https://oktelugu.com/

India Vs Australia 3rd Odi: ఆసీస్ తో మూడో వన్డే: భారత జట్టులో ఈ కీలక మార్పులు తప్పవా?

India Vs Australia 3rd Odi: 3 వన్డేల సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా చెరొక వన్డే గెలిచాయి. దీంతో బుధవారం చెన్నైలో జరిగే మూడే వన్డే పై అందరి దృష్టి ఉన్నది. విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో భారత్ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉన్నప్పటికీ జట్టు స్కోరు కనీసం 120 కూడా దాటకపోవడం విశేషం. ఈ స్వల్ప స్కోరును ఆస్ట్రేలియా వికెట్ పోగొట్టుకోకుండా ఛేదించింది. దీంతో వన్డే సిరీస్ ను […]

Written By:
  • Rocky
  • , Updated On : March 21, 2023 / 02:36 PM IST
    Follow us on

    India Vs Australia 3rd Odi

    India Vs Australia 3rd Odi: 3 వన్డేల సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా చెరొక వన్డే గెలిచాయి. దీంతో బుధవారం చెన్నైలో జరిగే మూడే వన్డే పై అందరి దృష్టి ఉన్నది. విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో భారత్ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉన్నప్పటికీ జట్టు స్కోరు కనీసం 120 కూడా దాటకపోవడం విశేషం. ఈ స్వల్ప స్కోరును ఆస్ట్రేలియా వికెట్ పోగొట్టుకోకుండా ఛేదించింది. దీంతో వన్డే సిరీస్ ను 1_1 తో సమం చేసింది.

    ఇక ఈ ఓటమితో భారత జట్టు పై తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది. ఆఖరి పోరుకు సిద్ధమైంది.. బుధ వారం చెన్నైలోని చెపాక్ మైదానంలో జరగనున్న మూడవ వన్డేలో అమితుమి తేల్చుకొనుంది. ఇరుజట్లు సమవుజ్జీలుగా నిలవడంతో చివరి మ్యాచ్లో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుండడంతో ఇరుజట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ పది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలని రోహిత్ సేన రగిలిపోతుంది. మరోవైపు రెండో వన్డేలో గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఆస్ట్రేలియా.. అదే ఊపులో మూడో వన్డే కూడా గెలిచి సిరీస్ దక్కించుకోవాలని ఉబలాటపడుతుంది. దీంతో చెన్నై వన్డే పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

    ఇక రెండో వన్డేలో ఓడిపోయిన నేపథ్యంలో భారత జట్టు మార్పులకు శ్రీకారం చుడుతుంది అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే చెన్నై లోకల్ హీరో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. చేపాక్ స్టేడియం స్పిన్ కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో జట్టు వైపు మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అతడిని ఆడించాలని జట్టు భావిస్తే అక్షర్ పటేల్ పై వేటు పడే అవకాశం ఉంది. ఈ ఒక్క స్థానానికి మించి జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశాలు కల్పించడం లేదు. ఒకవేళ ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్య ఎదుర్కొంటే మార్పులు తప్పకపోవచ్చు.

    వన్డేల్లో విఫలమవుతున్న సూర్య కుమార్ యాదవ్ కు ఈ మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం దక్కొచ్చు. ఎందుకంటే అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆట గాడు జట్టులో లేకపోవడంతో అతడికి అవకాశాలు ఇస్తున్నారు. ఒకవేళ కిషన్ ను ఆడించాలనుకుంటే సూర్య పై వేటు తప్పకపోవచ్చు. విశాఖ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సూర్యకు మరో అవకాశం ఇస్తామని హిట్ ఇచ్చాడు. అయ్యర్ ఎప్పుడు జట్టులోకి వస్తాడో తెలియదు కాబట్టి.. సూర్య తప్ప మాకు వేరే ఆప్షన్ లేదని రోహిత్ వివరించాడు. ఇక తెల్లబంతి మీద తాను ఏమిటో నిరూపించుకున్నాడు కాబట్టి.. కచ్చితంగా సూర్యకే అవకాశం ఇస్తామని రోహిత్ వివరించాడు.

    India Vs Australia 3rd Odi

    ఇక రెండు మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమైన శుభమన్ గిల్ మూడే వన్డే లోనూ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. కెప్టెన్ రోహిత్ కూడా విశాఖపట్నం వన్డేలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరి జోడి మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ విశాఖపట్నం వన్డేలో కుదురుకున్నట్టు కనిపించినప్పటికీ.. ఇన్ స్వింగర్ డెలివరీకి అవుట్ అయ్యాడు.. విరాట్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక సూర్య కుమార్ యాదవ్ కు ఇది డు ఆర్ డై మ్యాచ్. తొలి వన్డేలో జట్టును గెలిపించిన కేఎల్ రాహుల్.. రెండో వన్డేలో మాత్రం తేలిపోయాడు. అతడు కూడా మొదటి వన్డే స్థాయి ప్రదర్శన చేయాల్సి ఉంది. ఇక హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ ప్రదర్శన చేయాల్సి ఉంది. మొదటి వన్డేలో కీలకంగా ఆడిన రవీంద్ర జడేజా.. రెండో వన్డేలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో జట్టు అతడి నుంచి ఆల్ రౌండర్ ప్రదర్శన ఆశిస్తోంది.

    బౌలింగ్ విభాగం మొదటి వన్డేలో సత్తా చాటినప్పటికీ.. రెండో వన్డేలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ నుంచి జట్టు మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. లోకల్ బాయ్ సుందర్ ను గనుక ఆడించాలనుకుంటే అక్షర్ బెంచ్ కే పరిమితమవుతాడు. ప్రధాన పేపర్లు మహమ్మద్ సిరాజ్, షమీ విషయంలో జట్టు ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ షమీ కి ఇవ్వాలి అనుకుంటే జయదేవ్ లేదా ఇమ్రాన్ మాలిక్ లో ఎవరో ఒకరు జట్టులోకి వస్తారు.

    జట్టు అంచనా ఇలా

    రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లీ, హార్దిక్ పాండ్యా ( వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/ వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్, షమీ/ ఉమ్రాన్ మాలిక్, సిరాజ్.

    Tags