Rohit Sharma: ముంబై ఇండియన్స్ టీం కొత్త కెప్టెన్ ని ప్రకటించడంతో ప్రస్తుతం ముంబై టీం అభిమానులందరూ తీవ్రమైన నిరాశని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీమ్ అంటేనే రోహిత్ శర్మ, రోహిత్ శర్మ అంటేనే ముంబై ఇండియన్స్ టీమ్ గా గుర్తించబడిన ఆ టీం ప్రస్తుతం రోహిత్ శర్మ ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి హార్దిక్ పాండ్య కి కెప్టెన్సీ ని అప్పగించడం అనేది చాలా దారుణమైన విషయం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు రోహిత్ శర్మ ని అవమానించినట్టుగానే తన అభిమానులు కూడా భావిస్తున్నారు.
ఎందుకంటే ఇప్పటికే ఐపీఎల్ ట్రోఫీని అందించిన రోహిత్ శర్మ ఒకసారి ఛాంపియన్స్ ట్రోఫీ ని కూడా అందించాడు. అంటే మొత్తం ఆరుసార్లు ట్రోఫీని అందించిన రోహిత్ శర్మ ని ఇప్పుడు కెప్టెన్ నుంచి తీశాడు కొంచెం బాధాకరమైన విషయం…ఇక ఈ విషయం పైన నిన్న ముంబై ఇండియన్స్ టీం యాజమాన్యం ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ 2013 వ సంవత్సరంలో రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో మీరు నవ్వుతూ స్వీకరించాలని మమ్మల్ని అడిగావు అప్పుడు మొదలైన మీ ప్రస్థానం కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ టీమ్ లో పది సంవత్సరాల పాటు కొనసాగింది.
ఎప్పుడు నవ్వుతూ టీమ్ మెంబర్స్ అందరిని కూడా నవ్విస్తూ ముంబై ఇండియన్స్ టీం కి ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించారు అలాగే ఒకసారి ఛాంపియన్ లీగ్ ని కూడా అందించావు అలాంటి ఒక గొప్ప క్రికెటర్ వి నువ్వు అలాగే ఒక గొప్ప సారధివి కూడా అలాగే ముంబై ఇండియన్స్ టీం కి మీరు అందించిన సేవలు మరువలేనివి ఒక్కసారి కూడా ట్రోఫీ దక్కించుకోని టీం కి మీరు వచ్చాక ఐదుసార్లు ట్రోఫీని తీసుకొచ్చి పెట్టారు మీరు నిజంగా గొప్ప కెప్టెన్ అనడం లో సందేహమే లేదు.ఇక ముంబై ఇండియన్స్ టీమ్ ని ఈ స్థాయిలో నిలబెట్టిన మీకు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు…
ఇక ఇదే విషయం మీద సీఎస్కే యాజమాన్యం కూడా స్పందిస్తూ రోహిత్ శర్మ కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ టీమ్ కి పది సంవత్సరాలపాటు తన ఎనలేని సేవలను అందించాడు. నిజానికి రోహిత్ శర్మ ఒక గొప్ప కెప్టెన్ ఆయన కెప్టెన్సీ చాలా అద్భుతంగా ఉంటుంది. రోహిత్ నువ్వు ఈ 10 సంవత్సరాలలో టీం తరపున ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొన్నావు అందుకే నువ్వంటే మాకు గౌరవం ఉంది అంటూ రోహిత్ శర్మ పైన సిఎస్కే తన అభిమానాన్ని చూపిస్తూనే ధోని రోహిత్ శర్మ కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది…
Ro,
In 2013 you took over as captain of MI. You asked us to . In victories & defeats, you asked us to . 10 years & 6 trophies later, here we are. Our , your legacy will be etched in Blue & Gold. Thank you, pic.twitter.com/KDIPCkIVop— Mumbai Indians (@mipaltan) December 15, 2023