Homeక్రీడలుIND vs PAK: ఆ రెండు ఓవర్లే మ్యాచ్ ను మలుపు తిప్పింది.. భారత్ ను...

IND vs PAK: ఆ రెండు ఓవర్లే మ్యాచ్ ను మలుపు తిప్పింది.. భారత్ ను గెలిచిందిలా!

IND vs PAK: టి20 ప్రపంచ కప్ వేటను టీం ఇండియా అదిరిపోయే ఆటతీరుతో ఆరంభించింది.. సూపర్ 12 లో భాగంగా పాకిస్తాన్ తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. విరాట్ మునుపటి విశ్వరూపంతో కేవలం 53 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 82 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అతడి అసమాన ఆట తీరుకు హార్దిక్ పాండ్యా కూడా తోడయ్యాడు. అతడు 37 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్ల సహాయంతో 40 పరుగులు చేశాడు. అబేధ్యమైన ఐదో వికెట్ కు వీరు 113 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

అసమాన ఆట తీరు

కోహ్లీ ఆటతీరుతో ఆదివారం నుంచే దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు మొదలయ్యాయి. నిన్నటి నుంచి ఇవాల్టి దాకా ఎవరి వాట్స్అప్ డిస్ప్లే పిక్చర్లు, స్టేటస్లు అన్నీ కూడా విరాట్ అసమాన ఆట తీరుతో నిండిపోయాయి. ప్రముఖ కామెంటర్ హర్ష భోగ్లే ఏకంగా విరాట్ కోహ్లీ ఆటతీరును ఆకాశానికి ఎత్తేసింది. అతడు ఎప్పుడూ ఏడవటం చూడలేదని ట్వీట్ చేసింది. ఇప్పుడు ఆ ట్వీట్ ట్విట్టర్లో ట్రెండింగ్ గా మారింది. ఐసీసీ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఏకంగా విరాట్ కోహ్లీ సింహాసనం మీద కూర్చున్న ఫోటోను ట్వీట్ చేసింది. నిన్న ఆడిన మ్యాచ్ ను డిస్నీ హాట్ స్టార్ లో కోటి 60 లక్షల మంది దాకా లైవ్ స్ట్రీమింగ్ చూశారు. ఇది అర్జెంటీనా, బ్రెజిల్ మ్యాచ్ ను మించిపోయింది. అక్కడిదాకా ఎందుకు ఆస్ట్రేలియాలోనే ప్రస్తుతం టి20 జరుగుతోంది కదా. మొన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగితే కనీసం స్టేడియం సగం లేదు. కానీ నిన్నటి పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ లో అయితే స్టేడియం పూర్తిగా నిండిపోయింది.

ఆ ఓవర్లే మలుపు తిప్పాయి

160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు ఒక దశలో 31 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. అసలు జట్టు విజయం దరిదాపుల్లో కూడా లేదు. ఇక చివరి 18 బంతుల్లో 48 పరుగులు కావలసిన దశలో దాదాపు అందరూ కూడా ఆశలు వదిలేసుకున్నారు. కానీ క్రీజ్ లో ఉన్న కోహ్లీపై ఎక్కడో ఒకచోట ఆశలు. ఇదే సమయంలో పాకిస్తాన్ పేసర్లు రౌఫ్, నసీం 16, 17 ఓవర్లలో భారత బ్యాట్స్మెన్ భారీ షాట్లు ఆడకుండా కట్టడి చేశారు. ఫలితంగా భారత జట్టుకు 12 పరుగులు మాత్రమే వచ్చాయి. విజయానికి ఇంకా 48 పరుగుల దూరంలో ఉండగా పాకిస్తాన్ వైపే మొగ్గు కనిపించింది. ఇక్కడి నుంచే ఆటను విరాట్ తన భుజ స్కంధా లపై వేసుకున్నాడు. ముందుగా షాహిన్ షా వేసిన 18వ ఓవర్ లో మూడు ఫోర్ల సహాయతో కోహ్లీ 17 పరుగులు చేశాడు. ఒకసారిగా కోట్లాది భారత ప్రేక్షకుల్లో ఆశలు చిగురించాయి. 19 ఓవర్ చివరి రెండు బంతుల్లో విరాట్ కోహ్లీ సాధించిన రెండు సిక్సర్లు ఈ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచాయి. 20 ఓవర్లో 16 పరుగుల లక్ష చేదన అత్యంత నాటకీయంగా జరిగింది. స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ తొలి బంతికే హార్దిక్ పాండ్యాను అవుట్ చేశాడు. నోబ్ గా వేసిన నాలుగో బంతిని కోహ్లీ డీప్ స్క్వేర్ లో సిక్సర్ గా మార్చడంతో స్టేడియం హోరెత్తి పోయింది. అయితే తీవ్ర ఒత్తిడిలో ఉన్న నవాజ్ తర్వాతి బంతిని వైడ్ గా వేశాడు. ఇక అధికారికంగా పూర్తయిన నాలుగవ బంతి కి దినేష్ కార్తీక్ వేగం కారణంగా మూడు పరుగులు రావడంతో రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరమయ్యాయి. అటు 5వ బంతికి దినేష్ కార్తీక్ స్టంప్ అవుట్ కావడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే అశ్విన్ స్ట్రైక్ తీసుకోవడంతో చివరి బంతికి రెండు పరుగులు వస్తాయా లేక సింగిల్ తో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీస్తుందా అనే టెన్షన్ కనిపించింది. కానీ నవాజ్ ఈ బంతిని కూడా వైడ్ గా వేసి భారత జట్టుకు రిలీఫ్ ఇచ్చాడు. ఇక ఆరో బాల్ ను అశ్విన్ చాలా కూల్ గా ఓవర్ మిడాఫ్ వైపు ఆడి ఒక పరుగు సాధించడంతో సంబరాలు మిన్నంటాయి.

ఆ రెండు ఓవర్లలో ఇలా

19 ఓవర్లో భారత్ జట్టు 15 పరుగులు సాధించింది.
18.1 హరీస్ వేసిన లెంగ్త్ బాల్. పాండ్యా సింగిల్ రన్ తీశాడు.
18.2 అవుట్ సైడ్ ద స్టంప్ లో స్లో బాల్. డీప్ కవర్ పాయింట్ లో కోహ్లీ ఒక పరుగు సాధించాడు.
18.3 అప్పర్ కట్ కొట్టబోయి మిస్ అయిన పాండ్యా: ఇక్కడ భారత జట్టుకు ఒక పరుగు కూడా లభించలేదు.
18.4 షార్ట్ బాల్- లాంగ్ ఆన్ లో పాండ్యా సింగిల్ రన్ తీసాడు.
18.5 స్లోయర్ షార్ట్ బాల్; కోహ్లీ సిక్సర్ కొట్టాడు.
18.6 ఫైన్ లెగ్ లోకి ఫ్లిక్ చేసి కోహ్లీ మరో సిక్స్ సాధించాడు.
19.1 నవాజ్ బౌలింగ్లో పాండ్యా అవుట్ అయ్యాడు.
19.2 ఫుల్టాస్ ను లాంగ్ ఆన్లోకి ఆడిన కార్తీక్ సింగిల్ రన్ తీశాడు
19.3 వైడ్ యార్కర్. లాంగ్ ఆన్ లోకి ఆడి కోహ్లీకి రెండు పరుగులు సాధించాడు.
19.4 నో బాల్. డీప్ స్క్వేర్ లో కోహ్లీ సిక్స్ కొట్టాడు. పాకిస్తాన్ ఆటగాళ్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అది నో బాల్ అని ఎంపైర్ ఎరాస్మస్ తేల్చి చెప్పాడు.
19.4 ఫ్రీ హిట్ అవకాశం: వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ లో పడిన బంతిని కోహ్లీ ఆడకుండా వదిలేశాడు.
19.5 కోహ్లీ బోల్డ్. అయితే అది ఫ్రీ హిట్టు కాబట్టి నాట్ అవుట్. వికెట్లకు తగిలిన బంతి నేరుగా షార్ట్ థర్డ్ మ్యాన్ కు వెళ్లడంతో పరుగులు పూర్తి చేశారు. ఇన్ని డెడ్ బాల్ గా ప్రకటించాలని పాకిస్తాన్ క్రీడాకారులు ఎంపైర్ను కొడితే.. మూడు బైయ్స్ ఇచ్చాడు.
19.5 కార్తీక్ స్టంప్ అవుట్. ఇంకా ఒక బంతికి రెండు పరుగులు కావాలి.
19.6 వైడ్ లెగ్ సైడ్ లో వెళ్తున్న బంతిని వదిలేసిన అశ్విన్
19.6 సింగిల్ ఆపేందుకు చుట్టూ మోహరించిన పాకిస్తాన్ ఫీల్డర్లు. చాకచక్యంగా మిడ్ ఆఫ్ లోకి బంతిని పంపి సింగిల్ తీసిన అశ్విన్. దీంతో భారత జట్టు సంబరాల్లో మునిగిపోయింది.

పొట్టి క్రికెట్ ఫార్మాట్లో ఎన్నో మ్యాచులు జరగవచ్చు. కానీ ప్రేక్షకులను ముని వేళ్ళ మీద నిలబెట్టిన ఘనత మాత్రం భారత జట్టుకే దక్కుతుంది. ఒక బౌల్ అవుట్. సూపర్ ఓవర్. ఆరు బాళ్ళకు ఆరు సిక్సర్లు. చివరి బంతి వరకు ఉత్కంఠ.. ఎలా చూసుకున్నా భారత జట్టు టి20 లో ఒక బెంచ్ మార్క్ ను సృష్టించింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular