Tilak Varma Asia Cup 2025: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టును గెలిపించి.. మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చాడు తిలక్ వర్మ. టీమిండియాలో ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు విఫలమైన చోట అతడు నిలబడ్డాడు. స్థిరమైన ఇన్నింగ్స్ ఆడాడు. దృఢమైన పరుగులు చేశాడు. విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి చివరి వరకు.. అజేయంగా నిలబడ్డాడు. పాకిస్తాన్ జట్టుమీద టీమిండియా కున్న రికార్డును మరింత పదిలం చేసాడు.
తిలక్ వర్మ ఆడుతున్నప్పుడు జట్టు తీవ్రమైన కష్టాల్లో ఉంది. పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. ఆ దశలో ఏమాత్రం సమయమనం కోల్పోయినా జట్టుకు తీవ్ర ఇబ్బంది తప్పదు. పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం కంటే మించిన దరిద్రం ఇంకొకటి ఉండదు. ఇవన్నీ కూడా తిలక్ వర్మలో తీవ్రమైన పట్టుదలను పెంచాయి. అదే అతనితో బలమైన అడుగులు వేయించేలా చేశాయి. స్థిరమైన, దృఢమైన, బలమైన ఇన్నింగ్స్ లు ఆడటంతో టీమిండియా తీవ్రమైన ఉత్కంఠ మధ్య విజయం సాధించింది. తద్వారా ఆసియా కప్లో తనకున్న చరిత్రను మరింత స్థిరం చేసుకుంది.
Also Read: రాత్రికి రాత్రే సూపర్ స్టార్ కాలేదు.. తిలక్ వర్మ సక్సెస్ స్టోరీ వెనుక కన్నీటి గాధ!
ఆసియా కప్ లో అద్భుతమైన ప్రతిభ చూపించడం ద్వారా తిలక్ వర్మ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అతడికి వినమ్రమైన నమస్కారం చేశాడు. రెండు చేతులు జోడించి.. తలవంచి.. తన గౌరవ సూచకాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా గెలిచిన తర్వాత స్వదేశానికి వచ్చిన తిలక్ వర్మ తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు.. ” ఇండియన్ గెలిపించడానికి నేను సిద్ధపడ్డాను. అదే లక్ష్యంతో బ్యాటింగ్ చేశాను. ఫైనల్ లో ఆ తీరుగా ఆడేందుకు అదే కారణం. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లు కొంత దూకుడుతో వచ్చారు. వాస్తవానికి ఆటను భావోద్వేగంతో ఆడితే చాలా కష్టం. ఆటను ఆట మాదిరిగానే ఆడాలి. దాని ద్వారానే పాకిస్తాన్ ప్లేయర్లకు రిప్లై ఇచ్చాం. చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆటను చూస్తూ పెరిగాను. ఫైనల్ మ్యాచ్లో నేను ఆడిన ఆటను విరాట్ కోహ్లీ ఆటతో పోల్చి చెప్పడం గొప్పగా ఉంది. వచ్చే ప్రపంచ కప్ లో అవకాశం కనుక లభిస్తే భారత జట్టును గెలిపించడమే లక్ష్యంగా ఉంటుందని” తిలక్ వర్మ పేర్కొన్నాడు.