T20 World Cup 2024: 2024 జూన్ లో వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఐసిసి నిర్వహించే టి20 వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇక ఈ టోర్నీ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే 20 జట్లు నాలుగు గ్రూపులుగా ఈ మ్యాచ్ లను ఆడనున్నాయి అయితే గ్రూప్ ఏ లో ఇండియా పాకిస్తాన్ టీమ్ లు ఉన్నాయి. ఇక 1 వ తేదీన అమెరికా, కెనడా ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ తో ఈ టోర్నీ స్టార్ట్ అవుతుంది. జూన్ 5వ తేదీన ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్ తో ఇండియా తను మొదటి మ్యాచ్ ని ఈ టోర్నీలో ప్రారంభం చేయబోతుంది. ఇక ఇదిలా ఉంటే టి20 వరల్డ్ కప్ లో ఇండియన్ టీం తరఫున ఏ ప్లేయర్లు బరిలోకి దిగబోతున్నారు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.
అలాగే టీమ్ కి కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారు అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. రోహిత్ శర్మ టి20 వరల్డ్ కప్ కి అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. 2022 టి 20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ మీద సెమి ఫైనల్ మ్యాచ్ లో ఆడిన తర్వాత రోహిత్ శర్మ అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క టి20 మ్యాచ్ కూడా ఆడలేదు. మరి ఇలాంటి సమయంలో ఆయన టీమ్ లోకి వచ్చి కెప్టెన్సీ చేస్తాడా ఇక ఆయనతో పాటు మరొక సీనియర్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ కూడా టీంలోకి వస్తున్నాడా అనేది తెలియాలి. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళు టీమ్ లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక వీళ్లతో పాటుగా 2022 డిసెంబర్ లో రోడ్డు ప్రమాదానికి గురైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా టీం లోకి వస్తున్నట్టు గా తెలుస్తుంది.
2024 ఐపిఎల్ లో ఢిల్లీ టీం తరఫున రిషభ్ పంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు గా తెలుస్తుంది. రిషబ్ పంత్ కనక టీం లోకి వస్తే ఎక్స్ ట్రా వికెట్ కీపర్ గా జితేష్ శర్మ కి అవకాశం దక్కదు. ఎందుకంటే రిషబ్ పంత్ టీం లోకి వస్తే ఎక్స్ ట్రా వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ కొనసాగుతాడు. ఇక జితేశ్ శర్మ తో పాటు సంజు శాంసన్ కి కూడా అవకాశం దక్కే ఛాన్స్ అయితే లేదు…ఇక ఇప్పుడు టి 20 వరల్డ్ కప్ కోసం ఇండియన్ టీం ఏ ప్లేయర్లతో అయితే బరిలోకి దిగబోతుందో ఆ టీం ప్లేయర్లను ఒకసారి మనం చూద్దాం…
మన అంచన ప్రకారం టి20 వరల్డ్ కప్ లో చోటు కల్పించు కునే ఇండియన్ టీమ్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే…
రోహిత్ శర్మ (కెప్టెన్),విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్,యశస్వి జైశ్వాల్,సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్( వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, కే ఎల్ రాహుల్, రింకు సింగ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్డీప్ యాదవ్,రవి బిష్ణోయ్,మహమ్మద్ సిరజ్, జస్ప్రిత్ బుమ్ర, అర్షదీప్ సింగ్…