Asia Cup 2023: 2023 ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లకు సర్వం సిద్ధమవుతోంది. ఇంకొక రెండు వారాలలో ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగబోయే ఈ టోర్నీ క్రికెట్ అభిమానులకు ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ థాలీ లాంటిది. అయితే ఈ సిరీస్లో పక్కా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మ్యాచ్లు ఏమో చూద్దామా…ఈ డేట్స్ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి…
భారత్ వర్సెస్ పాకిస్థాన్
చిరకాల ప్రత్యర్ధులు భారత్ ,పాకిస్తాన్ తలపడుతుంటే ఆ మ్యాచ్ ఏ రేంజ్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ చూడడం కోసం కేవలం ఈ రెండు దేశాల ప్రజలే కాదు యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తుంది. లాస్ట్ ఇయర్ జరిగిన టి20 ప్రపంచ కప్ లో మెల్బోర్న్ స్టేడియంలో జరిగిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్ హిస్టరీ లోనే అత్యుత్తమమైన మ్యాచ్ గా నిలిచిపోయింది.
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ పర్ఫామెన్స్ అందరి హృదయాలను దోచుకుంది. ఇప్పుడు తిరిగి ఆసియా కప్ మ్యాచ్ కారణంగా మరొకసారి అభిమానులకు ఈ రెండు జట్ల మధ్య జరగనున్న హై టెన్షన్ మ్యాచ్ చూసే అవకాశం వచ్చింది. ఈ హాయ్ వోల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ రెండవ తారీకున జరుగుతుంది. అయితే విషయం అక్కడితో అయిపోలేదు కాలం కలిసి వస్తే ఈ టోర్నీలో లీగ్,సూపర్ ఫోర్ ,ఫైనల్..అంటే మొత్తానికి మూడుసార్లు ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ వెర్సెస్ శ్రీలంక:
ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ పోరు తర్వాత అత్యంత ఉత్కంఠమైన పోరు జరిగే మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక. నిదహాస్ ట్రోఫీ తర్వాత నుంచి ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్నటువంటి పోటీ ఆసక్తికరంగా మారింది. ఇండియా, బంగ్లాదేశ్ ,శ్రీలంక మధ్య జరిగిన ట్రై సిరీస్ టోర్నీలో శ్రీలంక బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. శ్రీలంకను ఓడించాము అన్న ఆనందం పట్టలేక బంగ్లాదేశ్ ఆటగాళ్లు నాగిని డాన్స్ వేసి స్టేడియంలో రచ్చ పుట్టించారు.
ఈ ఇన్సిడెంట్ తో రెండు జట్ల మధ్య గొడవ కూడా జరిగింది. ఇక అప్పటినుంచి ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా..స్లెడ్జింగ్, నాగినీ డ్యాన్స్ లాంటి పర్ఫామెన్స్ కామన్ అయిపోయింది. ఆగస్టు 31 న ఈ రెండు జట్లు తెలపడనున్నాయి. మెరుగ్గా రానిస్తే వీళ్లు కూడా మూడుసార్లు ఈ టోర్నీలో తలపడే ఛాన్స్ పొందుతారు.
శ్రీలంక వెర్సెస్ పాకిస్థాన్:
ఆసియా కప్ 2022 టోర్నీలో లంక ప్లేయర్లను తక్కువ అంచనా వేసిన పాక్ ప్లేయర్స్ కు చుక్కేదిరయ్యింది. ఫైనల్స్ లో సూపర్ ఫీల్డింగ్ చేసి పాక్ ఆటగాలను కట్టడి చేయడమే కాకుండా శ్రీలంక టైటిల్ ని కూడా చేజెక్కించుకుంది. అప్పటి ఓటమికి ఎలాగైనా ఇప్పుడు బదులు చెప్పాలి అని పాకిస్తాన్ మంచి కసి మీద ఉంది. ప్రస్తుతానికి వేరువేరు గ్రూప్స్ లో ఉన్న ఈ జట్లు సూపర్ 4 లో ఒకరితో ఒకరు తలపడే ఛాన్స్ ఉంది.
భారత్ వర్సెస్ శ్రీలంక
ఆసియా కప్ 2022 టోర్నీ సూపర్-4లో భారత్ ను శ్రీలంక ఓడించింది. అలా శ్రీలంక కారణంగా టీమిండియా ఫైనల్స్ కు చేరలేకపోయింది. కాబట్టి ఈసారి జరగబోయే ఆసియా కప్ లో అప్పటి ఓటమికి బదులు ఇవ్వాలి అని టీమిండియా తహతహలాడుతోంది. ప్రస్తుతానికి వేరువేరు గ్రూప్స్ లో ఉన్న ఈ రెండు జట్లు కూడా సూపర్ 4 లో తలపడే ఆస్కారం ఉంది.