ ట్యాగ్ లను ఇప్పుడు ట్రెండింగ్ చేస్తున్నారు.

    ముఖ్యంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక వెంటనే రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    https://twitter.com/_abhibaliyan/status/1407766153955471362?s=20