Homeక్రీడలుWorld Cup Qualifier Super Six Schedule: వరల్డ్ కప్ క్వాలిఫైయర్ సూపర్ సిక్స్ షెడ్యూల్...

World Cup Qualifier Super Six Schedule: వరల్డ్ కప్ క్వాలిఫైయర్ సూపర్ సిక్స్ షెడ్యూల్ విడుదల.. తలపడనున్న ఈ జట్లు..!

World Cup Qualifier Super Six Schedule: భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి జరగనున్న వన్డే వరల్డ్ కప్ కు సంబంధించి క్వాలిఫైయర్ మ్యాచ్ లు ప్రస్తుతం జరుగుతున్నాయి. వరల్డ్ కప్ క్వాలిఫైయర్ 2023 గ్రూపు దశ కూడా చివరి అంకానికి చేరుకుంది. మరో నాలుగు మ్యాచ్ లు జరగాల్సి ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ బెర్తులు ఇప్పటికే ఖరారు అయ్యాయి. ముఖ్యంగా సూపర్ సిక్స్ దశకు కొన్ని కొన్ని జట్లు చేరుకున్నాయి. అందరి అంచనాలను తల కిందులు చేస్తూ ఐర్లాండ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడం గమనార్హం. అయితే, సూపర్ సిక్స్ దశకు సంబంధించిన తాజాగా విడుదలైంది. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29 నుంచి జూలై 7వ తేదీ వరకు సూపర్ సిక్స్ మ్యాచులు జరగనున్నాయి. జూలై 9న క్వాలిఫైయర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

వన్డే వరల్డ్ కప్ కోసం ఒకపక్క అగ్రశ్రేణి జట్లు సిద్ధమవుతుంటే.. మరోపక్క ఈ టోర్నీలో చోటు దక్కించుకునేందుకు క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడుతున్నాయి మరికొన్ని జట్లు. క్వాలిఫైయర్ మ్యాచ్లు కూడా దాదాపు ముగింపు దశకు వచ్చాయి. ఈనెల 29 నుంచి సూపర్ సిక్స్ దశ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. సూపర్ సిక్స్ దశలో మొత్తం 9 మ్యాచులు జరగనుండగా, ఒక్కో గ్రూపులోని మూడు జట్లు మరో గ్రూపులోని మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. టోర్నీలో మరో నాలుగు గ్రూపు దశ మ్యాచులు మిగిలి ఉన్నాయి. దీంతో సూపర్ సిక్స్ దశలో ఏ జట్టు.. ఏ జట్టుతో ఆడనుందో తేలాల్సి ఉంది.

ఈ జట్ల మధ్య జరగనున్న మ్యాచులు..

గ్రూప్ ఏ లో జింబాబ్వే తొలి స్థానాన్ని ఖరారు చేసుకుంది. వెస్టిండీస్ నెదర్లాండ్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు రెండో స్థానంలో నిలుస్తుంది. గ్రూప్ బి నుంచి శ్రీలంక స్కాట్లాండ్ మధ్య మంగళవారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టు గ్రూపు బిలో టాపర్ గా నిలుస్తుంది. మరో జట్టు ఒమన్ తమ కోట మ్యాచులు పూర్తి చేసుకోవడంతో ఓడిన జట్టు రెండో స్థానంలో ఉంటుంది. అలాగే సూపర్ శిక్షకు చేరిన జట్లు తమ గ్రూపులోని మిగతా రెండు జట్లపై విజయం సాధించి ఉంటే రెండు పాయింట్లతో తదుపరి దశకు చేరనున్నాయి. గ్రూప్ ఏ లో జింబాబ్వే తమ గ్రూపులోని నెదర్లాండ్స్, వెస్టిండీస్పై విజయాలు సాధించడంతో సూపర్ సిక్స్ దశకు రెండు పాయింట్లతో అడుగుపెట్టనుంది. అదేవిధంగా గ్రూపు బిలో శ్రీలంక స్కాట్లాండ్ మధ్య మంగళవారం జరగనున్న మ్యాచ్ లో విజేత రెండు పాయింట్లు సూపర్ సిక్స్ కు చేరుకుంటుంది.

ఇది సూపర్ సిక్స్ మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్..

ఇక తాజాగా సూపర్ సిక్స్ మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. అన్ని మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈనెల 29న గ్రూప్ ఏ లో రెండో స్థానంలో నిలిచిన జట్టుకు, గ్రూపు బీలో రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు మధ్య మ్యాచ్ జరగనుంది. అలాగే ఈ నెల 30న గ్రూప్ ఏ లో మూడో స్థానంలో నిలిచిన జట్టుకు, గ్రూపు బీలో ఒకటో స్థానంలో నిలిచిన జట్టుకు మ్యాచ్ జరుగుతుంది. అలాగే జూలై ఒకటో తేదీన గ్రూప్ ఏ లో ఒకటో స్థానంలో ఉన్న జట్టుకు గ్రూపు బీలో మూడో స్థానంలో ఉన్న జట్టుకు మధ్య మ్యాచ్ జరగనుంది. జూలై 2వ తేదీన గ్రూప్ ఏ లోని రెండో స్థానంలో నిలిచిన జట్టుకు, గ్రూప్ బి లోని ఒకటో స్థానంలో నిలిచిన జట్టుకు మధ్య మ్యాచ్ జరుగుతుంది. అలాగే జూలై మూడో తేదీన గ్రూపు ఏ లోని మూడో స్థానంలో నిలిచిన జట్టు, గ్రూపు బి లోని రెండవ స్థానంలో నిలిచిన జట్టు మ్యాచ్ ఆడనున్నాయి. అలాగే జులై 4న గ్రూపు ఏ లోని రెండో స్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్ బి లోని మూడో స్థానంలో నిలిచిన జట్టు మ్యాచ్ ఆడతాయి. అలాగే జూలై 5న గ్రూప్ ఏ లోని ఒకటో స్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్ బి లోని రెండో స్థానంలో నిలిచిన జట్టు మ్యాచ్ ఆడుతుంది. జూలై ఆరో తేదీన గ్రూప్ ఏ లో మూడో స్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్ బి లో మూడో స్థానంలో నిలిచిన జట్టు మ్యాచ్ ఆడుతుంది. జూలై 7న గ్రూప్ ఏ లో ఒకటో స్థానంలో నిలిచిన జట్టు, గ్రూపు బీలో స్థానంలో నిలిచిన జట్టు తలపడతాయి. సూపర్ సెక్స్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు జూలై 9న జరిగే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ ఫైనల్లో తలపడటంతో పాటు భారత వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తాయి.

Exit mobile version