Sunrisers Hyderabad 2024: ఐపీఎల్ మినీ వేలం లో హైదరాబాద్ టీమ్ తమదైన రీతిలో సత్తా చాటుకుంది. మిగతా ఏ ఫ్రాంచైజ్ లకు సాధ్యం కానీ విధంగా ముగ్గురు టాప్ క్లాస్ ప్లేయర్లను తీసుకొని 2024 ఐపీఎల్ కోసం ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ఈ టీమ్ లో ప్లేయర్లు తమదైన రీతిలో సత్తా చాటడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇంతకు ముందు హైదరాబాద్ టీం యొక్క ఫుల్ స్క్వాడ్ లో చాలా డిస్టబెన్స్ గా ఉండేది.
ఎందుకంటే టీంలో సరైన బ్యాట్స్ మెన్స్ గాని బౌలర్లు గాని ఉన్నప్పటికీ వాళ్ళందరిని ఏకతాటిపై నడిపించే కెప్టెన్ సరిగ్గా లేకపోవడం అనేది ఆ టీం ప్రధాన లోపం గా కనిపించింది.ఇక ఇప్పుడు కమ్మిన్స్ రాకతో కొంతవరకు ఆ ప్రాబ్లం కి చెక్ పెట్టినట్టుగా అయింది… ఇక ఒకసారి హైదరాబాద్ టీమ్ ఫుల్ స్క్వాడ్ ని కనక మనం చూసుకున్నట్లయితే
పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్, హాసరంగ, ఐడెన్ మార్కరం, రాహుల్ త్రిపాటి, గ్లేన్ ఫిలిప్స్, మాయాంక్ అగర్వాల్, హెరించ్ క్లాసెన్, అనుముల్ ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, మాక్రో జాన్సన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, ఫాజల్ల ఫారుకి, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ లాంటి ప్లేయర్లతో హైదరాబాద్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది.
2024 వ సంవత్సరంలో జరిగే ఐపీఎల్ సీజన్ లో ఎలాగైనా సరే కప్పు కొట్టి మరోసారి తమ సత్తా ఏంటో చూపించుకోవాలని హైదరాబాద్ టీం చాలా తహ తహలాడుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే చాలా భారీ మొత్తం వెచ్చించి టాప్ ప్లేయర్లందరిని తమ టీం లోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మినీ ఆక్షన్ లో అందరికంటే బెస్ట్ ప్లేయర్స్ ని కొనుగోలు చేసిన టీమ్ గా హైదరాబాద్ టీం ఒక సరికొత్త రికార్డ్ ను కూడా క్రియేట్ చేసింది.
2023 మెగా వేలం లో హైదరాబాద్ టీం ప్లేయర్లను తీసుకున్నప్పుడు చాలా విమర్శలు వచ్చాయి ఏ ప్లేయర్స్ దొరకనట్టుగా చాలా పూర్ పర్ఫామెన్స్ ఇచ్చే ప్లేయర్స్ ని తీసుకున్నారు అంటూ చాలా రకాల విమర్శలు అయితే వచ్చాయి.అయితే ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెడుతూ టాప్ ప్లేయర్లను తీసుకొని టీం ని టాప్ రేంజ్ లో రెడీ చేయడానికి సిద్ధమవుతున్నారు…ఇక 2024 సీజన్ లో హైదరాబాద్ టీమ్ కప్పు కొట్టి ఒక రికార్డ్ ని క్రియేట్ చేయాలని కోరుకుందాం…