Homeక్రీడలుInd W Vs Eng W Test: చరిత్ర లిఖించిన భారత మహిళా జట్టు.. క్రికెట్‌...

Ind W Vs Eng W Test: చరిత్ర లిఖించిన భారత మహిళా జట్టు.. క్రికెట్‌ చరిత్రలోనే భారీ విజయం

Ind W Vs Eng W Test: మహిళా టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే భారీ విజయం నమోదైంది. ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో టీమిండియాచరిత్ర సృష్టించింది. ఏకంగా 347 పరుగుల తేడాతో బ్రిటీష్‌ జట్టుపై ఘన విజయం సాధించింది. వుమెన్స్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం. నాలుగు రోజులపాటు జరిగే.. టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంతకుముందు ఏ జట్టు ఇంత భారీ విజయాన్ని నమోదు చేయలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో.. 428 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం ఇంగ్లాండ్‌ను ఫాలోఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 186 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం.. బ్రిటీష్‌ మహిళల జట్టును రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూల్చి… 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై తొమ్మిది వికెట్లు నేలకూల్చి దీప్తి శర్మ ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా దీప్తి శర్మ ఎంపికైంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన టీమిండియా..
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్ట్‌ ఆడుతున్న అరంగేట్ర బ్యాటర్‌ శుభాసతీశ్‌76 బంతుల్లో 69 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్‌ 99 బంతుల్లో 68 పరుగులతో రాణించారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 81 బంతుల్లో 49 పరుగులు చేసి అర్థసెంచరీకి కేవలం ఒక్క పరుగు ముందు ఔట్‌ అయి నిరాశ పరిచింది. కానీ యాస్తిర్‌ బాటియా 88 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్‌తో 66 పరుగులు చేసి సత్తా చాటింది. వీరిద్దరూ భాగస్వామ్యంతో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 313 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. లోయర్‌ ఆర్డర్‌లో దీప్తి శర్మ 67 పరుగులు చేసింది. తొరిరోజే 7 వికెట్లకు 410 పరుగులతో ఆట ముగించింది. రెండో రోజు ఆట ప్రారంభించిన కాసేపటికే 428 పరుగులకు ఆలౌటైంది.

ఇంగ్లాండ్‌ పేలవ ప్రదర్శన..
అనంతరం ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తొలుత పేసర్లు తర్వాత స్పిన్నర్లు విజృంభించడంతో కేవలం 136 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ బౌలింగ్‌కు వచ్చాక ఇంగ్లాండ్‌ కష్టాలు రెట్టింపయ్యాయి. దీప్తి, స్నేహ్‌ దెబ్బకు ఇంగ్లాండ్‌ 28 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దీప్తి శర్మ(5/7) స్పిన్‌ మాయలో చిక్కుకున్న ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. స్నేహ్‌ రాణా (2/25) కూడా ఆకట్టుకుంది.
ఇంగ్లాండ్‌ను ఫాలోఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా ఆ ఛాన్స్‌ ఇవ్వకుండా భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఓపెనర్లు షెఫాలి, స్మృతి తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. కానీ స్మృతి వికెట్‌తో భారత్‌ను ఎకిల్‌స్టోన్‌ తొలి దెబ్బ కొట్టింది. జెమీమా (27), హర్మ¯Œ ప్రీత్‌ కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 133/6తో నిలిచిన జట్టును పూజ (17 బ్యాటింగ్‌)తో కలిసి హర్మన్‌ ఆదుకుంది. 133 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 186 పరుగులకు డిక్లేర్‌ చిసింది.

భారీ టార్గెట్‌..
రెండు ఇన్సింగ్స్‌ కలిపి భారత జట్టు ప్రత్యర్థిథ ఇంగ్లాండ్‌ ముందు 479 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ ఏదశలోనూ లక్ష్య ఛేదనకు యత్నించలేదు. కనీసం డ్రా కోసం కూడా ప్రయత్నించలేదు. మరోసారి దీప్తి శర్మ స్పిన్‌తో మాయ చేయడంతో ఇంగ్లాండ్‌ 131 పరుగులకే కుప్పకూలింది. దీప్తి నాలుగు వికెట్లతో రాణించింది. దీంతో 347 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular