Homeక్రీడలుIPL 2023 Umpiring Mistakes: ఇదేం ఎంపైరింగ్ అయ్యా.. ఐపీఎల్ లో నవ్వుకుంటున్నారు..!

IPL 2023 Umpiring Mistakes: ఇదేం ఎంపైరింగ్ అయ్యా.. ఐపీఎల్ లో నవ్వుకుంటున్నారు..!

IPL 2023 Umpiring Mistakes: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఐపీఎల్. అటువంటి లీగ్ లో ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండాలి. మరి ముఖ్యంగా ఎంపైరింగ్ అద్భుతంగా ఉండాలి. కానీ ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ లో అనేక ఎంపైరింగ్ తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి. క్రికెట్ పట్ల కాస్తో, కూస్తో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఇదేమి ఎంపైరింగ్ అంటూ పెదవి విరిచే పరిస్థితి ప్రస్తుత ఐపీఎల్ లో ఏర్పడింది. అనేక తప్పుడు నిర్ణయాలతో ఈ లీగ్ పట్ల అభిమానులకు సందేహాలు ఏర్పడే స్థితికి తీసుకువచ్చారు నిర్వాహకులు. ఎంపైర్లు తీసుకునేటప్పుడు నిర్ణయాల వల్ల ఫిక్సింగ్ ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

అభిమానులకు ఐపిఎల్ అంటే ఓ పెద్ద పండగ సీజన్. రెండు నెలలపాటు క్రికెట్ మజాను ఆస్వాదిస్తుంటారు అభిమానులు. క్రికెట్ అభిమానులకు నాన్ స్టాప్ వినోదం అందిస్తున్నా.. కొన్ని విమర్శలను సైతం మూటగట్టుకుంటోంది ఈ లీగ్. ముఖ్యంగా ఎంపైర్లు తీసుకునే నిర్ణయాలు పట్ల క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన రెండు సంఘటనలు అయితే అసలు ఇది ఎంపైరింగ్ అంటారా..? అనేలా ఉన్నాయంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంత చెత్త ఎంపైరింగ్ ను గల్లి క్రికెట్లో కూడా చూడలేము అంటూ సెటైర్లు వేస్తున్నారు.

అభిమానుల ఆగ్రహానికి కారణం ఇదే..

అభిమానులు ఆగ్రహానికి అనేక కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. చెన్నై – పంజాబ్ మ్యాచ్ సందర్భంగా పంజాబ్ విజయానికి పది బంతుల్లో 15 పరుగులు అవసరమైన దశలో తుషార్ దేశ్ పాండే వేసిన 19వ ఒవర్ లో జితేష్ శర్మ లాంగ్ ఆన్ దిశగా ఆడిన భారీ షాట్ ను సీఎస్కే ఫిల్టర్ రషీద్ ఖాన్ అందుకున్నాడు. ఆ సమయంలో అతని కాలు బౌండరీ లైన్ కు తాకినట్లు రిప్లే లో కనిపిస్తోంది. కానీ బౌండరీ రోప్ లో కదలిక లేదనే కారణంతో అంపైర్ దాన్ని అవుట్ గా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. చెన్నైకి ఫేవర్ గా ఈ నిర్ణయం తీసుకున్నారంటూ క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. అయితే మ్యాచ్ పంజాబ్ గెలవడంతో ఆ వివాదం అక్కడితో సమసిపోయింది. కానీ ఆ నిర్ణయం మాత్రం తప్పు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రాజస్థాన్ – చెన్నై మ్యాచ్ లో అదే పునరావృతం..

తర్వాత జరిగిన రాజస్థాన్ – ముంబై మ్యాచ్ లోనూ ఇటువంటి వివాదాస్పద నిర్ణయమే ఎంపైర్లు తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ కాలేదని, అయినా ఎంపైర్ అవుట్ ఇచ్చాడంటూ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. వికెట్లకు తాకలేదని, వికెట్ కీపర్ సంజు శాంసన్ గ్లౌజులు బెయిల్స్ ను తాకాయని రిప్లేలో క్లియర్ గా తెలుస్తున్నా ఎంపైర్ అవుట్ ఇచ్చాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇంత పెద్ద లీగ్ లో ఇంత నూతన టెక్నాలజీ ఉన్నా కూడా ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు జరగడం దారుణమంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల కీలకమైన మ్యాచ్ ల్లో ఓటమిపాలు కావాల్సిన పరిస్థితి పలు జట్లకు ఏర్పడిందని పలువురు పేర్కొంటున్నారు. ఇటువంటి నిర్ణయాలు ఎప్పటికప్పుడు జరుగుతుండడంతో వల్ల ఫిక్సింగ్ ఆరోపణలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

Most Popular

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper
Exit mobile version