World Cup 2023: ఇంకో వారం రోజుల్లో వరల్డ్ కప్ రాబోతున్న నేపధ్యం లో ఇప్పటికే ఇండియన్ టీం ఫుల్ ఫామ్ లో ఉంది.ఇక
మిగితా టీములు కూడా ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ కొట్టాలని అనే కసి తో ఉన్నట్టు గా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో చాలా రికార్డు లు క్రియేట్ అయి ఉన్నాయి వాటిలో కొన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం…
ముందుగా క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్ విషయానికి వస్తే ఈయన ఇండియన్ టీం కి దాదాపు 20 సంవత్సరాల వరకు కూడా తన సేవలు అందించడం జరిగింది. అయితే ఈయనకి వరల్డ్ కప్ లో చాలా మంచి రికార్డు ఉంది. 2003 వ సంవత్సరం లో వరల్డ్ కప్ లో 11 మ్యాచులు ఆడిన సచిన్ టెండూల్కర్ 673 పరుగులు చేసాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రికార్డు ని అందరు బ్రేక్ చేయాలని చూసారు కానీ దాన్ని బ్రేక్ చేయడం ఎవ్వరి వాళ్ళ కాలేదు.ఇక ఈ విషయం ఇలా ఉంటె సచిన్ అంటే అప్పట్లో ఇండియా లోనే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా చాలా క్రేజ్ ఉండేది. ఆయన బ్యాటింగ్ కి వచ్చాడంటే చాలు బౌలర్లు కూడా భయం తో వణికిపోయేవారు అలాంటి సచిన్ తన జీవిత కాలం లోఒక్కసారైనా వరల్డ్ కప్ ని ముట్టుకుంటాడా లేదా అని తనలో తాను చాలా బాధపడ్డాడట కానీ 2011 లో ధోని సారధ్యం లో ఆడిన ఇండియన్ టీం వరల్డ్ కప్ దక్కించుకొని సచిన్ కి ఘనమైన వీడ్కోలు పలికింది. ఆ విషయాన్నీ సచిన్ ఇప్పటికి గుర్తు చేసుకుంటూ ఉంటాడు…
ఇక ఈ లిస్ట్ లో చెప్పుకునే మరో ప్లేయర్ మార్టిన్ గుప్తిల్ న్యూజిలాండ్ కి చెందిన ఈయన 2015 లో వరల్డ్ కప్ లో వెస్ట్ ఇండీస్ మీద ఆడిన మ్యాచ్ లో తనొక్కడే 237 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.ఇక ఇప్పటికి దానిని ఎవ్వరు బ్రేక్ చేయలేదు.
అలాగే వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఎక్కువ సెంచరీస్ చేసిన ప్లేయర్లు గా సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ ఇద్దరు నిలిచారు వీళ్లు ఇప్పటి వరకు 6 సెంచరీ లు చేసి నెంబర్ వన్ గా కొనసాగుతున్నారు.ఇకఇప్పటి వరకు ఈ రికార్డు ని ఎవ్వరు బ్రేక్ చేయలేదు.
ఇక బౌలింగ్ దిగ్గజం అయినా ఆస్ట్రేలియన్ పేసర్ గ్లేన్ మెగ్రాత్ ఆయన ఆడిన టోటల్ వరల్డ్ కప్ కెరియర్ లో ఇప్పటి వరకు 71 వికెట్లు తీసాడు ఈ రికార్డు ని కూడా ఇంత వరకు ఎవ్వరు బ్రేక్ చేయలేదు.అలాగే 2003 వరల్డ్ కప్ లో ఆయన నమీబియా మీద ఒకే మ్యాచ్ లో 7 వికెట్లు తీసాడు ఈ రికార్డు ని కూడా ఎవ్వరు బ్రేక్ చేయలేదు.ఇక మరో ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయినా మిచెల్ స్టార్క్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో 49 వికెట్లు తీసాడు ఆయన ఈ ఇయర్ కూడా వరల్డ్ కప్ ఆడుతున్నాడు కాబట్టి మెగ్రాత్ రికార్డు ఏమైనా బ్రేక్ అవుతుందేమో చూడాలి…
2015 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ ప్లేయర్లు అయినా క్రిస్ గేల్, శ్యామ్యూల్స్ ఇద్దరు కలిసి జింబాబే టీం మీద ఆడిన ఒక మ్యాచ్ లో 372 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం జరిగింది.ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ 215 పరుగులు చేయగా,శ్యామ్యూల్స్ మాత్రం 133 పరుగులు చేసాడు…
ఇక చాలా మంది ప్లేయర్లు వరల్డ్ కప్ లో ఒక సెంచరీ చేయడానికే చాలా ఇబ్బందులు పడుతుంటే ఇండియన్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ మాత్రం 2019 వరల్డ్ కప్ లో ఏకంగా 5 సెంచరీలు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసాడు.ఇక గత వరల్డ్ కప్ లోనే ఈ ఫీట్ ని సాధించాడు కాబట్టి ఈ వరల్డ్ కప్ లో దానిని ఎవరైనా బ్రేక్ చేస్తారేమో చూడాలి…
ఇక ఆస్ట్రేలియా టీం వరల్డ్ కప్ లో భాగం గా 2015 వ సంవత్సరం లో ఆఫ్గానిస్తాన్ మీద జరిగిన మ్యాచ్ లో 417 పరుగులు చేసి వరల్డ్ కప్ లో ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన టీం గా రికార్డు ని నెలకొల్పింది…
ఇక ఈ ఇయర్ జరుగుతున్నా వరల్డ్ కప్ లో ఈ రికార్డుల్లో కనీసం కొన్ని రికార్డులు అయినా బ్రేక్ అవ్వాలని కోరుకుందాం…