Rinku Singh: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా కోల్ కతా జట్టు ఢిల్లీ జట్టుతో విశాఖపట్నంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను సాధించింది.. 106 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది.. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది. సునీల్ నరైన్ 85, రఘు వంశీ 54, రస్సెల్ 41 పరుగులు చేయడంతో కోల్ కతా జట్టు 272 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ ఏమాత్రం పోరాటం ప్రదర్శించలేదు. కీలక బ్యాటర్లు వెంటవెంటనే అవుట్ అయ్యారు. 17.2 ఓవర్లలోనే ఢిల్లీ జట్టు 166 పరుగులకు ఆలౌట్ అయింది. 106 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది.. ఈ విజయం ద్వారా పాయింట్ల పట్టికలో కోల్ కతా జట్టు తన మొదటి స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
అయితే ఈ మ్యాచ్ లో కోల్ కతా తరఫున రింకు సింగ్ ఆడిన ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం. 8 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లు బాది 26 పరుగులు చేశాడు. అతడు ఉన్నంతసేపు సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కోల్ కతా జట్టు స్కోర్ అమాంతం దూసుకుపోయింది. రస్సెల్ కంటే మరింత దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో కోల్ కతా ఆ స్థాయిలో స్కోర్ సాధించింది.
రింకు సింగ్ 26 పరుగులు చేసిన నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహక బృందం సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. Practice makes it perfect అని రాస్కొచ్చింది. ఈ వీడియోలో రింకు సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు అతడు పడుతున్న కష్టాన్ని ప్రతిబింబించాయి. రింకు సింగ్ తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో ఈ ఐపీఎల్ లో మోస్ట్ సెర్చింగ్ ఆటగాడిగా పేరుపొందాడు. రియాన్ పరాగ్ తర్వాత, ఆ స్థాయిలో అతడు ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. ఐపీఎల్ నిర్వాహక కమిటీ విడుదల చేసిన వీడియోలో ముందుగా రింకు సింగ్ మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనిపించాడు. ప్రాక్టీస్ లో అతడు పడ్డ కష్టం కళ్ళ ముందు కనిపించింది. ప్రాక్టీస్ లో ఎలాగైతే అతడు బ్యాట్ ఝుళిపించాడో.. మైదానంలోనూ అలాగే ఆడాడు. ఆ వీడియోను ఐపీఎల్ నిర్వాహ కమిటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. రింకు సింగ్ కు ఆట పట్ల ఉన్న నిబద్ధత ఎలాంటిదో అర్థమవుతున్నది. అతని ఆట తీరు పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Practice Makes It Perfect #TATAIPL | #DCvKKR | @rinkusingh235 | @KKRiders pic.twitter.com/qlSUXqRPM5
— IndianPremierLeague (@IPL) April 3, 2024