IND VS NZ 2nd Test Match : వజ్రాన్ని వెతికే క్రమంలో బంగారాన్ని కోల్పోయారు.. ఇప్పటికైనా పూజారను జట్టులోకి తీసుకోండి..

సొంత గడ్డపై టీమిండియా ఆపసోపాలు పడుతోంది. స్వదేశంలో టెస్టులలో ఓటమి అనేది లేకుండా.. పుష్కరకాలంగా హేమా హేమీలాంటి జట్లను సైతం ఓడించిన టీమిండియా న్యూజిలాండ్ ముందు తలవంచుతోంది..

Written By: Anabothula Bhaskar, Updated On : October 25, 2024 9:46 pm

Chateshwar Pujara

Follow us on

IND VS NZ 2nd Test Match :  ఇప్పటికే బెంగళూరు టెస్ట్ ను ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఎలాగైనా గెలవాల్సిన పరిస్థితి భారత జట్టు ది. ఈ టెస్ట్ లో గెలిస్తేనే సిరీస్ పై ఆశలుంటాయి. లేకుంటే టీమిండియా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. పైగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ముందు టీమిండియాకు రెండవ టెస్టులో గెలుపు అత్యంత అవసరం. అయితే ఆ దిశగా టీమిండియా ఆట తీరును ప్రదర్శించడం లేదు. పైగా పూణే టెస్టులోనూ బెంగళూరు లో మాదిరిగానే ఆడుతోంది. దీంతో రోహితసేనపై అభిమానులు మండిపడుతున్నారు.. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొస్తున్నారు.. టాప్ ఆర్డర్ విఫలమవుతున్న నేపథ్యంలో టీమిండియా ఒకప్పటి డిపెండబుల్ ఆటగాడు చటేశ్వర్ పూజారను జట్టులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పూణే టెస్టులో అత్యంత దారుణమైన ఆట తీరు ప్రదర్శించారు. దీంతో వారిపై అభిమానులు మండిపడుతున్నారు. రంజీల్లో పూజార అదరగొడుతున్నాడని.. అతడిని జట్టులోకి తీసుకురావాలని సెలెక్టర్లకు సోషల్ మీడియా వేదికగా విన్నవిస్తున్నారు.

అభిమానులు ఏమంటున్నారంటే..

” మాకు పూజార కచ్చితంగా కావాలి. ఆస్ట్రేలియా మైదానాలపై వైట్ బాల్ ఆడేవారు అంతగా రాణించలేరు. సీమ్ కు ఉపకరించే మైదానాలపై రోహిత్ శర్మ పెద్దగా బ్యాటింగ్ చేయలేడు. సీనియర్ ఆటగాళ్లను దేశీయ క్రికెట్ ఆడేలా చేయాలి.. అప్పుడే జట్టు బాగుపడుతుంది.. ఇటీవలి రంజి క్రికెట్ లో కోహ్లీ, రోహిత్, బుమ్రా కు విశ్రాంతి ఇచ్చారు. కానీ వారేమో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లపై తేలిపోయారు. మిగతావారు ఆటడం వల్లే బంగ్లాదేశ్ పై భారత్ గెలిచింది.. అవసరమైన సమయంలో వారు ఆడక పోవడం వల్ల న్యూజిలాండ్ పై ఓటమిపాలైంది. పూణే టెస్టులో భారత్ ఇప్పటికే కష్టాల్లో ఉంది. రోహిత్, విరాట్ రెండవ ఇన్నింగ్స్ లో సత్తా చాటాల్సి ఉంది. లేకపోతే ఇక్కడ కూడా ఓటమి తప్పదని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు..” ఒక మ్యాచ్ లో పేస్ బౌలింగ్ కు దాసోహమయ్యారు. మరో మ్యాచ్ లో స్పిన్ బౌలింగ్ కు చేతులెత్తేశారు. దీనిపై ఎలాంటి సాకులు చెప్పినా అతకవు.. సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం తోనే వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ పై స్టీవ్ ఒకిఫ్ ఆరు వికెట్లు సాధించాడు. మళ్లీ ఏడు సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ బౌలర్ సాంట్నర్ 7 వికెట్లు తీశాడు. భారత మైదానంపై విదేశీ ఆటగాళ్లు రాణిస్తుంటే మనవాళ్లు పెవిలియన్ వెళ్లడానికి పోటీ పడుతున్నారని” అభిమానులు సామాజిక మాధ్యమాలలో మండిపడుతున్నారు. మరి ఇప్పటికైనా టీమిండియా మేనేజ్మెంట్ చటేశ్వర్ పుజారకు అవకాశం ఇస్తుందో? లేదో? చూడాలి.. అన్నట్టు సోషల్ మీడియాలో అభిమానులు వజ్రాన్ని వెతికే క్రమంలో బంగారాన్ని కోల్పోయారని.. బీసీసీఐ సెలక్షన్ కమిటీని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు.