India Vs Australia: ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే భారీ మ్యాచ్ లో జరిగేది ఇదే…

ఇంతకు ముందు ఇండియా ఇక్కడ మూడు మ్యాచులు ఆడితే అందులో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి మిగిలిన రెండు మ్యాచులో ఓడిపోవడం జరిగింది.ఇక ఈ పిచ్ లో మూడు మ్యాచులకు గాను నాలుగు ఇన్నింగ్స్ లు కలిపి ఇక్కడ 300 ప్లస్ రన్స్ చేయడం జరిగింది.

Written By: Gopi, Updated On : September 27, 2023 1:23 pm

India Vs Australia

Follow us on

India Vs Australia: ఇండియా ఆస్ట్రేలియా మధ్య రాజ్ కోట్ లో ఇవాళ్ల మూడో వన్డే మ్యాచ్ జరుగుతుంది.ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచిన ఓడిపోయినా పెద్దగా పోయేదేం లేదు కాబట్టి ఇండియా టీం ఈ మ్యాచ్ ని ఒక ప్రాక్టీస్ మ్యాచ్ గా ఆడనుంది.ఇక ఈ మ్యాచ్ లో ఇండియా టీం చాలా మార్పులు చేస్తుంది. అదేంటంటే ఇండియా టీంలో మెయిన్ ప్లేయర్లు అయినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ లు ఈ మ్యాచ్ లో అందుబాటులోకి రానున్నారు.ఇక ఈ మ్యాచ్ రాజ్ కోట్ లో ఆడుతున్నారు కాబట్టి అక్కడ పిచ్ బ్యాటింగ్ కి ఎక్కువగా అనుకూలిస్తుంది.కాబట్టి ఇక్కడ రెండు టీములు కూడా ఎక్కువ స్కోర్ చేసేలా కనిపిస్తున్నాయి.

ఇంతకు ముందు ఇండియా ఇక్కడ మూడు మ్యాచులు ఆడితే అందులో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి మిగిలిన రెండు మ్యాచులో ఓడిపోవడం జరిగింది.ఇక ఈ పిచ్ లో మూడు మ్యాచులకు గాను నాలుగు ఇన్నింగ్స్ లు కలిపి ఇక్కడ 300 ప్లస్ రన్స్ చేయడం జరిగింది.ఇక్కడ మొదటి బ్యాటింగ్ చేసిన టీం ఇప్పటి వరకు ఎక్కువ సార్లు గెలిచింది. కాబట్టి ఈ మ్యాచులో టాస్ గెలిచినా టీం మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్త్తుతం ఆస్ట్రేలియా టీం మొత్తం ఫుల్ స్క్వాడ్ తో బరిలోకి దిగుతుంది.ఓపెనర్లు గా డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, తర్వాత స్టీవ్ స్మిత్,నెంబర్ ఫోర్ లో లాబుశంగి,నెంబర్ ఫైవ్ లో మక్సవెల్, నెంబర్ సిక్స్ లో గ్రీన్ కానీ లేదా స్టోయినిస్ లో ఎవరినో ఒక్కరిని ఆల్ రౌండర్ గా తీసుకోవడం జరుగుతుంది.ఇక నెంబర్ సెవన్ లో అలెక్స్ క్యారీ,ఎయిట్ కమ్మిన్స్, నెంబర్ నైన్ లో మిచెల్ స్టార్క్, నెంబర్ టెన్ లో సీన్ అబోట్ లేదా హాజిల్ వుడ్,నెంబర్ లెవన్ లో ఆడమ్ జంపా ని తీసుకునే అవకాశం ఉంది.

అయితే వీళ్ళలో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే వార్నర్, స్మిత్,అలెక్స్ క్యారీ, గ్రీన్ లేదా స్టోయినిస్ చాలా డేంజర్ గా మారే అవకాశం అయితే ఉంది. అందుకే ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఈ ముగ్గురిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇక బౌలింగ్ విషయానికి వస్తే జంపా, హాజిల్ వుడ్, స్టార్క్ లు కూడా వాళ్ళ బౌలింగ్ స్టామినా ని నిరూపించుకొని మొన్న ఇండియా మీద పోయిన పరువును తిరిగి దక్కించుకోవాలని చూస్తున్నారు…

ఇక ఇండియన్ టీం ప్లేయర్ల విషయానికి వస్తే రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ ఇద్దరి లో ఎవరో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం అయితే ఉంది.అందుకే ఈ మ్యాచ్ లో సీనియర్ ప్లేయర్లు గా వీళ్లు ఇండియన్ టీం లోకి రావడం వల్ల ఈ మ్యాచ్ గెలవడం వల్ల ఇండియా టీం కి వచ్చేది ఏం లేదు. కానీ ఈ మ్యాచ్ టీం కి ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లా అవుతుంది అనే చెప్పాలి.అలా కాకుండా ఈ మ్యాచ్ గెలిచి ఆస్ట్రేలియని వైట్ వాష్ చేయాలంటే మాత్రం మన టీం లో ఉన్న అశ్విన్, కుల్దీప్ యాదవ్, సిరాజ్ ముగ్గురు విజృంభిస్తే ఇది ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం లో ఉన్న టాప్ బ్యాట్స్ మెన్స్ అయినా వార్నర్, స్మిత్ లను తొందరగా అవుట్ చేస్తే సరిపోతుంది. అలాగే మిడిలాడర్ లో వచ్చే ప్లేయర్లు అయినా అలెక్స్ క్యారీ, గ్రీన్ లాంటి హిట్టర్ లను కూడా తక్కువ స్కోర్ కె కట్టడి చేయాల్సి ఉంటుంది.ఇక ఇవాళ్టి మ్యాచ్ లో ఎవరెవరు ఎంత స్కోర్లు చేస్తారో చూడాలి…