Asian Games 2023: చైనా నిర్వహిస్తున్న ఆసియన్ గేమ్స్ లోకి మన ఇండియా టీం కి ఆహ్వానం వచ్చిన విషయం మనకు తెలిసిందే…ఇక బిసిసిఐ కూడా మన మెయిన్ టీం వరల్డ్ కప్ ఆడటం లో బిజీ గా ఉండటం తో యంగ్ ఇండియన్ ప్లేయర్లని చైనా పంపించాలని అనుకుంది.ముందు అనుకున్నట్టుగానే బిసిసిఐ ఏషియన్ గేమ్స్ కోసం ఒక యంగ్ టీం ని అయితే సెలెక్ట్ చేసింది ఇక అందులో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనే విషయం మనం ఒకసారి తెలుసుకుందాం…
ముందు గా ఈ టీం కి కెప్టెన్ గా ఋతురాజ్ గైక్వాడ్ ని సెలెక్ట్ చేసారు.ఆయన సారధ్యం లో ఆడబోతున్న ఈ టీం లో…ఋతురాజ్ గైక్వాడ్,యశస్వి జైశ్వాల్,రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ,రింకు సింగ్,జితేష్ శర్మ, ప్రభుసిమ్రన్ సింగ్, వాషింగ్టన్ సుందర్,శివమ్ దూబే, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణో, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్,ముకేశ్ కుమార్,శివమ్ మావి లాంటి ప్లేయర్లని సెలెక్ట్ చేసారు ఇక స్టాండ్ బై లో కూడా కొందరు ప్లేయర్లని సెలెక్ట్ చేసారు…యష్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యారు,సాయి సుదర్శన్,దీపక్ హూడా లాంటి ప్లేయర్లతో ఉన్న ఈ టీం ని బిసిసిఐ చైనా పంపిస్తుంది. ఈ టీం లో అసలు ఒక్క సీనియర్ ప్లేయర్ కూడా లేడు.అందులో ఇప్పటివరకు అసలు ఒక్క మ్యాచ్ లో కూడా కెప్టెన్ గా చేయని గైక్వాడ్ కి కెప్టెన్ గా బాధ్యతలు ఇచ్చారు. ఈ మ్యాచులు సెప్టెంబర్ 23 వ తేదీ నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు జరుగుతాయి.ఇక మన ఇండియా టీం డైరెక్ట్ గా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది…అది కూడా అక్టోబర్ మూడోవ తేదీన జరుగుతుంది.
అయితే ఈ మ్యాచులకి గైక్వాడ్ ని కెప్టెన్ చేయడం వెనక బిసిసిఐ మరో ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.యంగ్ ప్లేయర్లని ఇప్పటి నుంచే కెప్టెన్ గా చేస్తూ వాళ్ళని ట్రైన్ చేయాలనీ చూస్తుంది. ఇక మీదట ఒక కెప్టెన్ సరిగ్గా కెప్టెన్సీ చేయడం లేదు అంటే బ్యాకప్ లో ముగ్గురు, నలుగురు కెప్టెన్లు రెడీ గా ఉండేలా చూసుకుంటుంది…అందుకే కుర్ర ప్లేయర్లకి కూడా చాలా పెద్ద బాధ్యతలని అప్పగిస్తుంది…ఇక బిసిసిఐ పెట్టిన ఈ బాధ్యతలని గైక్వాడ్ చాలా బాగా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.అందులో భాగంగానే ఈ మ్యాచ్ ల మీద గైక్వాడ్ చాలా కేర్ తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది…