Rachin Ravindra: ఐపీఎల్ 2024 కోసం ఇప్పటినుంచి అన్ని టీం లు కూడా చాలా కసరత్తులను చేస్తున్నాయి. ఇక అందులో భాగంగా టీం యాజమాన్యం వాళ్ళ టీం నుంచి కొంతమంది ప్లేయర్లను రిలీజ్ చేయగా, ఇప్పుడు మళ్ళీ మినీ యాక్షన్ లో కొంత మంది ప్లేయర్లను వల్ల టీమ్ లోకి తీసుకోవాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టు గా తెలుస్తుంది. ఇక ఈనెల 19వ తేదీన దుబాయ్ వేదికగా జరిగే మినీ ఆక్షన్ లో చాలామంది ప్లేయర్లు ఆక్షన్ లోకి రాబోతున్నారు. ఇక ఇదే క్రమంలో మొన్న జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అద్భుతమైన ఫామ్ ని కనబరిచి తనదైన రీతిలో సెంచరీ లు చేసి ఆడిన మొదటి వరల్డ్ కప్ లోనే తనదైన రీతిలో వాళ్ల టీమ్ కి అదిరిపోయే విజయాలను అందించిన రచిన్ రవీంద్ర ని తీసుకోవడానికి అన్ని టీమ్ లు కూడా ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇక రచిన్ రవీంద్ర 50 లక్షల బేస్ ప్రైజ్ తో ఐపిఎల్ లో లోకి అడుగు పెట్టబోతున్నాడు.ఇక ఇదే క్రమం లో ఇతని మీద భారీ డబ్బులను పెట్టుకోవడానికి కొన్ని టీమ్ లు తీవ్రమైన పోటి ని కనబరచబొతున్నట్టు గా తెలుస్తుంది.
ఇక అందులో ముఖ్యంగా ఎస్ ఆర్ హెచ్ టీమ్ రచిన్ ని తీసుకోవడానికి అసక్తి ని కనబరుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్ ఆర్ హెచ్ టీమ్ లోకి ఆల్ రౌండర్ ప్లేయర్ కావాలి అందుకే రచిన్ రవీంద్ర టీమ్ లో ఉంటే వాళ్లకి చాలా బాగా హెల్ప్ అవుతాడు.ఇక తను ఓపెనింగ్ అయిన ఆడతాడు, ఫస్ట్ డౌన్ లో అయిన ఆడతాడు కాబట్టి ఆయనని తీసుకుంటే హైదరాబాద్ టీం చాలా స్ట్రాంగ్ గా తయారవుతుందనేది ఆ టీం యాజమాన్యం అనుకుంటుంది. ఇక అందులో భాగంగానే ఎంత మనీ అయిన సరే తన మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది…
ఇక ఎస్ ఆర్ హెచ్ తో పాటుగా పంజాబ్ కింగ్స్ టీమ్ కూడా రచిన్ రవీంద్రని తీసుకోవడానికి పోటీ పడుతుంది. ఎందుకంటే వాళ్లకు కూడా ఒక మంచి ఆల్ రౌండర్ కావాలి. అటు బ్యాట్ తోను,ఇటు బాల్ తొను రనించ గలిగే ప్లేయర్ టీం లో ఉన్నప్పుడే టీమ్ లో ఉన్న ప్లేయర్లు అందరూ కూడా ఫ్రీగా మ్యాచ్ ఆడుతారు. అలాగే తమ ప్రత్యర్థి టీం తమకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన కూడా అలవొక గా స్కోర్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ల టీంలోకి ఆల్ రౌండర్ లను తీసుకోవాలని చూస్తున్నారు…
ఇక బెంగళూరు టీం కూడా ఇప్పటికే ఐపీఎల్ స్టార్ట్ అయిన ప్రతిసారి కప్పు కొట్టాలనే కసి తో బరిలోకి దిగినప్పటికి ఇప్పటి వరకు అయితే ఒక్కసారి కూడా వాళ్ళకి కప్పు అయితే రాలేదు. ఇక దాంతో ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలనే ఉద్దేశ్యం తోనే వీళ్ళు భరిలోకి దిగుతున్నారు. అయితే టీమ్ లో ఆల్ రౌండర్ ప్లేయర్ అందుబాటులో ఉంటే బాగుంటుందని భావిస్తున్నట్టు గా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రజెంట్ రచిన్ రవీంద్ర ని తీసుకోవాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే వీళ్ళు కెమరూన్ గ్రీన్ లాంటి ఒక మంచి ఆల్ రౌండర్ ని టీంలో తీసుకున్నారు. అయినప్పటికీ స్పిన్ ఆల్ రౌండర్ గా రచిన్ రవీంద్ర ని తీసుకోవాలని చూస్తున్నారు చూడాలి మరి రచిన్ రవీంద్ర ని ఎవరు దక్కించుకుంటారు అనేది…